మీ రాశిని బ‌ట్టి శృంగారంలో మీకు స‌రైన జోడి ఎవ‌రో తెలుసుకోండి!

By: sujeeth kumar
Subscribe to Boldsky

శారీర‌కంగా ఒక‌రితో ఒక‌రు పొస‌గ‌లిగే అంశాన్ని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. ఇత‌రులతో శృంగారంలో పాల్గొనేట‌ప్పుడు ఇది ఎంత‌గానో స‌హ‌క‌రిస్తుంది. శారీర‌క ఆక‌ర్ష‌ణ కేవ‌లం తాత్కాలికం... భావోద్వేగ‌పు బంధ‌మే క‌ల‌కాలం నిలిచిపోగ‌ల‌ద‌ని మీరు వాదించొచ్చు. ఇదీ ఒక‌రకంగా నిజ‌మే!

పీరియడ్స్ టైంలో శృంగారం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!!

అయితే శారీర‌కంగా ఇద్ద‌రు వ్య‌క్తులు అనుకూలంగా ఉంటేనే బెడ్ పైన వారు చేసే ప్ర‌తి చ‌ర్య మ‌ధురానుభూతిగా మిగిలిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. స్ప‌ర్శ ఒక్క‌టే చాలు వేడుక‌ల‌ను జ‌రుపుకునేందుకు, ఒక్క ముద్దు చాలు ర‌సాస్వాదాన్ని నింపేందుకు. మీరు ప‌డ‌క‌గ‌దిలో ఎంత బ‌లంగా ఉన్నారో చెప్ప‌డానికి ఇవి చాలు.

physical compatibility in relationships

సంబంధాల్లో పొసుగుద‌ల పాత్ర‌

ప‌డ‌క గ‌దిలో చేరాక మీరు మీరుగా ఉండొచ్చు లేదా మారొచ్చు. గ‌ది త‌లుపులు మూశాక మీ వ్య‌క్తిత్వంలో మార్పులు రావొచ్చు. బ‌య‌ట ఎక్కువ‌గా సిగ్గుప‌డే వారు ప‌డ‌గ్గ‌దిలో చేర‌గానే త‌మ విశ్వ‌రూపాన్ని చూపించొచ్చు.

మ‌రి కొన్ని సంద‌ర్భాల్లో బ‌హిర్ముఖులు కూడా మంచం మీదికి చేరేస‌రికి అంత‌ర్ముఖులుగా మారే అవ‌కాశం ఉంది. నిశబ్దంగా ఉండి త‌మ భాగ‌స్వామే త‌మ కోరిక‌ల‌న్నీ తీర్చాల‌నుకుంటారు. మీ లైంగిక అనుకూల‌త లేదా పొస‌గే త‌త్వాన్ని బ‌ట్టి మీ ప‌డ‌గ్గ‌ది శృంగార జీవితాన్ని మ‌రింత ర‌స‌ప‌ట్టుగా మ‌ల‌చుకోవ‌డ‌మెలాగో తెలుసుకోండి.

మహిళలు శృంగారం లో వారానికి ఒక్కసారైనా పాల్గొనాలి. ఎందుకో తెలుసా...?

మీ వ్య‌క్తిత్వం, రాశిని బ‌ట్టి కొన్ని భావ‌న‌ల‌ను ఇస్తున్నాం... మీకు అవి ఎంత వ‌ర‌కు అనుకూలంగా ఉన్నాయో చూసుకోండి.

మేష‌

మేష‌

ఆధిక్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించే వ్య‌క్తిత్వం మీ సొంత‌మైతే బెడ్ పైన చేసే చ‌ర్య‌ల‌న్నీ మీ చేతుల్లోకి తీసుకోగ‌ల‌రు. మీకు స‌రైన జోడి క‌లిగిన రాశివారు ఎవ‌రంటే వృశ్చిక, సింహ రాశుల‌వారు. మిధున‌, తుల రాశి వారు కూడా మీకు అనుకూలురే.

వృష‌భ‌

వృష‌భ‌

శృంగారంలో నెమ్మ‌దిత‌నాన్ని కోరుకునేవారైతే మీ కోరిక‌ల‌కు త‌గిన‌ట్టు వ్య‌వ‌హ‌రించేవారిని మీ భాగ‌స్వామిగా చేసుకుంటే చాలా అదృష్ట‌వంతులు. మీకు మీ భాగ‌స్వామి వాస‌న‌, ధ్వ‌ని, స్ప‌ర్శ .. ఇలా ప్ర‌తి ఒక్క‌టి ముఖ్య‌మే. మీకు అనుకూల‌మైన రాశుల‌వారు వృశ్చిక‌, క‌ర్కాట‌క‌, క‌న్య‌, మక‌ర .

మిధున

మిధున

ఈ రాశి వారికి శృంగారంలో మొర‌టుగా ప్ర‌వ‌ర్తించ‌డం ఇష్టం. ప్రేమ‌తో పాటు ఎక్కువ‌గా ఎంజాయ్ చేయాల‌నుకుంటారు. ర‌ర‌క‌రాల భంగిమ‌ల‌ను ప్ర‌యోగించాల‌నుకుంటారు. మీకు స‌రైన జోడి మీన‌, మేష‌, ధ‌నుస్సు, రాశుల‌వారు.

క‌ర్కాట‌క‌

క‌ర్కాట‌క‌

మీకు ఎక్కువ‌గా ముద్దులు, కౌగిలింత‌లు ఇష్ట‌మై అది మీ భాగ‌స్వామి నుంచి కోరుకుంటున్న‌ట్ట‌యితే మీరు మ‌క‌ర లేదా మీన రాశుల వారిని ఎంచుకోవాలి. వృష‌భ‌, సింహ రాశుల‌వారు కూడా శృంగార‌ప‌రంగా మీకు అనుకూల‌మే.

సింహ‌

సింహ‌

మీ అందం, ఆక‌ర్ష‌ణ‌ల‌తో ఇతరుల‌ను ప‌డేసేవారైతే మీకు మీ భాగ‌స్వామితో కెమిస్ట్రీ చాలా ముఖ్యం. ఈ రాశివారికి బోలెడంత ఫోర్ ప్లే, మసాజ్‌, రొమాన్స్ చాలా ముఖ్యం. మీకు ఉత్త‌మ జోడి మేష‌, ధ‌నుస్సు, వృశ్చిక రాశుల‌వారు.

క‌న్య‌

క‌న్య‌

భాగ‌స్వామిని సంతృప్తిప‌ర్చ‌డంలో మిమ్మ‌ల్నెవ‌రూ తీసిపోరు. వారిని సంతృప్తి ప‌ర‌చ‌డంలో మిమ్మ‌ల్ని మించిన‌వాళ్లు లేరు. ఇలాంటి విష‌యాల్లో ప్ర‌తిదీ ప‌ర్ ఫెక్ట్‌గా చేయాల‌నుకుంటారు. మీకు బెడ్ పైన స‌రి జోడి వృష‌భ‌, మ‌క‌ర‌, మీన‌, తుల రాశుల‌వారు.

తుల‌

తుల‌

మీకు న‌చ్చేవి, మిమ్మ‌ల్ని స‌మ్మోహ‌న‌ప‌రిచేవి, మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌రిచేవి చెప్ప‌డానికి ఏ విధంగా వెనుకాడ‌రు. మీ భాగ‌స్వామిలోనూ ఇదే కోరుకుంటే క‌నుక సింహ‌, మిధున‌, మేష రాశుల‌వారు మీకు ప‌డ‌గ్గ‌దిలో అనుకూలంగా ఉండ‌గ‌లుగుతారు.

వృశ్చిక‌

వృశ్చిక‌

వృశ్చిక రాశివారు ఇత‌ర రాశుల‌వారితో పోలిస్తే శృంగారంలో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇవ్వ‌గ‌ల‌రు. ర‌తి క్రీడ‌ను నిర్వ‌హించ‌డంలో వీరు ఆరితేరిన‌వారు. మీకు బ‌ల‌మైన కోరిక‌లు ఉన్న‌ట్ల‌యితే అవి తీర్చుకోవ‌డంలో మీకు సహ‌క‌రించేవారు సింహ‌, మీన రాశుల‌వారే అవుతారు. వృష‌భ‌రాశి వారు కూడా మీకు అనుకూల‌మే.

ధ‌నుస్సు

ధ‌నుస్సు

బ‌య‌ట కాకుండా ప‌డ‌క గ‌దిలోనూ మీరు ఆక‌ర్ష‌ణీయంగా, అందంగా, కేరింగ్ గా ఉన్న‌ట్ల‌యితే మీరు ధనుస్సు రాశికి చెందిన‌వారు అవ్వ‌డానికి అవ‌కాశాలెక్కువ‌. మేష‌, సింహ‌, మిధున రాశుల‌వారిని మీ భాగ‌స్వాములుగా ఎంచుకుంటే సంతృప్తిగా ఉంటుంది.

మ‌క‌ర‌

మ‌క‌ర‌

మీరు చాలా యాక్టివ్‌గా, రియ‌లిస్టిక్‌గా, ప్ర‌యోగాలు చేసే వారైతే మ‌క‌ర రాశికి చెందిన వార‌య్యేందుకు అవ‌కాశ‌ముంది. శృంగారాన్ని ర‌ఫ్‌గా చేయ‌డం మీకు ఇష్టం. మీకు స‌రైన జోడి క‌ర్కాట‌క రాశివారు. వృష‌భ‌, క‌న్య రాశుల‌వారు కూడా మీకు అనుకూల‌మే.

కుంభ‌

కుంభ‌

మిమ్మ‌ల్ని ఎవ‌రైనా సులువుగా వ‌శ‌ప‌ర్చుకోగ‌లుగుతారు. ఒక‌సారి ఇతరులు మిమ్మ‌ల్ని రెచ్చ‌గొడితే ఇక చాలా సేపు వారిని సంతృప్తి ప‌రిచేందుకు మీ ప్ర‌య‌త్నం మీరు చేస్తారు. ధ‌నుస్సు లేదా క‌న్యా రాశివారిని మీ శృంగార భాగ‌స్వామిగా ఎంచుకుంటే ఆనంద డోలిక‌ల్లో తేలిపోగ‌లుగుతారు. మిధున రాశి వారు కూడా మీకు అనుకూల‌మే.

మీన‌

మీన‌

బ‌య‌ట చెప్పుకోరు కానీ... కొన్ని ర‌హ‌స్య విష‌యాల‌ను మీరు కేవ‌లం శృంగారం చేసేట‌ప్పుడు మీ జీవిత భాగ‌స్వామితోనే పంచుకోవ‌డం మీకు ఇష్టం. మీకు స‌రైన జోడి క‌ర్కాట‌క రాశివారే. వృశ్చిక‌, క‌న్య‌, తుల రాశ‌/ల‌వారు కూడా మీకు శృంగార ప‌రంగా అనుకూలంగా ఉంటారు.

English summary

Physical Compatibility In Relationships

Are you wondering what type of a partner suits you? You can't underestimate physical compatibility in relationships.
Story first published: Wednesday, October 25, 2017, 16:30 [IST]
Subscribe Newsletter