ఈ 7 మార్గాల ద్వారా మీ భాగస్వామి ముఖం లో ఉదయాన్నే చిరునవ్వు చూడవచ్చు

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

" ఉదయాన్నే మీరు ఎంతో ఉత్సాహంతో నిద్ర లేస్తారని ఆశిస్తున్నాను. మీరు చాలా ముఖ్యమైన వారు, అవసరమైన వారు, ప్రత్యేకమైన వారు " - మామ జర

ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే " ఎదో ఒకరోజు మీరు ఉదయం లేవగానే అలా దొర్లుతూ మీ జీవితంలోనే అత్యంత ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని ముద్దాడి శుభోదయం చెబుతారు "

మనం అందరం ఆనందంగా ఎలా బ్రతకాలి అని ఆలోచనలు చేసే ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మన జీవితాల్లోకి ఆనందాన్ని తీసుకువచ్చి, ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు.

7 Ways To Bring A Morning Smile On Your Partners Face

ప్రేమ :

మీ భాగస్వామి ముఖం పై చిరునవ్వు ఉండి, ఆ రోజు మొత్తం వారికి ఆనందంగా, సంతృప్తికరంగా ఉండాలంటే, ఎటువంటి ఆలోచనలు లేదా పనులు చేయాలి అని మీరు వెతుకుతున్నారా ?

అలా అయితే ఇది చాలా మంచి లక్షణం.

ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యంలో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీ భాగస్వామిని ఆనందంగా ఉంచడం. మీ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు దృఢంగా మరియు బంధాలు బలంగా ఉండాలంటే, ఒకరినొకరు చూసుకొని నవ్వే మార్గాలను ఎంచుకోవాలి. ఇద్దరు ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే రోజంతా ఎంతో హాయిగా గడిచిపోతుంది.

మీ భాగస్వామి ముఖంలో ప్రతి ఉదయం ఆనందాన్ని చూడాలని భావించినట్లైతే, అందుకు మీరు చేయాల్సిన ఆలోచనలు ఇవే.

7 Ways To Bring A Morning Smile On Your Partners Face

1 వారు మిమ్మల్ని చూసినప్పుడు నవ్వండి :

మీ భాగస్వామి ముఖం లో చిరునవ్వుని చూడాలని మీరు భావించినట్లైతే, అందుకు చేయవల్సిన ప్రభావవంతమైన ప్రక్రియ ఏమిటంటే, వారు మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంతో హాయిగా నవ్వండి. ఇలా చేయడం వల్ల రోజంతా వారిలో కొత్త ఉత్సాహం వస్తుంది. అంతేకాకుండా ఉదయాన్నే చిరునవ్వు ముఖంలో ఎవరు చూడకూడదు అని అనుకోరు కదా. ఈ చిన్న పని చేయడం వల్ల మీ భాగస్వామి తన మనస్సులో ఎంతో ఆనందాన్ని పొందుతారు, రోజంతా ఎంతో ఉల్లాసంగా గడిచిపోతుంది.

" నా జీవితం నన్ను చూసి తిరిగి నవ్వడం కోసమై, నా ముఖం పై నవ్వు ఎప్పుడు అలానే ఉంటుంది "

2 ఉదయాన్నే ముద్దు పెట్టడం :

మీ భాగస్వామి ముఖం పై చిరునవ్వు వచ్చేలా చేయాలంటే, ఉదయం లేవగానే వారి బుగ్గల పై లేదా పెదాల పై ముద్దు పెడుతూ " నా ప్రేమకు శుభోదయం " అని చెప్పండి. ఇలా చేయడం వల్ల ఆలోచనలన్నీ ఎంతో నూతనంగా ఉంటాయి. వద్దన్నా ముఖం పై ఉదయాన్నే చిరునవ్వు వెళ్లి విరుస్తుంది.

7 Ways To Bring A Morning Smile On Your Partners Face

3 కలిసి అల్పాహారం చేయండి :

మనిషి గుండెను చేరుకోవాలంటే, వారి కడుపుని నింపడం కూడా చాలా ముఖ్యం.

పడకగదిలో అల్ఫాహారాన్ని ఇద్దరు కలిసి తీసుకున్నట్లైతే, మీ భాగస్వామి ఆలోచనలు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా వారి ముఖం పై చిరు నవ్వుని చూడవచ్చు. మీ భాగస్వామికి ఏ అల్పహారం అయితే ఇష్టమో, దానిని వారికి వడ్డించండి. అప్పుడు వారు మరింత ఆనందపడతారు.

తాజా ప్యాన్ కేక్ ల సువాసన, వేయించిన కాఫీ గింజల కాఫీ ని సూర్యోదయంతో తీసుకోవడం, ఆ సూర్యుడిని చూస్తూ అలా ఆస్వాదించడం, ఇంతకంటే ఇంకేమి కలవాలి.

మీరు చేస్తున్న కృషికి ఖచ్చితంగా మీ భాగస్వామి ముఖంలో చిరునవ్వుని చూడవచ్చు.

4. గదిని శుభ్రపరచండి :

ఉదయం లేవగానే, గదంతా శుభ్రంగా ఉండి ఎక్కడి వస్తువులు అక్కడే గనుక ఉన్నట్లయితే, ఆ సందర్భం మీ భాగస్వామిలో ఆ రోజుకు కావాల్సినంత శక్తిని ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా మీకు మీ భాగస్వామిని సంరక్షించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయం వారికి అర్ధం అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే వారు మిమ్మల్ని చూస్తారో, ఆ క్షణంలో వారి ముఖంలో ఖచ్చితంగా చిరునవ్వు చూడవచ్చు.

7 Ways To Bring A Morning Smile On Your Partners Face

5 వ్యాఖ్యలను చదవండి :

మీ భాగస్వామి దగ్గర స్ఫూర్తి ని ఇచ్చే, ప్రేమపూరితమైన వ్యాఖ్యలను ఉదయాన్నే చదినట్లైయితే వారి ముఖం వెలిగిపోతుంది. ఉదయం పూట ఉండే నిస్తేజం, ఆవలింతలు అన్నీ దూరం అవుతాయి. మీకు కావాల్సిన వ్యాఖ్యలు అంతర్జాలంలో దొరుకుతాయి లేదా మీ అంతట మీరే ఏవైనా సొంతంగా అయినా రాసి వారికి వినిపించండి. ఉదాహరణకు ఏవైనా మంచి వ్యాఖ్యలని వినిపించి అవి మీరే రాసారని అని చెప్పండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ భాగస్వామి ముఖం పై చిరున్నవ్వు చూడవచ్చు. దీంతో వారి ఆలోచలన్నీ రోజంతా ఉత్సాహం గా ఉంటాయి.

6 హాస్యాన్ని పండించండి :

ఈ సృజనాత్మకమైన మార్గం ద్వారా మీ భాగస్వామి ముఖంలో చిరునవ్వు చూడవచ్చు. మీ పై మీరే గనుక హాస్యం పండించుకున్నట్లైతే, మీ భాగస్వామి ఖచ్చితంగా నవ్వుతారు.

ఒకవేళ మీకు హాస్యం పండించడం రానట్లైతే, ఏదైనా సరికొత్తగా నవ్వించే విధంగా ఉన్న హాస్యాన్ని చదివి వినిపించండి. అది కూడా వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

7. ఒక తియ్యటి సందేశాన్ని పంపండి :

అవును మీరు విన్నది నిజమే, ఇందుకు మీకు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది., మీరు ఎక్కడో దూరంగా ఉన్నట్లయితే, అయినా కూడా మీరు మీ భాగస్వామి ముఖంలో చిరునవ్వుని చూడాలని భావిస్తే ఉదయాన్నే ఒక సందేశాన్ని పంపంచండి. అది ఖచ్చితంగా మీ భాగస్వామి ముఖం ఫై చిరునవ్వు వచ్చేలా చేస్తుంది. మీ ఇద్దరు ఉన్న ఏదైనా హాస్య చిత్రాలను తీసుకొని మీ భావాలను జోడిస్తూ సందేశాలను పంపండి. ఇలా చేయడం వల్ల మీ భగస్వామి ఎంతో ఆనందపడతారు.

English summary

7 Ways To Bring A Morning Smile On Your Partner's Face

Are you looking out for ideas to make your partner smile every morning to have a good and satisfying day? Well, that's a really sweet gesture. In every relationship, the most important aspect is keeping your partner happy and finding out ways to smile at each other as a genuine gesture of involvement between you both. Waking up to smile sets the tone for the rest of the day.