ఈ 10 లక్షణాలు మీ సంబంధ బాంధవ్యాల్లో ఉంటే గనుక మీలో 'శృంగార కళ' ఉందని అర్ధం

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరికి శృంగార కళ అబ్బదు. ఆ కళ ఎవరికైతే అబ్బుతుందో అలాంటి వ్యక్తులు వాళ్ళ మనస్సులో ఆనందాన్ని పొందుతారు. వారి యొక్క ప్రేమ జీవితాన్ని ఎంతోలోతుగా, కావలసినంత బాగా అర్ధం చేసుకోగలరు. వారి ప్రేమ జీవితంలో చోటు చేసుకున్న ప్రతి ఒక్క అంశం మధురమైన జ్ఞాపకంగా వారియొక్క మనస్సుల్లో నిలిచిపోతుంది.

శృంగారతత్వాన్ని ప్రేమ రూపంలో వ్యక్తపరచడమంటే, కావాల్సినన్ని రోజా పూలో లేక ఇష్టమైన బహుమతులో కొని ఇవ్వడంకాదు. శృంగారకళను వ్యక్తపరచడమంటే, ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వడం కూడా కాదు.

మీ భరత్తో తిరిగి ప్రేమలో పడటానికి 7 సూపర్ శృంగారభరిత ట్రిక్స్

శృంగార కళ అంటే మనము తెలుసుకోవలసింది ఇంకేదో ఉంది. మనం ఇంత వరకు అనుభవించిందానికంటే కూడా ఇంకా ఎదో కొత్తగా ఉంటుంది. మరీ అదేంటి ? శృంగార కళ కు సంబంధించి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ?

వివరీతమైన వర్షం పడుతుండగా ముద్దాడటం :

వివరీతమైన వర్షం పడుతుండగా ముద్దాడటం :

విపరీతమైన వర్షం లో తడవడం వల్ల జలుబు వస్తుందనో లేక వ్యాధులు సోకుతాయనో అస్సలు భయపడకండి. శృంగారతత్వంతో కూడుకున్న మీ మనస్సుతో ఆలోచించండి. మీకు సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. వర్షం పడుతున్న సమయంలో తడుస్తూ, మీ భాగాస్వామిని దగ్గరకు తీసుకొని ముద్దాడండి.

మీకూ ఆత్మ బంధువులు ఉన్నారని నమ్మండి :

మీకూ ఆత్మ బంధువులు ఉన్నారని నమ్మండి :

మీకూ ఆత్మ బంధువులు మరియు జతగాళ్ళు ఉన్నారనే భావన మీలో వచ్చినప్పుడు, మీలో తెలియని ఒక మనోహరమైన అనుభూతికి లోనవుతారు. ఈ భూమి పై ఒక ఆత్మ బంధువు మీరు దొరికే వరకు వెతుకుతూనే ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి ఎక్కడో చోట మీకోసం పుట్టే ఉంటారు. మీరు పుట్టిందే వాళ్ళను ప్రేమించడానికి. ఆ ప్రేమ మీలో చిగురించినప్పుడే మీ జీవితానికి ఒక అర్ధం ఉంటుంది.

రోజంత కౌగిలించుకుంటూ సమయాన్ని గడపండి :

రోజంత కౌగిలించుకుంటూ సమయాన్ని గడపండి :

వారంలో ఎదో ఒక రోజును శృంగార రోజుగా ఎంచుకోండి. ఆ రోజు మీకు ఇష్టమైన పద్దతిలో మీ భాగస్వామి పై శృంగార భావనను వ్యక్తం చేయండి. రోజంతా మీ భాగస్వామిని గట్టిగా కౌగిలిలో బంధించినప్పుడు వారెంతో ఆనందానికి లోనవుతారు.

నిజమైన ప్రేమ ఉందని నమ్మండి :

నిజమైన ప్రేమ ఉందని నమ్మండి :

జీవితం అంటేనే ప్రేమను వెతుక్కోవడం అని నమ్మండి. దీని తర్వాతనే మిగతా వాటికీ ప్రాధాన్యతనివ్వండి. డబ్బు, హోదా, ఆస్తులు మరియు ఇంకేదైనా సరే మీ ప్రాధాన్యత క్రమంలో ప్రేమ తర్వాత స్థానాన్ని వాటికి ఇవ్వండి.

డబ్బుకు మించింది ఇంకేదో ఉంది :

డబ్బుకు మించింది ఇంకేదో ఉంది :

మీ భాగస్వామికి మీరు వ్యక్త పరిచే ప్రేమనే అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తారు. డబ్బు కూడా ప్రేమ తర్వాత స్థానాన్ని ఆక్రమించాలి. ఎక్కడైతే ప్రేమ కంటే డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారో, ఆ లక్షణం అవిశ్వసనీయ శృంగార కళలో ఒకటి.

మీ కౌగిలిలు మరియు మీ ముద్దులు ఎంతో ఉద్రేకపరిచేవిగా ఉండాలి :

మీ కౌగిలిలు మరియు మీ ముద్దులు ఎంతో ఉద్రేకపరిచేవిగా ఉండాలి :

మీ మనస్సులో ఎప్పుడైతే శృంగార కళకు సంబంధించిన భావనలు విపరీతంగా ఉంటాయో, అప్పుడు మీరు చేసే ప్రతి పని చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. మీరు మీ భాగస్వామిని ముట్టుకున్నా, కౌగిలించుకున్నా లేక ముద్దాడిన, మీరు ఏమిచేసినా అదొక అందమైన ప్రేమను వ్యక్త పరిచే భావానలా మిగిలిపోతుంది.

మీ రాశిని బట్టి మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారో తెలుసా ??

మీ పగటి కలలు :

మీ పగటి కలలు :

పగలైనా, రాత్రయినా, మీ భాగస్వామి మీ చుట్టుప్రక్కల ఉన్నా లేకపోయినా వాళ్ల గురించే ఊహించుకోండి.

యుగళగీతాలు కోసం గాఢంగా కాక్షించండి :

యుగళగీతాలు కోసం గాఢంగా కాక్షించండి :

మీ భాగస్వామితో కూర్చొని గంటల తరబడి ప్రేమపాటలను వింటూ గడపండి. అలాంటి సమయంలో మీకు తెలియకుండానే మీ కళ్ళ నుండి కన్నీళ్లు జాలువారుతాయి. మీరు ఆ ప్రేమ పాటలను వింటున్నంతసేపు ఒక పారవశ్యాన్ని అనుభవిస్తారు.

మీ ప్రపంచాన్ని మీరే సృష్టించుకోండి :

మీ ప్రపంచాన్ని మీరే సృష్టించుకోండి :

మీకు ఇష్టమైన అందమైన పరిసరాల చుట్టూ ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకొని ఎల్లప్పుడూ ఆనందంగా గడపండి. అలాంటప్పుడు మీ ఆలోచనలు, మీ ఆశలు, మీ భావాలు ఇలా అన్ని ప్రేమ చుట్టూనే తిరుగుతాయి. శృంగార కళలో ఇది కూడా ఒక లక్షణం.

ఇతరుల ప్రేమ కథలను వినండి :

ఇతరుల ప్రేమ కథలను వినండి :

ఇతరుల ప్రేమ కథలను ఎంతో ఓపిక తెచ్చుకొని వినండి. వాళ్ల బాధను అర్ధం చేసుకొని ఓదార్చడానికి ప్రయత్నించండి. వాళ్ల జీవితంలో వాళ్లకు నచ్చిన ప్రేమను వెతికే క్రమం లో ఇంకా విజయం సాధించకుండా ఉంటే వారు స్థైర్యం కోల్పోకుండా ఉండటానికి, వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి ఆశల ను రేకెత్తించండి.

ఈ లక్షణాలు అన్నింటిని అభ్యసించి ఒక పరిపూర్ణమైన శృంగార కళను నేర్చుకున్న భాగస్వామిగా ఆనందమైన జీవితాన్ని ఆస్వాదించండి.

English summary

10 Signs You Are A 'Romantic' In Your Relationship!

Not everyone can be romantic. What's it about? Well, here are some signs you are romantic.
Story first published: Wednesday, August 23, 2017, 18:00 [IST]
Subscribe Newsletter