Latest Updates
-
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ముద్దు పెట్టేటప్పుడు మన తలను ఎందుకు కుడి వైపు వాల్చుతామో తెలుసా..?
మనలో చాలా మంది ముద్దు పెట్టేటప్పుడు మనకు తెలియకుండానే మన తలను కుడి వైపుకు వంచుతారు. ఇది వినడానికి చాలా చమత్కారంగా ఉన్నా, ఇది పచ్చి నిజం. మనం ఎందుకు అలా మన తలను ముద్దుపెట్టేటప్పుడు కుడి వైపుకు వంచుతాము అనే ఆశ్చర్యకరమైన సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎడమవైపుకు ఎందుకు వాల్చము అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా ?
ఈ విషయంపై పరిశోధనలు జరిపిన పరిశోధకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. సాదాహరణంగా చాలా మంది చేసే ఈ ప్రక్రియ వెనుక అభిజ్ఞా శాస్త్రం మరియు నాడీ సంబంధ శాస్త్రం ఉన్నాయని అందువల్లనే మనలో చాలా మంది ఇలా చేస్తారని చెబుతున్నారు.

మీరు ఎప్పుడైతే మీ తలను కుడి వైపుకు వంచుతారో, అప్పుడు సాధారణంగానే మీ పెదాలను అందుకోవాలంటే ఎదుటి వ్యక్తులు కూడా కుడి వైపుకే తలను వాల్చాల్సి ఉంటుంది. ప్రేమని వ్యక్తపరిచే సమయంలో ముద్దుపెట్టేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క చర్యను బట్టి మనం కూడా అందుకు అనుగుణంగానే స్పందిస్తాం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరిన్ని నిజాలు.

అధ్యయనాలు ఏమని చెబుతున్నాయంటే :
అధ్యయనాల ప్రకారం స్త్రీల కంటే కూడా తరచూగా పురుషులే ఎక్కువగా ముద్దుపెట్టడానికి ప్రత్యేక ఉత్సాహం చూపిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా వాళ్ళు వాళ్ల తలను కుడి వైపుకు వాల్చుతారు. ఇలా వాళ్లకు తెలియకుండానే అసంకల్పితంగా జరిగిపోతుంది. ఇలానే చేయాలి అన్నట్లు వ్యవహారం సాగుతుంది.

మొదటి నుండి ఇలానే :
చాలా మంది మనుష్యులకు కుడి వైపుకు తలా వాల్చడం అనేది ఒక ధోరణిగా మారిపోయింది. గర్భంలో ఉన్నప్పుడు పిండం కూడా తలను కుడి వైపుకే వంచుతుంది. మన వయస్సు పెరిగే కొద్దీ ఏ పని ప్రారంభించాలన్నా మొదట చాలా మంది కుడి చేయి లేదా కుడి కాలుని ఉపయోగిస్తారు.

సహజ ప్రవర్తన :
మనలో కొన్ని అలవాట్లు సహజం గానే అలా మన శరీరతత్వంలోకి వచ్చేస్తుంటాయి. ఇలా అలవర్చుకున్న అలవాట్లను జీవితానంతం అలానే కొనసాగిస్తాం. ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. కాబట్టి ఇలానే ఎందుకు చేస్తాం అనే ప్రశ్న ఉదయించదు.

పరిశోధన :
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు చాలా మంది జంటలను ఏకాంతంగా ముద్దులు పెట్టుకోమని చెప్పారు. ఆశ్చర్యకరంగా దాదాపు అన్ని జంటలు తమ తలను కుడి వైపుకు వాల్చి ముద్దులుపెట్టుకోవడం ప్రారంభించాయి. రెండవ ఆలోచన అనేది లేకుండా ముద్దు పెట్టడం మొదలు పెట్టిన వారు, ఆ ముద్దుని స్వీకరించిన వాళ్ళు ఇద్దరు తలను కుడి వైపుకే వంచి ముద్దుపెట్టుకున్నారు.

మొదలుపెట్టిన వ్యక్తి చర్య :
ఏ వ్యక్తి అయితే మొదట ముద్దుపెట్టడానికి పూనుకుంటాడో, వాళ్ళు తన తలను కుడి వైపుకి వాల్చుతారు. దీంతో ముద్దుపెట్టించుకుంటున్న వాళ్ళు ఆ ముద్దుని సౌకర్యవంవంతంగా పెట్టించుకోవడానికి వాళ్ళ తలను కూడా కుడి వైపుకి వాల్చుతారు.

మెదడు యొక్క కార్యకలాపాలు :
ఈ ముద్దు పెట్టుకున్న ప్రక్రియ బయట నుండి చూడటానికి చాలా సులభంగా సునాయాసంగా అనిపిస్తుంది. కానీ తలను కుడి వైపుకి వాల్చే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి మెదడు ఎన్నో కార్యకలాపాలను చేయవలసి వస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.

హార్మోన్లు :
ఈ ప్రక్రియ ఇలా జరగడానికి వృషణముల స్రావము ( టెస్టోస్టెరాన్ ) మరియు డోపమైన్ లాంటి నాడీ ప్రసారిణి హార్మోన్లు ఎంతగానో దోహదపడుతున్నాయి అని పరిశోధకులు చెబుతున్నారు. ఏ వ్యక్తులైతే ఎడమ చేతిని ఎక్కువగా వాడుతారో అటువంటి వ్యక్తులు ఎడమ వైపుకి తమ తలను వాల్చడానికి ఇష్టపడతారు. అంతకు మించి ఇందులో ఏ రహస్యం దాగిలేదని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications