బంధం ఇలా ఉంటేనే బలపడుతోంది..

By: Bharath Reddy
Subscribe to Boldsky

ఇద్దరి మధ్య దృఢమైన బంధం కొనసాగాలంటే ఏం చేయాలి? లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ అనేది పూర్తి భిన్నంగా ఉంటుంది. నమ్మకం, ప్రేమ, స్నేహం వీటన్నింటిని కలబోత ఉంటేనే కలకాలం కలిసి ఉండగలుగుతారు. అలా అయితేనే దాంపత్య బంధం బలంగా ఉంటుంది. ఇద్దరి మనస్సులు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆ బంధంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది.

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పార్టనర్స్ మధ్య అర్థం చేసుకునేతత్వం కాస్త తక్కువ అవుతోంది. ఈ కాలంలో రిలేషన్స్ చాలా కామన్ అయిపోయాయి. కొద్ది రోజులు ఒకరితో హ్యాపీగా గడపడం తర్వాత చిన్నచిన్న సమస్యలకే ఆ బంధాన్ని తెంపుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు.

facts about long term relationship

ఒక వ్యక్తి మీతో దీర్ఘకాలిక సంబంధం కోరుకోవడం లేదని తెలిపే సంకేతాలు

జీవితాంతం తోడుండేలా బంధాన్ని ఏర్పరుచుకోవాలి. దీర్ఘ కాల సంబంధాలు అనేవి ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. మీరు చాలాకాలం పాటు ఎవరితోనైనా దీర్ఘకాల రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీరు కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తే మంచిది. కొన్ని రిలేషన్ షిప్స్ మీకు చాలా విషయాలు నేర్పుతాయి. మీరు మంచి పరిణతి చెందిన వ్యక్తిగా మారేందుకు ఇవి దోహదపడతాయి.

ఆనందకరమైన జీవితం గడపాలనుకుంటే దీర్ఘకాల సంబంధాలు చాలా అవసరం. మీకు జీవితంలో ఏవైనా ఆటుపోట్లు ఎదురైతే దీర్ఘకాలం రిలేషిప్ లో ఉన్న వ్యక్తులు మాత్రమే మీకు అండగా నిలుస్తారు. అయితే బాంధవ్యం బలపడడానికి మీకు ఎవరూ చెప్పని కొన్ని విషయాలు మీకోసం.

చిరాకు పెట్టొచ్చు

చిరాకు పెట్టొచ్చు

దీర్ఘకాల రిలేషన్ షిప్ అనేది ప్రతి రోజూ ఆనందమయంగా ఉండకపోవొచ్చు. అప్పుడప్పుడు చిరాకులు కూడా ఉంటాయి. మీ పార్టనర్ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇరిటేట్ చేయొచ్చు. కానీ మీరు ఆ సందర్భంలో చిరాకు పడకూడదు. ఆలోచించాలి. సూచనలు ఇవ్వాలి. అలా చేస్తే రిలేషన్ షిప్స్ పదిలంగా ఉంటుంది. ఇలా వ్యవహరించనప్పుడే మీ మెచ్యురిటీ ఏమిటో బయటపడుతుంది. మీ రిలేషన్ షిప్ బలంగా మారుతుంది.

మీరు ఊహించినంతగా ఉండకపోవొచ్చు

మీరు ఊహించినంతగా ఉండకపోవొచ్చు

సాధారణంగా రిలేషన్ షిప్ ఏర్పడక ముందు ఇక జీవితంలో ప్రతి రాత్రి ఓ మధురరాత్రే అనుకుంటారు అందరూ. తన పార్టనర్ చేసే ప్రతి టచ్ కూడా స్పైసీ గా ఉంటుందని ఊహించుకుంటుంటారు. అయితే లాంగ్ రిలేషన్ షిప్ పొందాక మాత్రం.. ఓహో.. నేను ఇమాజిన్ చేసుకున్నంత లేదే అని నిరుత్సాహపడుతుంటారు. దీనికి అంతగా నిరాశ చెందొందు. ఒక్కోసారి మీ పార్టనర్ పని ఒత్తిడిలో ఉండి మిమ్మల్ని అస్సలు పట్టించుకోకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు మీరు ఎంతో ఆనందంగా గడుపి ఉండొచ్చు. అయితే ఒకసారి కనీసం ఇద్దరు ఒక హగ్ కూడా చేసుకుని పరిస్థితి ఉంటుంది. పార్టనర్ ఒక్కసారి బిగి కౌగిలిలోకి తీసుకుంటారని వేచి చూసినా ఫలితం ఉండకపోవచ్చు. అంతమాత్రానా మీపై మీ భాగస్వామికి ప్రేమ లేదని కాదు. ఇద్దరి మధ్య ప్రేమను తెలిపేందుకు అవి మాత్రమే ఉంటే సరిపోదు. ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఇద్దరిలో ఉంటే చాలు. అలాగే ఇద్దరిలో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే చాలు. ఆ బాంధవ్యం చాలా బలంగా ఉంటుంది.

ఇతరులతో సానిహిత్యంగా ఉన్నారని అనుమానించొద్దు

ఇతరులతో సానిహిత్యంగా ఉన్నారని అనుమానించొద్దు

మీ భాగస్వామి ఎవరితోనైనా బాగా మాట్లాడడం లేదా సానిహిత్యంగా ఉండడం చేస్తున్నారా? అయితే అసలు విషయం ఏమిటో తెలుసుకోండి. మీరంతకు మీరే తను మిమ్మల్ని మోసం చేస్తున్నారని నిర్ణయానికి వచ్చేయకండి. ఇలా చిన్నచిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి మీ రిలేషన్ షిప్ ను కట్ చేసుకోకండి. ఒకరినొకరు అర్థం చేసుకుంది. బంధావ్యం బలంగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా చేసుకుంటూ పోతేనే దీర్ఘకాలిక సంబంధాలు గట్టిగా నిలబడతాయి.

క్షమించే గుణం ఉండాలి

క్షమించే గుణం ఉండాలి

ఒకరినొకరు క్షమించే గుణం లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ లో ఉండాల్సిన మొదటి లక్షణం. ఇలా లక్షణం ఉంటేనే మీ బంధం బలపడుతుంది. మీరు చాలా సున్నితంగా ఉండి అవతలి వ్యక్తిని అర్థం చేసుకోలేని లక్షణాలతో ఉంటే మాత్రం అది మీ దీర్ఘ కాల సంబంధాన్ని దెబ్బతీస్తుంది. మీలో క్షమించే గుణం ఉంటే మీ జీవితం ఆనందమయమే. ఏ సమస్య వచ్చిన మీ అంతకు మీరూ పరిష్కరించుకోలగుతారు.

కొన్నిసార్లు మీ మనస్సు గాయపడొచ్చు

కొన్నిసార్లు మీ మనస్సు గాయపడొచ్చు

లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ లో ఒక్కోసారి కొన్నిసార్లు మీ మనస్సు గాయపడొచ్చు. మీ భాగస్వామి మీ పట్ల చాలా మొరటుగా వ్యవహరించి ఉండొచ్చు. అలాగే మీరు చేసే పనులు ద్వారా కూడా మీ భాగస్వామి చికాకుపడొచ్చు. ఇలాంటివి ప్రతి రిలేషన్ షిప్ సాధారణంగా జరుగుతుంటాయి. అయితే మీరు అవన్నీ పక్కన పెట్టాలి. మీ పార్టనర్ ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇద్దరి మధ్య ప్రేమ విచ్చిన్నం కావడానికి ఇలాంటి చిన్నచిన్న విషయాలు కారణం కాకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

లాంగ్ రిలేషన్స్ బ్రేకప్ అవడానికి షాకింగ్ రీజన్స్..!

నటించొద్దు

నటించొద్దు

మీ పార్టనర్ తో మీరు ఏ విషయంలో కూడా నటించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు లాంగ్ రిలేషన్ షిప్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇక మీ భాగస్వాములతో రియాలిటిక్ గా ఉండండి. మీరు ముఖానికి నటన అనే ముసుగు ధరించాల్సిన అవసరమే లేదు. ఎంత నిజాయితీగా ఉంటే అంత మేలు. అది మీ రిలేషన్ షిప్ ను మరింత బలంగా మారుస్తుంది. ఒకరిపై ఒకరిపై నమ్మకం పెరిగిలే చేస్తుంది. అందుకే వీలైనంత వరకు నిజ జీవితంలో నటనకు దూరంగా ఉండండి. రిలేషన్ షిప్స్ ను పదిలం చేసుకోండి.

బాత్రూమ్ కూడా మీ బంధాన్ని బలపరుస్తుంది

బాత్రూమ్ కూడా మీ బంధాన్ని బలపరుస్తుంది

బాంధవ్యంలో ప్రతి ఒక్క విషయం ఇద్దరినీ దగ్గర చేసేదిగానే ఉంటుంది. మీ పార్టనర్ బాత్రూమ్ కు వెళ్లినప్పడు అక్కడ పొరపాటు నీరు రాకుంటే తనకు ఒక బకెట్ నీరు తీసుకెళ్లి ఇచ్చి చూడండి. అది కూడా ఇద్దరి మధ్య ప్రేమను పెంచే ఒక పాయింట్. నిత్య జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘనలు కూడా భాగస్వాముల మధ్య ప్రేమ పెంచేందుకు తోడ్పడుతాయి. ఇద్దరి మధ్య ఎప్పుడైతే ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే తత్వం ఏర్పడుతుందో అప్పుడే బంధం బలపడుతుంది. జీవితం సుఖంగా మారుతుంది.

వివాదాలను పట్టించుకోవొద్దు

వివాదాలను పట్టించుకోవొద్దు

లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ లో గుర్తించుకోవాల్సిన విషయం వివాదం. మీ మధ్య ఎంత పెద్ద గొడవలు జరిగినా కూడా మీరు మళ్లీ కలిసి ఉండక తప్పదు. మొదట ఇలాంటి గొడవలు కాస్త చికాకు పెట్టొచ్చు. కానీ మీరూ ఇద్దరూ బాగా దగ్గరయ్యాక మీ పార్టనర్ మీపై ఎంత దురుసుగా వ్యహరించినా కూడా బాధపడరు. ఒక్కసారి ఇద్దరి మధ్య సానిహిత్యం ఏర్పడ్డాక మీ మధ్య సాగే చిన్న చిన్న గొడవలు కూడా మీకు నచ్చుతాయి. అవే మీ అనుబంధాన్ని మరింత బలంగా మార్చుతాయి.

ప్రేమను వ్యక్తపరచండి

ప్రేమను వ్యక్తపరచండి

బాంధ్యవ్యాలలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరుచుకోవడం చాలా ముఖ్యం. ఎన్నో ఏళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న దంపతులు ఒకరిపై ఒకరికున్న ప్రేమను నిత్యం వక్తపరుచుకుంటూ ఉంటారు. వారు నిత్యం ఐ లవ్ యూ అంటూ ప్రేమను తెలుపుకుంటూ ఉంటారు. అందుకే వారి బంధాలు అంత బలంగా ఉన్నాయి. అందువల్ల బంధం మరింత బలపడాలంటే మాత్రం భాగస్వామితో ప్రతి విషయంలో ప్రేమగా వ్యవహరించాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం.

English summary

Facts About Long Term Relationship

Why have a long term relationship? Well, long-term relationships are totally different. When you are with someone for a long time...
Story first published: Friday, October 27, 2017, 15:52 [IST]
Subscribe Newsletter