బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం వల్ల ఎదురయ్యే సమస్యలు!

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

వివాహము, సహజీవనం అనేవి ఒకే అంశానికి చెందినవిగా ఉన్నప్పటికీ, చాలా మంది దీన్ని ఒకటికాదు అంటారు. ఈ రెండిటికీ వేరువేరు ప్రయోజనాలు ఉన్నాయి, లోపాలూ ఉన్నాయి, ఈ రెంటినీ కలపడానికి వీల్లేదు.

ఈ పోస్ట్ లో, మీరు మీ శృంగార భాగస్వామితో ఆకస్మికంగా కలిసుండడం ప్రారంభించినపుడు తలెత్తే కొన్ని సామాన్య విషయాల గురించి మాట్లాడుకుందాము.

బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం వల్ల ఎదురయ్యే సమస్యలు!

వివాహం లేదా సహజీవనం ఏదైనప్పటికీ ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్తజీవితాన్ని ప్రారంభించినపుడు, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కానీ వివాహ ఏర్పాటులో, భాగస్వాములు ఇద్దరూ ఒకరి విషయాలను ఒకరు అంగీకరించడానికి మానసికంగా ఇష్టపడతారు ఎందుకంటే మూడు ముళ్ళు వేయడ౦ అంటే మాట ఇవ్వడం లేదా ఒప్పందం అని అర్ధం.

కానీ ఇది సహజీవనం, ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా స్వేచ్చగా బైటికి వచ్చేయడం. దీనివల్ల మీరు ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.

డేటింగ్ చేయడానికి ముందు మహిళలకోసం కొన్ని సూచనలు

అతను మిమ్మల్ని బాధపెడితే?

అతను మిమ్మల్ని బాధపెడితే?

అనుకోకుండా, మీరు సౌకర్యవంతంగా లేకుండా, రాత్రంతా అతను మిమ్మల్ని బాధపెట్టడం వల్ల మీరు కనీసం నిద్ర కూడా లేకపోవడం. మీరు వేరే గదికి వెళ్లి, సోఫా లో నిద్రపోవడానికి ప్రయత్నించినా మీరు సౌకర్యవంతంగా భావించలేరు. మీరు నిరుత్సాహపడుతున్నారా? సరే, మీరు త్వరలో అతనితో నివసించడానికి ప్రణాళిక వేసుకుంటుంటే ఇలాంటి పరిస్ధితులకు సిద్ధమవ్వండి.

 మీ ఇద్దరికీ నిద్ర షెడ్యూలు వేరుగా ఉండొచ్చు

మీ ఇద్దరికీ నిద్ర షెడ్యూలు వేరుగా ఉండొచ్చు

మీరు ఇప్పటికీ చురుకుగా, మేల్కొని ఉంటే, అతను మీకు తోడు ఇవ్వకుండా గాధనిద్రలో ఉంటాడు. మీకు బాగా నిద్రవచ్చినపుడు అతను మిమ్మల్ని మంచి మానసిక స్ధితిలోకి తీసుకువచ్చి, మిమ్మల్ని హాయిగా ఉండేట్టు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇవి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నాయి కదా? సరే, మీ నిద్ర షెడ్యూలు పూర్తిగా భిన్నం అయినపుడు, మీరు ప్రారంభంలోనే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మీలో ఒకరు దారుణంగా ఉంటే మరొకరు పరిశుభ్రంగా ఉంటారు

మీలో ఒకరు దారుణంగా ఉంటే మరొకరు పరిశుభ్రంగా ఉంటారు

అతను పూర్తిగా అపరిశుభ్రంగా ఉంటే, మీరు మీ చుట్టూ ఉన్న ప్రతిదీ పరిశుభ్రంగా ఉండాలి అనుకుంటారు. మీరు సోఫా మీద తువాలు విసరకుండా, మంచం మీద మురుకి బట్టలు వేయొద్దని అతన్ని హెచ్చరించినా, అతను మిమ్మల్ని లెక్కపెట్టడు. ఒకరోజు, మీరు అతనితో వాదనకు దిగితే, మీ కఠినమైన వైఖరితో కలత చెందుతాడు. మీరు దాన్ని ఊహించగలరా? సరే, మే డేటింగ్ రోజులలో, ప్రతిదీ తియ్యగా చూడండి. కానీ ఒకసారి కలిసి జీవించడం ప్రారంభిస్తే, మీరు నిదానంగా ఒకరి సమస్యలను ఒకరు తెలుసుకోవడ౦ ప్రారంభించండి.

డేటింగ్ పిల్లలు...డౌటింగ్ పేరెంట్స్!

మీలో ఒకరు ఒంటరివారు, మరొకరు స్నేహితులను ఇంటికి తీసుకొస్తారు

మీలో ఒకరు ఒంటరివారు, మరొకరు స్నేహితులను ఇంటికి తీసుకొస్తారు

మీరు అంతర్ముఖులైతే, అతను తన స్నేహితులను ఇంటికి తీసుకువస్తే, మీ గోప్యతకు భంగం కలిగిందని మీరు భావిస్తారు. అందరూ; కూర్చుని, టివి చూస్తూ, పెద్దగా నవ్వుకుంటూ డ్రింక్ తాగుతూ ఉన్నపుడు మీ నరాలు లాగేస్తాయి.

అతను లేదా ఆమె మిమ్మల్ని అడగకుండానే మీ వస్తువులను తాకినపుడు

అతను లేదా ఆమె మిమ్మల్ని అడగకుండానే మీ వస్తువులను తాకినపుడు

మీరు మీ వస్తువుల పట్ల నాస్వాంతం అనే భావన కలిగి ఉన్నపుడు మీ వస్తువులను తాకితే చాలా చిరాకు కలుగుతుంది. ప్రారంభ దశలో ఇలాంటి కోపాలు సహజమే.

వ్యక్తిగత పరిశుభ్రతా అలవాట్లు

వ్యక్తిగత పరిశుభ్రతా అలవాట్లు

మీకు ప్రతిరోజూ స్నానం చేసే అలవటు లేకపోతే, అతను సౌకర్యవంతంగా ఉండలేడు, ఒకవేళ అతను పరిశుభ్రంగా లేకపోతే, అతనితో ఒకే గదిలో ఉండడానికి మీరు ఇష్టపడరు.

సింగిల్ పేరెంట్ డేటింగ్ లో ఉండే సాదారణ భయాలు

ఆహార అలవాట్లు

ఆహార అలవాట్లు

విభేదాలు వచ్చే ప్రధానాంశాలలో ఒకటి వంట, తినడం, ఎవరు వండాలి, ఇద్దరూ ఏమి తింటారు అనే విషయంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. భాగస్వాముల్లో ఒకరు తినడం మీద ఎక్కువ ఆశక్తి కలిగి, వంటచేయడానికి ఎప్పుడూ ఆశక్తి చూపకపోవడం లేదా వంటగదిలో సహాయం చేయనపుడు తరచుగా అలంటి విషయాలలో తగాదాలు తలెత్తుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Problems That Arise When You Start A Live-In-Relationship

    In this post, let us discuss a few common issues that might arise when you suddenly start living with your romantic partner.
    Story first published: Wednesday, July 26, 2017, 15:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more