For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళా దినోత్సవం నాడు మీ ఇష్టసఖిని మెప్పించెయ్యండిలా

|

మహిళా దినోత్సవం సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది, మీ ప్రియమైన భార్యని లేక ప్రేయసిని సంతోషపెట్టడానికి ఈరోజుని ఉత్తమమైన అవకాశముగా మలుచుకోండి. ఈరోజు మార్చి 8, మహిళలకు ప్ర్యత్యేకమైన రోజు కావున, ఈరోజుని వారికి మరింత ప్రత్యేకంగా అందివ్వడానికి సన్నద్ధులుకండి. వాలెంటైన్స్ డే రోజున కాని, ఫ్రెండ్షిప్ డే రోజున కాని మహిళ తన ప్రియమైన వ్యక్తి నుండి ఒక మంచి బహుమతిని అందుకోవాలని ఎదురుచూస్తుంది. కాని ఆ మహిళ మీకు ప్రత్యేకమైతే ఈ మహిళా దినోత్సవం నాడు కూడా సర్ప్రైస్ చేసి ఆనందపరచవచ్చు.

నిజానికి ఈ ప్రత్యేకమైన రోజులు, సర్ప్రైస్ ఆలోచనలు, ఆ మహిళ దృష్టిని మీనుండి మరల్చుకోనివ్వకుండా చేస్తుంది. మీరు త్వరలో ఆమెకి ప్రపోజ్ చెయ్యాలని భావిస్తున్నట్లయితే ఈరోజు మీకోసమే అనుకోండి. కొన్ని ఐడియాలు మీకోసం.

సర్ప్రైస్ లంచ్:

మహిళా దినోత్సవం వీకెండ్ లో కాకుండా ఈ 2018 లో గురువారం వస్తుంది, కావున మీ ప్లానింగ్స్ ఎక్కువ సాయంత్రం ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. ఇద్దరూ ఉద్యోగులైతే, తన ఆఫీస్ వదిలే సమయానికి డజన్ గులాబీ పూలతో ఆఫీస్ బయట చేరి, మీ ప్రేయసి రాగానే తన అభిరుచులకి తగినవిధంగా ఎదైనా రెస్టారెంట్ కి డిన్నర్ కి ఆహ్వానించండి.

బోనస్ షాపింగ్

ఈరోజు వారికి ప్రత్యేకమైన రోజు కావున, వారి అభిరుచుల మేర పనుల్లో నిమగ్నమవడానికి సుముఖత చూపుతుంటారు. ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి? ఏం అవసరం లేదు, ఈ ప్రపంచంలో ఎక్కువశాతం మహిళలకు నచ్చే ఒకే ఒక వ్యాపకం "షాపింగ్". నిజం ఈరోజున ఎప్పటి నుండో తను అడుగుతున్న వస్తువును తన ప్రెస్సెన్స్ లో తీసివ్వడమో లేక సర్ప్రైస్ గిఫ్ట్ గా ఇవ్వడమో లేక తనని మీతో షాపింగ్ కు తీసుకుని వెళ్లి తన అభిరుచుల మేర తీసివ్వడమో చెయ్యండి. ఇలా మహిళా దినోత్సవంను తనకు ఒక బహుమతి గా ఇవ్వండి. ఆశ్చర్యపోవడం తన వంతు అవుతుంది.

ఒక కార్డుతో చెప్పండి:

షాపింగ్, ఖరీదైన రెస్టారెంట్లలో భోజనాలే ప్రేమకి నిదర్శనం ఎన్నటికీ కావు. కొంతమంది మహిళలు తమ ప్రియమైనవారి వద్దైనా సరే, పది రూపాయల రీచార్జ్ చేయించుకోవడానికి కూడా సిద్దంగా ఉండరు. ఒక్కొక్కరి కారణం ఒక్కోలా ఉంటుంది. మరో వైపు ఆ బహుమతులకి ఆర్ధిక పరిస్తితి కూడా సరిపడకపోవచ్చు. ఇలాంటప్పుడు ఒక చిన్ని గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి. మీ మొదటి పరిచయం జరిగిన చోటుకి రమ్మని చెప్పి అక్కడ ఒక టేబుల్, ఇద్దరికి సీటింగ్ అరేంజ్ చేసి, తను వచ్చే సరికి ఆ టేబుల్ పై గ్రీటింగ్ కార్డ్ ఒక గులాబీ పువ్వు ఉండేలా చూడండి. తర్వాత తన పెదాలపై వచ్చే నవ్వు ఎంత అందంగా ఉంటుందో మీరే గమనించండి.

మీ ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించండి:

అందరు మహిళలు ఒకేలా ఆలోచించరు, భిన్న వ్యక్తిత్వాల మేలు కలయిక స్త్రీ అంటే. కొందరు రెస్టారెంట్స్, షాపింగ్ లాంటివి ఇష్టపడకపోయినా తమని ప్రేమించే వారి చేతి రుచి చూడాలని పరితపిస్తుంటారు. కాని ఆ భావాలను బయటకి చెప్పరు. మీ మనసు నిండా తనే ఉంటే, ఈ సంగతి మీకే అర్దమైపోతుంది, తను ఏమి కోరుకుంటుందో అని. వీలయితే మీరే వంట చెయ్యడానికి పూనుకోండి. తనను ఆకట్టుకోవడానికి కొన్ని వంట ప్రయోగాలు తప్పవు మరి. అలా సిద్దం చేశాక, తనని మీ ఇంటి భోజనానికి ఆహ్వానించండి. ఇలాంటి సర్ప్రైస్ ఊహాతీతం, కావున ఆశ్చర్యానికి లోనవ్వడం తన వంతు అవుతుంది.

మూడు వరాలని ఇవ్వండి:

మీరు ఆరోజు తనపై చూపే ప్రేమ ఆప్యాయత, తర్వాతి కాలంలో మీపై ఉన్న అభిమానం రెట్టింపు అవడానికి దోహదం చేస్తుంది. దీనికోసం మీరు జీనీ(అల్లాఉద్దీన్ కథలాగా)గా కూడా మారాల్సి వస్తుంది. ఏవైనా 3 కోర్కెలు కోరుకోమని చెప్పండి. భయపడకండి, తనేం మిమ్మల్ని డైమండ్ రింగ్ కొనివ్వమని కోరదు. ప్రేమలో చిన్ని కోరికలే ఉంటాయి. అవి మనం చూసే దృక్పధంపై ఆధారపడి ఉంటాయి. తద్వారా లాంగ్ డ్రైవ్ తీసుకుని వెళ్ళడం, సినిమాకి తీసుకెళ్లడం, తనతో సమయాన్ని వెచ్చించడం లాంటివి చెయ్యండి. ఈరోజుని ఒక అందమైన అనుభూతిని ఇచ్చేలా మసలుకోండి.

ముఖ్యంగా ఎపుడూ ఉండే పనులని కాస్త పక్కన పెట్టి, తనతో సమయం వెచ్చించేలా మానసికంగా సన్నద్దులై ఉండండి. చిరాకులు కోపాలు లాంటివి ఈరోజు కాస్త దరిరానివ్వకుండా చూసుకోవడం మీ భాద్యత.

మీ ప్రియసఖులను impress చెయ్యడానికి out of box లోని కొన్ని ఐడియాలు మాత్రమే, ఇలాంటివి అనేకం ప్రపంచంలో. ఈరోజు మీకెలా జరిగిందో మాకు తెలియజేయండి.

English summary

Date Ideas | Women's Day | Dating Places

Women's Day comes only once in a year and it is your best opportunity to impress the special woman in your life. As today is 8th of March, you are in need of some urgent date ideas. A girl expects her boyfriend to wish her on Valentine's Day, Rose Day and even Friendship Day. But when you do something special for her on Women's Day, you will surprise her pleasantly.
Story first published: Wednesday, March 7, 2018, 12:00 [IST]
Desktop Bottom Promotion