For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తను నాతో డేటింగ్ చేశాడు, అనుభవించాడు, గర్భిణీని చేశాడు, ఫారిన్ అమ్మాయితో కులికాడు #mystory318

|

ప్రతి ఒక్కరి జీవితంతో విధి ఆడుకుంటూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా ఏ కష్టం లేకుండా వారి జీవిత చదరంగంలో నుంచి బయటపడలేరు. అలాగే నాతో కూడా విధి వింత నాటకం ఆడింది.

రోజూ ఆఫీస్ కు వెళ్లడం సాయంత్రం ఇంటికి రావడం టీవీలో ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్సామ్స్ చూడడం పడుకోవడం ఇదే నా లైఫ్. అలాంటి నా జీవితంలోకి విజయ్ వచ్చాడు.

విజయ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్

విజయ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్

విజయ్ లైఫ్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్. తన మనసత్వం నా మనసత్వానికి పూర్తి భిన్నంగా ఉండేది. అయినా విజయ్ మాయలో నేను పడ్డాను. తను నాకు మరో ప్రపంచం చూపించాడు.

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు

తనను నేను చాలా ప్రేమించాను. ఎలా అయినా సరే తను నాకు తప్ప మరో అమ్మాయికి దక్కకూడదని అనుకునేదాన్ని. కానీ విజయ్ కు అంత త్వరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తాను ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయ్యేవాడు.

కొన్నాళ్లు డేటింగ్

కొన్నాళ్లు డేటింగ్

తాను కావాలనుకుంటే తన దారిలోనే నన్ను నడవమన్నాడు. అందుకే నేను కూడా ఏమీ ఆలోచించకుండా బ్లైండ్ గా తన రూట్ లోకి మారాను. మనమిద్దరం కొన్నాళ్లు డేటింగ్ చేద్దామన్నాడు. నేను కూడా సరే అన్నాను.

ప్రెగ్నెంట్ కావడం

ప్రెగ్నెంట్ కావడం

ఇద్దరం కలిసి జీవించడం మొదలుపెట్టాం. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. డేటింగ్ లో మేమిద్దరం హద్దులు దాటి ప్రవర్తించేవాళ్లం. కానీ తనకి నేను త్వరగా ప్రెగ్నెంట్ కావడం కూడా ఇష్టం లేదు.

Most Read: బావ అని పిలవగానే నరనరాల్లో కరెంట్ పాస్, మేనమామ కూతురితో ముద్దుల దాకా యవ్వారం #mystory317

సెక్స్ జరగకూడదు

సెక్స్ జరగకూడదు

నేను చాలా సందర్భాల్లో ఆ విషయంలో మాత్రం అతనికి దూరంగా ఉండేదాన్ని. డేటింగ్ లో ఉన్నప్పుడు మన మధ్య సెక్స్ జరగకూడదని చెప్పేదాన్ని. కానీ తను వినేవాడు కాదు. ఎన్నోసార్లు నేను అతణ్ని కంట్రోల్ చేయగలిగాను.

సహకరించాల్సి వచ్చింది

సహకరించాల్సి వచ్చింది

నేను ఆ విషయంలో ఎంత కేర్ ఫుల్ గా ఉన్నా ఒకసారి విజయ్ బాగా పట్టుపట్టడంతో అతనికి సహకరించాల్సి వచ్చింది. తర్వాత అలా చాలాసార్లు శారీరకంగా కలిశాం. హద్దులు దాటి ఎంజాయ్ చేశాం.

నెల తప్పాను

నెల తప్పాను

మేమిద్దరం శారీరకంగా కలిసినప్పుడు పిల్లలు పుట్టకుండా ఇద్దరం కొన్ని జాగ్రత్తలు పాటించేవాళ్లం. అయినా కూడా నేను నెల తప్పాను. విజయ్ కు ఆ విషయం చెబితే అబార్షన్ చేయించుకో అంటాడని భయం. అందుకే అతనికి చెప్పకుండా ఆ విషయాన్ని దాచాను.

సెక్స్ లో పాల్గొన్న ప్రతి సారి

సెక్స్ లో పాల్గొన్న ప్రతి సారి

నాకు అబార్షన్‌ చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదు. చాలా రోజుల తర్వాత విజయ్ కు విషయం చెప్పాను. తను వెంటనే అబార్షన్ చేయించుకో అన్నాడు. అయినా ఈ విషయం ఇన్నాళ్లు నాకు ఎందుకు చెప్పలేదు. సెక్స్ లో పాల్గొన్న ప్రతి సారి నిన్ను పిల్స్‌ వేసుకోమని చెప్పాను కదా, ఎందుకు వేసుకోలేదంటూ మండిపడ్డాడు.

Most Read:రోజూ నాకు తెలిసిన అమ్మాయిలందరితో శృంగారం చేస్తుంటాను, కంట్రోల్ చేసుకోలేకపోయా #mystory316

ఎలా వచ్చిందో నాకు తెలియదు

ఎలా వచ్చిందో నాకు తెలియదు

నువ్వు చెప్పినట్లుగా అన్ని జాగ్రత్తలు పాటించాను. కానీ ఎలా ప్రెగ్నెన్సీ వచ్చిందో నాకు కూడా తెలియదు అని చెప్పాను. సరే వెంటనే అబార్షన్‌ చేయించుకో అన్నాడు. నాకు ఇష్టంలేదన్నాను.

మరి ఇంత దారుణంగానా?

మరి ఇంత దారుణంగానా?

తర్వాత తను నాపై కోప్పడడ్డాడు. సరే నా మాట వినట్లేదు కదా.. నీ దారి నువ్వు చూసుకో. నా దారి నేను చూసుకుంటాను అన్నాడు. మరి ఇంత దారుణంగా వదిలేసి వెళ్లిపోతే ఎలా? అన్నాను. తర్వాత తను అడ్రస్ లేకుండా పోయాడు.

ఫారిన్ వెళ్లాడు

ఫారిన్ వెళ్లాడు

చాలా రోజులు తన కోసం అన్ని చోట్ల వెతికాను. తను ఫారిన్ వెళ్లాడని తెలిసింది. తనని నమ్మినందుకు, కట్టుబాట్లను కాదన్నందుకు నాకు ఇలా కావాల్సిందేలే అనుకున్నాను. తర్వాత బాబుకు జన్మనిచ్చాను.

చచ్చిపోవాలనుకున్నాను

చచ్చిపోవాలనుకున్నాను

పెళ్లికాకుండానే తల్లినైందుకు సమాజం నానా రకాలుగా నా గురించి మాట్లాడింది. చాలా సార్లు చచ్చిపోవాలనుకున్నాను. కానీ బాబు గుర్తొచ్చి.. వాడిని అనాథను చేయడం ఇష్టం లేక బతికాను. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత విజయ్ మళ్లీ వచ్చాడు.

Most Read : నా భర్త ఎంత కోఆపరేట్ చేసినా ఏమీ చేయలేడు, రెండు నిమిషాలకే ఔట్ అయిపోతాడు #mystory315

నిన్ను మోసం చేయడంతో

నిన్ను మోసం చేయడంతో

నేను మరో వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని తెలుసుకుని ఏడ్చాడు. నీలాంటి అమ్మాయిని వదులుకుని, నిన్ను మోసం చేయడం వల్ల నాకు దేవుడు సరైన శిక్షే విధించాడు. నేను ఫారిన్ లో ఉంటున్నానని కోట్ల రూపాయల కట్నం ఇచ్చి నాకు అమ్మాయిని ఇచ్చారు.

మరో అమ్మాయిని చేసుకోవడం తప్పే

మరో అమ్మాయిని చేసుకోవడం తప్పే

కానీ తనతో నేను రోజూ నరకం చూసేవాణ్ని. అప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చేదానివి. నన్ను ప్రాణానికి ప్రాణంగా భావించి బతుకుతున్న నిన్ను వదిలి మరో అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం నా తప్పే. నన్ను క్షమిస్తావో.. లేదంటే ఏదైనా శిక్ష విధిస్తావో నీ ఇష్టం.

దేవతలా చూసుకుంటున్నాడు

దేవతలా చూసుకుంటున్నాడు

చేసిన తప్పు తెలుసుకున్నా.. ఇప్పటి నుంచి నువ్వే నా ప్రాణంగా బతుకుతాను అన్నాడు. ఇప్పుడు ఇద్దరం కలిసే ఉన్నాం. నన్ను విజయ్ దేవతలా చూసుకుంటున్నాడు.

Most Read : వేరే వాళ్లతో పిల్లల్ని కని తండ్రివి నువ్వేనని చెబుతా, నువ్వు మగాడివేనా, పుట్టించలేవా? #mystory313

దేవుడు కూడా మనవైపే

దేవుడు కూడా మనవైపే

కాలు కిందకు పెట్టకుండా నన్ను, బాబును బంగారంలా చూసుకుంటున్నాడు. నిజాయితీగా ఉంటే, నమ్మకం కోల్పోకుండా ఉండే దేవుడు కూడా మనవైపే నిలుస్తాడనేది నా విషయంలో నిజమైంది.

English summary

my boyfriend cheated on me but i still love him

my boyfriend cheated on me but i still love him