రొమాంటిక్ మూవీస్, రీలేషన్ మీద ఎలా ప్రభావితం చూపుతాయి..

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో సినిమా అనేది ఒక శక్తివంతమైన సాధనం. ప్రపంచవ్యాప్తంగా 80 % మంది ప్రజలు వాళ్ళ జీవితంలో ఎదో ఒక సినిమా చూస్తూనే ఉంటారు.

ప్రజల యొక్క ఆలోచనలు మరియు అభిప్రాయాలు ఒక రూపం దాల్చడంలో సినిమాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. సినిమాలు వ్యక్తుల జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఇలా ప్రభావితం అవుతారు అనే విషయం, మీరు ఎటువంటి సినిమాలు చూస్తున్నారు అనేదాని పై ఆధారపడి ఉంటుంది.

రమ్యకృష్ణ గ్లామర్ ని చూసి అభిమానులు ఫిదా..!

ఒక నిర్దిష్టమైన వయస్సు వరకు కల్పితమైన చిత్రాలు, మిమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కానీ సమయం గడిచేకొద్దీ బయట ప్రపంచాన్ని మెల్ల మెల్లగా అర్ధం చేసుకుంటున్న మీకు జీవితం సినిమా కాదు అనే విషయాన్ని గుర్తిస్తారు.

ఈ క్రింద ప్రేమ మరియు శృంగారం కలగలిపిన కల్పితమైన రంగుల ప్రపంచంలో మన అవగాహన ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే విషయమై కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మొదటి చూపులోనే ప్రేమ పుట్టదు :

మొదటి చూపులోనే ప్రేమ పుట్టదు :

హీరో కారు దిగగానే ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు, ఆ అమ్మాయి రోడ్డు ప్రక్కన ఉన్న అనాధలకు సాయం చేస్తుంటుంది. ఇది చుసిన ఆ హీరో, ఆమెతో వెంటనే ప్రేమలో పడిపోతాడు.

ఇలాంటి విషయాలు సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. నిజ జీవితంలో ప్రేమ మొదట చూపులో కలిగిందంటే అది ప్రేమ కాదు, ఆకర్షణ అని అర్ధం చేసుకోవాలి. ఒక వ్యక్తిని మీరు పూర్తిగా అర్ధం చేసుకొని వారి యొక్క గుణగణాలు మీకు నచ్చిన తర్వాత మాత్రమే మీ ఇద్దరిమధ్య సంబంధం అనేది ఏర్పడుతుంది, ఒక బలమైన బాంధవ్యంగా మారుతుంది.

ఆ చమక్కులు కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువ :

ఆ చమక్కులు కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువ :

హీరో ఎంతో అందమైన మగువులను చూసి ఉంటాడుకానీ వారెవ్వరినీ ప్రేమించాడు. కానీ ఎప్పుడైతే హీరోయిన్ ని మొదటిసారి చూస్తాడో, అతనిలో ఎదో తెలియని వెలుగు తన జీవితంలోకి వచ్చినట్లు భావిస్తాడు. ఎదో తన గుండెని గుచ్చుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏ కారణం లేకుండానే ప్రేమలో పడిపోతాడు. నిజజీవితంలో మీరు ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు ఆ వ్యక్తితో కనీసం డేటింగ్ చేసినట్లు కూడా ఉహించుకోరు.

అబ్బాయిలందరికి కండలు తిరిగిన శరీరం ఉండదు :

అబ్బాయిలందరికి కండలు తిరిగిన శరీరం ఉండదు :

సినిమాల్లో మాత్రమే బాయ్ ఫ్రెండ్స్ మోడల్స్ లా కనపడతారు. అందరికి సిక్స్ ప్యాక్ తో పాటు కండలుతిరిగే శరీరం ఉంటుంది. మహిళలు అయితే చక్కటి చెక్కిన శిల్పంలా, పొడవాటి చక్కని జుట్టుతో, నాజూకైన శరీరంతో మంచి శరీరాకృతిని కలిగి ఉంటారు. నిజ జీవితంలో వ్యక్తులు చూడటానికి అంత బాగోలేకపోయినా, అంత అందంగా కనపడకపోయినా వారిని ప్రేమిస్తారు.

మగవారందరూ ధైర్యంగా ఉండరు :

మగవారందరూ ధైర్యంగా ఉండరు :

సినిమాల్లో హీరోలు చేసే పనులు ఎంతో ధర్మబద్ధంగా , ఆదర్శవంతంగా, హుందాగా ఉండేలా రూపకల్పన చేస్తారు. అలాంటి వ్యక్తులు నిజ జీవితంలో చాలా తక్కువ మంది ఉండే అవకాశం ఉంది. మీ బాయ్ ఫ్రెండ్ మరీ సినిమాల్లో ఉన్నంత ధైర్యంగా, నిజాయితీగా ఉండకపోవచ్చు. కానీ, మీ పై తనకున్న ప్రేమ మాత్రం నిజమైనదై ఉంటుంది.

మగవారందరూ ధనవంతులై ఉండరు :

మగవారందరూ ధనవంతులై ఉండరు :

మనం చూసే మెరిసిపోయే కల్పితమైన, హ్యస్య ప్రధానమైన చిత్రాల్లో, హీరో చాలా పెద్ద ధనవంతుడై ఉంటాడు. విదేశాల్లో పేరుప్రఖ్యాతలు గాంచిన విశ్వవిద్యాలయంలో చదువును అభ్యసిస్తూ ఉంటాడు. కానీ నిజ జీవితంలో అందరు అబ్బాయిలు అలా ఉండరు. ఈ శాఖలో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా, వాటిని తక్కువ స్థాయిలో ఉంచుకుంటే మంచిది.

పురుషులందరూ పడకగదిలో ప్రతిసారి సంతృప్తి పరచలేరు :

పురుషులందరూ పడకగదిలో ప్రతిసారి సంతృప్తి పరచలేరు :

మీరు పనిచేసే ప్రదేశంలో ప్రతిసారి మంచి ప్రదర్శనను ఇవ్వలేకపోవచ్చు. కొన్ని సార్లు మీ ప్రదర్శన తగ్గవచ్చు మరి కొన్ని సార్లు మరీ దారుణం ఉండవచ్చు. అచ్చం అలానే పురుషుడు పడక గదిలో ప్రతి రాత్రి మీ పై ప్రేమను ఒకేలా ప్రదర్శించలేడు. అందులో కూడా కొన్ని ఒడుదుడుకులు ఉంటాయి. మీ నిజ జీవిత హీరో అయిన మీ భాగస్వామి కొన్ని సార్లు పడకగదిలో విఫలమౌతాడు మరియు మీ మానసికస్థితిని ఆ సమయంలో దారుణంగా నాశనం చేయొచ్చు. కానీ ఇది నిజం అని నమ్మి ఈ విషయాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి.

అబ్బాయిలందురూ ప్రేమను ఆశ్చర్యకరమైన పద్దతిలో వ్యక్త పరచలేరు :

అబ్బాయిలందురూ ప్రేమను ఆశ్చర్యకరమైన పద్దతిలో వ్యక్త పరచలేరు :

ఒకసారి ఇలా ఊహించుకోండి. ఆ ప్రదేశం పారిస్ నగరం, అక్కడొక అత్యంత ఖరీదైన రెస్టారంట్ ఉంది. హీరో హీరోయిన్ షాపింగ్ పూర్తి చేసుకొని, భోజనం చేద్దామని ఆ రెస్టారంట్ కి వెళ్లి కూర్చుంటారు. హీరో రోజా పూల గుత్తిని మోకాళ్ల పై నిల్చొని, అక్కడ కూర్చున్న హీరోయిన్ కి ఇచ్చి తన ప్రేమని వ్యక్తపరచి ఆమెను ఆశ్చర్యపరుస్తాడు.

నిజ జీవితంలో మీకు నచ్చిన వ్యక్తి, అతని మనస్సుకి ఎప్పుడు నచ్చుతుందో అప్పుడు మీకు తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. అది కాలేజ్ మెట్ల దగ్గర కావచ్చు, ఆఫీస్ కాఫీ షాప్ లో కావచ్చు, రోడ్ పైన కావచ్చు, జిమ్ లో చెప్పొచ్చు లేదా ఇంటి మీద పై చెప్పొచ్చు. ఇలా ఎలాగోలా తన ప్రేమను మీకు వ్యక్తపరుస్తాడు. ఆ వ్యక్తపరిచే విధానం మిమల్ని ఆశ్చర్యపడేలా చేయచ్చు, చేయకపోవచ్చు కానీ అది నిజమైన ప్రేమ అయితే మాత్రం మీలో అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది.

మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు

అన్ని పెళ్లిళ్లు సుఖాంతం అవ్వాలని లేదు :

అన్ని పెళ్లిళ్లు సుఖాంతం అవ్వాలని లేదు :

కల్పితమైన హాస్య ప్రధాన చిత్రాల్లో చివరిలో ప్రేమికులు ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో శుభం కార్డు పడుతుంది. ఇక ఆ తర్వాత ఇక వాళ్ల జీవితం ఎప్పటికి ఆనందంగా ఉంటుందని మనం ఉహించుకొంటాం. కానీ, నిజ జీవితంలో పెళ్లి తర్వాతనే అసలు సమస్యలు మొదలవుతాయి.

అందుచేత, కల్పితమైన హాస్య ప్రధాన చిత్రాల్లో చూపించే ప్రేమ పాఠాలు మరియు శృంగార రసాలు మీ ఆలోచనను, మీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి చూసి ఆనందించండి కానీ, అవే నిజం అని నమ్మి, అలానే నిజ జీవితంలో కూడా జరుగుతాయని, జరగాలని ఉహించుకొని సమస్యలను కొని తెచ్చుకొని ఆవేదన చెందకండి.

English summary

How Romantic Movies Affect Your Relationship Expectations!

How do movies affect relationships? Movies are a very powerful medium as almost 80% of the human population all over the world tend to watch movies.