For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహ సమస్యలు: ఈ 5 సంకేతాలు మీకారణంగానే మీవివాహ జీవితం నాశనమవుతుందనడానికి సూచనలు.

|

వివాహ సమస్యలు: ఈ 5 సంకేతాలు మీకారణంగానే మీవివాహ జీవితం నాశనమవుతుందనడానికి సూచనలు.

మీ వివాహ జీవితంలో సమస్యలున్నాయా ? సమాధానాల కోసం శోధించడం మరియు సాధారణ విషయాల కోసం వేచి ఉండటం వంటివి చేస్తున్నారా ? మీ గురించి మీరు తెలుసుకోవడానికి మరియు మీరు మీవివాహ సమస్యలకు కారకాలు ఒకటిగా ఉంటే కనుగొనేందుకు సిద్దపడండి. మీరు మీ వివాహానికి ప్రధాన సమస్యగా ఉన్నారా ? తెలుసుకుందాం.

ఒక వివాహం జీవితంలో జరిగే వివాదాలకు మీరే ఒక కారణమైతే అది గుర్తించడం కాస్త కష్టమే. మీ భార్యను నిందించడం మరియు ఏ అపరాధ భావమూ లేకుండా దూరంగా వెళ్ళిపోవటం మీకు చాలా తేలిక. కానీ, ఈ చిన్న విషయాలే జీవితంలోకి రావడం మొదలైతే, రాను రానూ నిందలు వెయ్యడం అలవాటుగా మారిపోతుంది. కానీ ఇక్కడ మలుపు ఏమిటంటే, మీ వివాహ జీవితాన్ని నాశనం చేసేది ప్రధానంగా మీరే అవడం ?

మీ వివాహ జీవితంలో సమస్యలను సృష్టించడం లేదా మొదలుపెడుతున్నారని నిరూపించే సంకేతాలు ఉన్నాయి.

MARRIAGE PROBLEMS: 5 SIGNS YOU ARE THE TROUBLEMAKER IN THE MARRIAGE

మీ వివాహంలో ఇబ్బందులు ఉన్నాయి సంకేతాలు :

1. కాదు అనడం మీకు ఇష్టమైన సమాధానమా :

మీరు ఇతరులతో ఉన్నట్లే, భాగస్వామి మిమ్మల్ని అడుగుతున్న ప్రతి ఒక్కదానికి "కాదు, లేదు" అని సమాధానం ఇస్తున్నారా ? ఇది మీకు అలవాటుగా మారిందా ?

ప్రతి పరిస్థితిలోనూ “కాదు,లేదు” అని వ్యతిరేకంగా సమాధానాలు ఇవ్వడం మీ వివాహ జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రతి వివాహం కూడా "ఇవ్వడం మరియు తీసుకోవడం" అనే నియమాల మీదనే ఆధారపడి ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ సమాధానం పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కానీ, ప్రతి విషయానికి తల అడ్డంగా ఊపడం మొదలుపెడితే, మీ భాగస్వామి మీతో ఉండడానికి కూడా తల అడ్డంగా ఊపడం పరిపాటి అవుతుంది. మీ భాగస్వామి ఏదైనా మిమ్మల్ని అడుగుతుంటే, వారి మాటలకు మర్యాద ఇవ్వడం కనీస భాద్యత. మీ సమాధానం నొప్పించేలా ఉండకూడదు అని గుర్తుంచుకోండి. అదేం తప్పు కాదు. మీరిచ్చే సమాధానం మీ కాపురం కలహాల పాలు కాకూడదన్న ఆలోచన మీలో ఉండాలి.

2. మీరు రహస్యాలు కలిగి ఉండడం తప్పేమీ కాదు.

మీరు మీ వివాహంలో పారదర్శకత కలిగి ఉండాలని కోరుకోవచ్చు. కానీ అందరూ ఒకేలా తీసుకుంటారు అని అనుకోవడానికి లేదు. పెళ్లిలో సమస్యలను సృష్టించే రెండవ దశ ఇది. ఈ ప్రత్యేక కారణం చేత అనేక వివాహాలు విఫలమయ్యాయి. భాగస్వామి విషయాలు దాచడం ప్రారంభించినప్పుడు, అసురక్షిత భావన మొదలవుతుంది. ఒకవేళ మీరు విషయాలు దాయడం మొదలుపెడితే, ఒక్కోసారి మీరే ఇక్కడ సమస్యగా మారొచ్చు.

పరిస్థితిని బట్టి, వ్యక్తులను వారి మనసులను ఉద్దేశించి మీ రహస్యాలను పంచుకోవాలో లేదో అన్న ఆలోచన చేయాలి. అలాకాకుండా, తొందరపడి మీరు అన్ని చెప్పాలి అన్న ఆలోచన చేస్తే మొదటికే మోసం రావొచ్చు.

3. మీకు క్షమాపణ చెప్పే అలవాటు లేదా ?

చివరిసారిగా మీ పొరపాటుకు ఎప్పుడు క్షమాపణలు అడిగారు ?

మీరు మీ సొంత తప్పులను గుర్తించక, నిందలు వేయడం, లేదా క్షమాపణ చెప్పకుండా తప్పించుకోవడం వంటి చర్యలు మీవివాహ సంతోష జీవనానికి ప్రధాన అడ్డంకులలో ఒకటి. మీరు మీ తప్పులను తెలుసుకునే ప్రయత్నం చేయాలి, క్షమించమని అడగాలి, మరియు మరలా మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడం ముఖ్యం. మీ తప్పును మీరు గుర్తించి, ఎప్పుడైతే క్షమాపణలు చెప్పడం చేస్తారో, ఆరోజు నుండి మీ జీవితం సాఫీగా జరుగుతుంది. ఇది భార్యాభర్తలకు ఇద్దరికీ వర్తిస్తుంది. మీ చర్యలకు బాధ్యతను తీసుకోని పక్షాన, మీ వివాహం విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మీరు దీనిని పరిగణలోకి తీసుకోవాలి మరియు మీ తప్పు ఉన్నప్పుడు క్షమాపణ చెప్పాలి.

4. ఫన్ కోసం నాటకీయతను అనుసరిస్తున్నారా :

మీరు మీ సంబంధంలో నాటకీయ లక్షణాలు ప్రారంభించడం మొదలుపెడితే, వాటిని పెంచకుండా తుంచడం లేదా ఆ లక్షణాలను దూరం చెయ్యడమే మేలు. మీమీద కొన్ని అభిప్రాయాలకు ఈ లక్షణాలు కారణం అవుతాయి. ఇవి మీ సంబంధాన్ని నాశనం దిశగా కొనసాగిస్తుంది మరియు మీ మధ్య ఉన్న ప్రేమను తగ్గిస్తుంది. కావున సంబంధంలో ఎన్నటికీ నాటకాలు సృష్టించకండి. ఇది ఎప్పటికీ మీకు ప్రతికూల ప్రభావాలనే కలిగిస్తుంది.

5. కోపం సమస్యలు :

మీరు ఉగ్రం, చికాకు, కోపం వంటి లక్షణాలకు కేంద్ర బిందువు అయితే, ఈ లక్షణాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎల్లప్పుడూ కోపాన్ని ప్రదర్శించడం, సంబంధంలో కలతలను సృష్టిస్తుంది. కోపం అవసరమే కానీ అర్ధముoడాలి. కోపం వలన సానుకూల ఫలితాలు రావాలి కానీ, అసాధారణ ఫలితాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ కాకూడదు. మీరు కోపిష్టి అయితే మాత్రం ఏ రోజుకైనా సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక పిల్లిని గదిలో బంధించి దాడికి ప్రయత్నిస్తే, మొదట్లో దెబ్బలు తిన్నా నెమ్మదిగా అది తిరగబడుతుంది. తద్వారా దాడికి ప్రయత్నించిన వాడే దారులు చూస్కోవలసి వస్తుంది. కోపo అనేది మీ ఆభరణం అయితే, ఏదో ఒక రోజు ఆ ఆభరణం మీ భాగస్వామి సొంతమవుతుంది. ఇది కాపురంలో కలతలు సృష్టించే ప్రధాన అంశంగా మారుతుంది. ఎల్లప్పుడూ కోపంతో లభ్ది పొందలేరు. చర్చలు అవసరం. కూర్చుని మాట్లాడితే సమసిపోయే సమస్యలు కూడా కోపం వలన విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులను రోజూ చూస్తూనే ఉంటాం. కావున జాగ్రత్త తప్పనిసరి.

కాబట్టి, పైన పేర్కొన్న ఈ 5 సంకేతాలు ప్రధానoగా వివాహ జీవితంలో సమస్యల సృష్టికర్తలు. మీరు ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే మాత్రం వీటిని ఎంత త్వరగా నిరోధిస్తే అంత మంచిది.

మీకు ఈ వ్యాసం నచ్చినట్లయితే, మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలుపండి. ఒకవేళ మీరేదైనా ఇతర సమస్యలతో భాదపడుతున్న ఎడల మాకు తెలియజేయండి. మా వ్యాసాల ద్వారా, మీ ప్రశ్నలకు సమాధానాలు అందివ్వగలం.

English summary

MARRIAGE PROBLEMS: 5 SIGNS YOU ARE THE TROUBLEMAKER IN THE MARRIAGE

So, these above 5 signs are the main problem creators or the troublemakers in the marriage. You need to avoid these in every circumstance.If you liked the article, then write the feedback in the comment section and what all problems you have in the marriage. We will try to answer them all in our articles.
Story first published: Sunday, May 13, 2018, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more