మీ సంబంధం ముగింపు పలకనుంది అనడానికి ప్రధాన సంకేతాలు ఇవే

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ప్రేమలో ఉన్న ఇద్దరిలో ఏఒక్కరిలో అయినా, తమ భాగస్వామి పట్ల హేయభావం, అనాసక్తి, ఈర్ష్యా ద్వేషాలు, విసుగు వంటివి తలెత్తినప్పుడు, నెమ్మదిగా ఆ ప్రేమ సన్నగిల్లే అవకాశం ఉంది. ఒక సంబంధాన్ని ముగించాలి అని అనుకోవడం ఎంత కష్టతరమో, అదేవిధంగా కొన్ని సమయాల్లో భాధలను మిగల్చడం లేక అనేక సమస్యలను సైతం తెస్తుంది. కానీ మీరు ఉన్న సంబంధంలో సంతోషం దొరకని పక్షంలో, ఆ సంబంధంలో కొనసాగడం కూడా భవిష్యత్తులో మంచిది కాదు.

మనం ప్రేమలో ఉన్న వ్యక్తి మనకు సరైనవారే అన్న ప్రఘాడ విశ్వాసం మనసులో ఉండాలి. లేకపోతే ఈ సంబంధాన్ని కొనసాగించినా అర్ధం లేనిదే అవుతుంది.

ప్రేమలో తమ భాగస్వామి పట్ల హేయబావం కలగడానికి, లేదా అనాసక్తి ప్రదర్శించడం, తద్వారా సంబందాలు తగ్గుముఖం పట్టడం అనేది జీర్ణించుకోలేని విషయమే. కానీ ఒక అర్ధo లేని సంబంధంలో ఉండి , ఇద్దరి జీవితాలు నాశనం చేసుకునే కన్నా ఎవరి మార్గాలలో వారు వెళ్లడమే మంచిది.

కొన్ని సందర్భాలలో అలా ఎవరి దారి వారు చూసుకోవడం కూడా కష్టతరమే, కానీ వారితో జీవితం ఎలా ఉంటుంది అన్న అంచనాకు రావడం ద్వారా, వారితో ఉండాలో లేదో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇక్కడ తొందరపాటు పనికి రాదు. ఎందుకంటే ఇది జీవితానికి, మనసులకి సంబంధించిన సమస్య. ఒక్కోసారి అపార్ధాలు కూడా కారణం కావొచ్చు. కూర్చుని మాట్లాడుకుంటే తొలగిపోయే సమస్యలు కూడా కావొచ్చు. కావున తొందరపాటు ఎన్నటికీ సరికాదు.

ఈ సంజ్ఞలు తెలుపుతాయి, మీ భాగస్వామితో ఉండాలో లేదో

Signs That Tell You To End Your Relationship

మోసం – ఇది నిజంగా భరించలేని అంశమే:

కొందరు వ్యక్తులు ప్రేమని ఆటగా భావిస్తుంటారు మరియు వారు కొంతకాలానికి విసుగుకు గురైనప్పుడు ఖచ్చితంగా మోసం చేయాలనే భావిస్తారు. ఇక్కడ ఇలాంటి భాగస్వామిని విడిచి పెట్టుటకు వేరే కారణాలే అవసరం లేదు. ఎందుకంటే ప్రేమలో మోసం కన్నా మరణo మరొకటి లేదు. అలాంటి మోసగాళ్లతో జీవించడం కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. అలాగని మోసపోయామన్న భావనలో ఉండడం కూడా సరికాదు. ఇది ఆత్మ న్యూనత, డిప్రెషన్ వంటి వాటికి దారితీస్తాయి. అలాంటి వ్యక్తులతో బ్రతికే కన్నా, మీ మార్గంలో మీరు ఉన్నతంగా బ్రతకడానికి సోపానాలను తయారు చేసుకోండి.

హింస:

మీ భాగస్వామి ప్రవర్తనలో హింసాత్మక ధోరణి కనిపించినప్పుడు, మరియు మీతో కూడా అదే ప్రవర్తని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ భాగస్వామి మీకు సరికారు అని మీకే అర్ధమైపోతుంది. ఇటువంటి సంబంధాలు ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు. కావున వదిలివేయాలన్న నిర్ణయం మీ పరిస్థితులను బట్టి తీసుకుంటే, ఆ సంబంధానికి ఫుల్ స్టాప్ పెట్టి మీ మార్గాన్ని ఎంచుకోవడమే మంచిది. హింస కారణంగా భయాలు మొదలవుతాయి. జీవితమంతా హింసాత్మక ధోరణిలో ఉంటే , ప్రేమకు తావెక్కడ. సంతోషం లేని సంబంధాన్ని కొనసాగించుటకన్నా , అక్కడితో ముగింపు పలకడం ఎన్నో విధాల మంచిది.

ప్రవర్తనతో భాధకలిగించడం అదుపు తప్పుతుందా?

మీ భాగస్వామి మిమ్ములను అదే పనిగా భాధ పెడుతూ, మీ బ్రతుకునే ప్రశ్నార్ధకం చేస్తుంటే, ఆ సంబంధంలో కొనసాగడం అర్ధం లేని వ్యర్ధ జీవితమే అవుతుంది. తమని తాము మార్చుకోక పోగా, మరలా ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు, సంతోషం కాకుండా చిరాకుగా అనిపిస్తే, అతనితో జీవితం బాగుండదని సంకేతం. ఈ సంబంధానికి ముగింపునివ్వడం అన్నీ విధాలా సరైనదే. మీ జీవితం ప్రతి మలుపులో ఇలాంటి ఒడిదుడుకులు ఈ భాగస్వామి కారణంగా ఎదురవుతూ ఉంటే, సంబంధాన్ని నిలబెట్టుకోవాలి అని చూడడం నిరర్ధకరమైన ప్రయత్నమే అవుతుంది. ఒకవేళ కొనసాగిస్తే పర్యవసానాలు చాలా దారుణంగా కూడా ఉండవచ్చు. జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోవాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి.

Signs That Tell You To End Your Relationship

మీ భాగస్వామి విధానంలో మార్పునకు ప్రయత్నించకపోతే

ఒక ఉన్నతమైన సంబంధానికి ప్రధాన సూత్రం ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరినొకరు అర్ధం చేసుకోవడం. ఈ రెండింటి ద్వారా ఆ ఇద్దరూ తమ జీవితకాలంలో సంబంధాలను నిలబెట్టుకోవడానికి మరియు జీవితంలో అన్నీ లాభ నష్టాలకు సమానంగా తమ తమ ప్రయత్నాలను ఇస్తుంటారు. ఇలాంటి సంబంధం దీర్ఘకాలం నిలచి ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ మిమ్ములని వెనుకకు లాగుటకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటే, మీరు సంబంధాన్ని ముగించాలని పరిగణించాలి. మీ పనికి గుర్తింపు లేని ఈ సంబంధంలో కొనసాగడం కూడా సరైనది కాదు.

ఉపయోగం మరియు ప్రయత్నం లేని ఏ సంబంధమైనా చంద్రుడులేని ఆకాశం వలె మరణించినట్లే లెక్క.

కొనసాగింపు వాదనలు మరియు పోరాటాలు:

కొందరు ఏదైనా వాదనలు జరిగినప్పుడు, అంతటితో ఆపకుండా కొనసాగింపు ధోరణిని కనపరుస్తూ ఉంటారు. కొన్ని ఆటపట్టింపులా ఉన్నా, కొన్ని మాత్రం మనసుని గాయపరచేవిలా ఉంటాయి. వాదనకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలు చేయనప్పుడు, తగాదాలే చివరికి జీవితంగా మిగులుతాయి. అర్ధం లేని వ్యర్ధ వాదనలతో కాలం వెళ్లదీసే ప్రభుద్దులతో జీవితo ఎన్నటికీ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఎన్నటికీ ఇవ్వలేవు. ఒకవేళ అలాంటి అర్ధం లేని గొడవలు పొడిగించబడుతూ ఉంటే, మీకు మీరే ఆలోచించుకుని ఆ గొడవలకు ముగింపు పలికేలా ఉండగలగాలి. అప్పుడే సంబంధాలు బాగుంటాయి. లేనిచో ఆ సంబంధాలు ఎక్కువకాలం నిలబడవు.

అసంతృప్తి జీవనం:

ఏ సంబంధంలో అయినా ప్రధాన అజెండా సంతోషమే. కానీ మీరు ఆ భావనని ఆ సంబంధంలో కలిగి ఉండకపోతే అది ఖచ్చితంగా అసంతృప్తే. జీవితం సంతోషంగా ఉండేలా రూపొందించుకోవాలి కానీ, ఎన్నడూ అసంతృప్తితో ఉండేలా కాదు. ఒక భాగస్వామిని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించారు అంటే ఒకరికొకరు సహకారం అందించుకుంటూ జీవితాన్ని ఉత్తమంగా తీర్చి దిద్దుకునేలా ఉండాలనే కానీ, వ్యతిరేక భావనలతో కాదు. అలాంటి జీవితంలో ఉండడం కన్నా స్వస్తి చెప్పడమే వంద శాతం సరైనది.

Signs That Tell You To End Your Relationship

మీకసలు వారితో మంచి భవిష్యత్తు కనిపిస్తుందా?

మీరున్న సంబంధంలో భవిష్యత్తు కనపడకపోతే, అర్ధం లేని జీవితాన్ని ఆహ్వానిస్తున్నట్లే. భవిష్యత్తు అంటే ఆర్ధికంగా మాత్రమే కాదు. సంతోషాలు కూడా. వీరితో జీవితం కొనసాగించడం మీకు ప్రశ్నార్ధకంగా కనిపిస్తే, ఆ సంబందాన్ని కొనసాగించకపోవడమే మంచిది. భవిష్యత్తు లేని సంబంధం మరణానికి మినహాయింపే మరి. అలాంటి సంబంధం కొనసాగిస్తే కూడా విలువ ఉండదు.

మీరు విలువ లేనివారు గా కనిపిస్తున్నారా ?

ప్రతి సంబంధం విలువలు, ప్రేమ, నమ్మకం మరియు స్వాతంత్ర్యం యొక్క భాగస్వామ్యంగా ఉండాలి. కానీ మీ భాగస్వామి దృష్టిలో మీపై ఎటువంటి విలువ లేని విధంగా మీరు చూసినప్పుడు, ఆ సంబంధం మరణించినట్లే. ఇంకే కారణం చేతనూ మీరు ఉండవలసిన అవసరం లేదు. విలువ లేనప్పుడు మనిషి మానసికంగా మరణించినట్లే కదా. ఆ సంబంధంలో ఉండడం సరైనది కూడా కాదు.

కొన్ని సందర్భాలలో సంబంధాన్ని అంత తేలికగా విచ్ఛిన్నం చేయడానికి సిద్దపడలేకపోవచ్చు. కొంతకాలం వేచి చూడండి, అయినా మనుషుల్లో మార్పు రానప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఓర్పు సహనం కూడా సంబంధం బలపడడంలో ముఖ్యం. ఒక్కోసారి అపార్ధాలకు చోటివ్వడం ద్వారా మంచి సంబంధాలు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరూ ఒక చోట చేరి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఏ ప్రయత్నానికి మనిషిలో మార్పు కనపడనప్పుడు, ఆ జీవితం కొనసాగించడం కూడా వ్యర్ధమే అవుతుంది. కానీ ఒక సంబంధాన్ని కలిగి ఉండాలన్నా, సంబంధం నుండి వేరుపడాలని యోచన చేస్తున్నా, తొందరపాటు నిర్ణయాలు మాత్రం పనికి రావు. ఏ మాత్రం తప్పు నిర్ణయం తీసుకున్నా బంగారం లాంటి జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త మరి.

మీరు పైన పేర్కొన్న కారణాల్లో ఏదైనా సంబంధం కలిగి ఉంటే, అప్పుడు ఆ సంబంధం మీకు భారంగా అనిపిస్తే నిర్ణయం తీసుకోవడమే మంచిది.

English summary

Signs That Tell You To End Your Relationship

In relationship we seek happiness and if we are unable to get it, we should end it rather than dragging it. The reasons mentioned in the article are often the ones for which we end our relationship. Read through the article to find out if you are happy to stay in relationship or should let it go. People outgrow each other and go separate ways.
Story first published: Tuesday, March 20, 2018, 9:00 [IST]