మీ మాతృభాషని నేర్చుకునే వ్యక్తి, ఇతరులకన్నా ఆకర్షణీయంగా ఎందుకు కనపడతారు?

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక భాష మానవసంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, చాలా మారింది.

ఈరోజుల్లో ప్రజలు ఇతర రాష్ట్రాల, దేశల, సంస్కృతుల లేదా ప్రాంతాల వారితో స్నేహసంబంధాలకోసం మక్కువ(ఇష్టాన్ని) చూపుతున్నారు. ఈ రోజుల్లో ద్విభాషా సంబంధాలు సాధారణం అయిపోయాయి. "ప్రేమ" అనేది ఇప్పుడు అన్ని ప్రాంతీయఅడ్డంకులను చెరిపేసింది. అలాంటి తత్సంబంధాలలో ఉండే అడ్డంకులను తీసివేసేది "భాష" ఒక్కటే. అతని భాష మీకు తెలియకపోతే మరియు అతను మీ భాషను అర్ధం చేసుకోలేకపోతే, అది ఒకరితో ఒకరు కలవడానికి సాధ్యం కాకపోవచ్చు.

కానీ అతను మీ భాష నేర్చుకున్నట్లయితే?

బాగా గొప్పగా ఉంది కదా?

ఇప్పుడు, ఈ అమ్మాయిలకు అటువంటి అబ్బాయిలు ఎందుకు ఆకర్షణీయంగా కనబడతారో, ఈ క్రింద చూపడం జరిగింది.

అతను తెలివైనవాడు :

అతను తెలివైనవాడు :

ఒక భాషను నేర్చుకోవడానికి చాలా తెలివి కావాలి.

అలా మీ ప్రియుడు - మీ మాతృభాషను త్వరగా నేర్చుకున్నట్లయితే, అతను మీ కంటికి చాలా తెలివైనవారిగ కనబడతారు.

దీని కోసం అతను చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది :

దీని కోసం అతను చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది :

మీరు అతని మాతృభాషను నేర్చుకోవడానికి, అలాగే మీ మాతృభాషను త్వరగా నేర్చుకోవాలని ఆశించే వ్యక్తికి మధ్యగల తేడా ఏమిటి?

నిజానికి, మీ భాషను నేర్చుకోవటానికి ప్రయత్నించిన వ్యక్తితో తత్సంబంధాలను కొనసాగించేందుకు మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలా అతను హార్డ్ వర్క్ చేస్తుంది!

అక్రమసంబంధాలు or వివాహేతర సంబంధాలకు 10 అసలు కారణాలు!

తనకి తాను సర్దుకుపోయేతత్వం ఉన్నవారిగా కనపడతారు :

తనకి తాను సర్దుకుపోయేతత్వం ఉన్నవారిగా కనపడతారు :

దీర్ఘకాలిక సంబంధాల కోసం, మీరు మారాలని 'ఆశించని' వ్యక్తి అయితే చాలా మంచిది. అలాగే, మీ అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసేవారైతే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీ మాతృభాషని నేర్చుకున్న ఆ వ్యక్తి ఇలాంటి వారు కావచ్చు.

అతను మీ భాషలో మాట్లాడేటప్పుడు, మీకు బాగుంటుంది :

అతను మీ భాషలో మాట్లాడేటప్పుడు, మీకు బాగుంటుంది :

అతని మాటలు (పలుకులు) చాలా అందంగా ఉంటాయి. అతను మీ భాషలో కొన్ని యాదృచ్ఛిక వాక్యాలను మాట్లాడిన్నప్పుడు, మీరు అతనిని ముద్దు పెట్టుకుంటున్నట్లు భావిస్తున్నారు!

నిజానికి, మీ మధ్యగల రిలేషన్షిప్ లో భాషపరమైన అడ్డంకులను అధిగమించటానికి, అతను భాష నేర్చుకున్నట్లయితే - మీకది ఎలాంటి ప్రయత్నం చెయ్యనవసరం లేనిదిగా ఉంటుంది.

అతనికి మీరు ఎంతముఖ్యమైనవారో తెలియజేస్తుంది :

అతనికి మీరు ఎంతముఖ్యమైనవారో తెలియజేస్తుంది :

మీరు నిజంగా అతనికి ముఖ్యమైనవారైతే, ఆ వ్యక్తి ఒక కొత్తభాషను నేర్చుకోవటంలో గల భాదను పడతాడు. కాబట్టి, అలాంటి వ్యక్తి చాలా మంచివాడు; మీ కోసం అతను చాలా శ్రద్ధ తీసుకుంటాడు.

సర్వేలు ఏం చెబుతున్నాయి :

సర్వేలు ఏం చెబుతున్నాయి :

తమ మాతృభాషలో గారాబం చేసే వారిని స్త్రీలు రహస్యంగా ప్రేమిస్తున్నారని ఒక సర్వే పేర్కొంది. ఒక వ్యక్తి మీ స్థానికభాషలో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పినప్పుడు, ఉండే దాని ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి, ఆ వ్యక్తి మీ భాషలో ప్రపోజ్ చేసినప్పుడు, మీరు ఖచ్చితంగా మంచి అనుభూతిని పొందుతారు.

స్త్రీలు పరాయి పురుషుణ్ణి ఎప్పుడు కోరుకుంటారో తెలుసా..?

మీరు హ్యాపీగా కూర్చుని కాలాన్ని గడపవచ్చు :

మీరు హ్యాపీగా కూర్చుని కాలాన్ని గడపవచ్చు :

భాష కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి, భవిష్యత్తులో కూడా మీరు, మీ పిల్లలు సంతోషంగా ఉండటానికి కూడా చాలా కృషి చేస్తారు. కాబట్టి, అతను ఆకర్షణీయంగా కనపడటానికి అది ఒక కారణం కావచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Why The Guy Who Learns Your Mother-Tongue Looks Way Hotter Than The Rest?

    Are you wondering how language affects relationships? If you don't know his language and if he can't understand your language, it would be tough. Read on.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more