Just In
- 19 min ago
పంటి నొప్పిని త్వరగా తగ్గించుకోవడానికి ఉల్లిపాయ ముక్క
- 2 hrs ago
ఈ 5 రాశుల వారు చాలా హాట్ అండ్ గ్లామరస్ గా ఉంటారని మీకు తెలుసా?మరి ఇందులో మీ రాశి ఉందా?
- 4 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ 26 నుండి జులై 2వ తేదీ వరకు..
- 6 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి..!
Don't Miss
- News
మోడీకి సుప్రీం క్లీన్ చిట్- ఆరోపణలు చేసిన వారంతా జైళ్లకు- 19ఏళ్ల కక్ష తీర్చుకుంటున్నారా ?
- Sports
IND vs ENG:పులి కాస్త పిల్లి.. అదేందో విదేశీ పర్యటనలు అనగానే రోహిత్‌కు బెడ్ రెస్ట్!
- Finance
ఎస్బీఐ ఖాతాదారులకు మరో శుభవార్త, ఈ టోల్ ఫ్రీ నెంబర్‌తో మరిన్ని సేవలు
- Technology
SBI YONO యాప్‌లో లబ్ధిదారులను జోడించడం ఎలా?
- Automobiles
ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..
- Movies
యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తాము ప్రత్యేకమనే భావన కలుగ చేయడానికి పది మార్గాలు.
మీరు గాఢమైన అనుబంధంలో ఉన్నారా? ఐతే మీరు మీ భార్య లేదా ప్రియురాలితో ఈ మహిళా దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవడానికి ప్రణాళిక వేసుకున్నారు? ఈ మార్చి 8ని వారికి ఒక మధురానుభూతిగా మిగల్చండి.
సహజంగా ప్రతి స్త్రీ తనను తాను ప్రత్యేకమని భావిస్తుంది. అది నిజమే! అయినప్పటికీ వారొక బంధంలో ఉన్నప్పుడు, వారి భాగస్వామి యొక్క పూర్తి ఏకాగ్రత తమపై ఉండాలని కోరుకుంటారు. వారి నుండి లాలన , ప్రశంసలు కోరుకుంటారు.
స్త్రీత్వాన్ని ఒక వేడుకగా జరుపుకోడానికి ఉద్దేశించినది మహిళా దినోత్సవం.
మహిళల ఉనికి సమాజానికి నిజంగా ప్రత్యేకమైనదన్న అనుభూతి వారు పొందగలగాలి.
వాళ్ళు మీ నుండి అద్భుతాలని ఆశించారు. ఒక బిగి కౌగిలితోనే వారు మీ మీ ప్రేమ హద్దులేనిదని సంతోషిస్తారు. ఒక ఎర్ర గులాబీతో మీరిచ్చే ప్రేమసందేశంతో వారు ఉక్కిరిబిక్కిరవుతారు. స్త్రీలు అల్పసంతోషులు.
ఈ మహిళా దినోత్సవానికి మీరేమి చేయబోతున్నారు? మీకు మాత్రమే ప్రత్యేకమైన పడతికి మీరందించబోయే ప్రత్యేక క్షణాలతో కూడుకున్న రోజు కదా మరి!
తన ఉనికే ఒక అద్భుతమని ఆమెకు తెలియచేయడానికి పది ప్రత్యేక మార్గాలు మీకోసం . అవేంటో తెలుసుకుని, ఆచరించి, ఆమెను ఆశ్చర్యానికి లోను చేయండి.

1.అందగత్తెననే భావనను కలిగించండి:
నిజానికి మీ జీవితంలో ప్రతిరోజూ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి. సాధారణంగా ఎంత అందమైన స్త్రీకైనా తమ రూపురేఖలపై ఎక్కడో ఒక మూల చిన్న సందేహం ఉంటుంది. తమ అందంతో భాగస్వామిని మెప్పించగలుగుతున్నామా! అన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. తమ భాగాస్వామి యొక్క ప్రశంసలు పొందాలని ఆరాటపడతారు. ఆమెలో ఆ ఆత్మవిశ్వాసం కలిగేలా మీరు ప్రవర్తించండి.

2. ఆమె ఎడల విశ్వాసంగా ఉండండి:
ఆడవాళ్ళు తమ పట్ల విశ్వాసం మెలిగే మగవారిని ఇష్టపడతారు. ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని, ఇన్నాళ్ళు ఆమె ఎడల మీ ఎదలో పొందుపరచుకున్న భావోద్వేగాలను నిజాయితీగా ఆమె ముందుంచండి. పాశ్చాత్య దుస్తుల్లో ఆమె ఎంత చూడ ముచ్చటగా ఉంటుందో ఇంతవరకు మీరు ఆమెకు తెలియజేయలేదేమో? ఆలోచించండి! ఐతే ఆ విషయం ఇప్పుడు తెలపండి. ఆమెలో మీకు నచ్చని లక్షణాలైనా కాని మర్యాదతో ఆమెకు నచ్చచెపితే ఆనందంగా అర్ధం చేసుకుంటుంది. మాటల వాడుకలో కాస్తంత శ్రద్ధ వహించండి.

౩. ఆమెను ప్రేమతో గాఢంగా చుంబించండి:
హటాత్తుగా, పదేపదే ఆమెను చుంబించండి. ఆమె మీ పై గత కొన్ని రోజులుగా కినుక వహించిందా? ఆమెతో మాట కలపాలనుకుంటే ఇదే సరైన సందర్భం. మీ ముద్దులతో ఆమె కోపం వెన్నలాగ కరిగిపోతుంది.

4. ఆమెను ఇతరులతో పోల్చకండి:
ఈ రోజున మీ పాత పోకడలు కొన్నింటిని మార్చుకోండి. ఆమెను ఇతరులతో సరిపోల్చి చిన్నబుచ్చే అలవాటు మీకుంటే, నేటితో దానికి టాటా చెప్పండి. ఆమెను ఎప్పుడు, ఎవరితోనూ పోల్చి కించపరచకూడదనే ప్రమాణం చేసుకోండి. ఆఖరికి ఆమె వంటల రుచికి,అమ్మ వంటల రుచికి మధ్య పోటీ పెట్టడం కూడా మానేయండి!

5. ఆమెకున్న చిన్న చిన్న ఇష్టాలపై ధ్యాస పెట్టండి:
ఆమెకున్న చిన్న చిన్న అభిరుచులను గుర్తుచేసుకోండి. ఆమె మీ వద్ద ఇప్పటికే ఎన్నో సార్లు ఆమెకిష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీంను గురించి ప్రస్తావించి ఉంటుంది.ఈ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి వెళ్లేటప్పుడు ఆమె కోసం ప్రేమతో తీసుకుని వెళ్ళండి. ఆమె మనసు మంచు కన్నా చల్లగా మారిపోతుంది.

6.ఆమె కోరుకున్నట్లు మెలగండి:
ప్రతిరోజూ ఆమె మీ ఇష్టాలకు అనుగుణంగా వంట చేస్తుంది. మీ కనులకు ఇంపుగా అలంకరించుకుంటుంది. కాని ఈ రోజు మీ పాత్రలను పరస్పరం మార్చుకోండి. ఆమెకు మీ మీద ఉండే ముచ్చట తీర్చండి. ఆమెకి ఇష్టమైన దుస్తులను ధరించండి. ఆమె మెచ్చే వంటకాన్ని ప్రత్యేకంగా తయారుచేసి తినిపించండి.

7.ఆమెను గౌరవించండి:
మీకు ఆమెను గౌరవించే అలవాటు లేనట్లయితే, ఇప్పటివరకు ఆమె మీతో కలసి ఉన్నందుకు మీరు అదృష్టవంతులు. కనీసం ఈ వేళ నుండి ఆమెను గౌరవించడం మొదలుపెట్టండి. ఇది ఆమె కోసం మాత్రమే కాదు ఆమె ముందు మీ మర్యాదను మీరు నిలబెట్టుకోవడం కోసం!

8.ఆమెను ఇతరుల ముందు ప్రశంసించండి:
ఇది బహుశా మీకిప్పటి వరకు అలవాటు లేని పనేమో! మీ స్నేహితులకు మీరిచ్చిన విందు కోసం ఆమె ఏంతో కష్టపడి రుచిగా వంట-వార్పు చేసిందని మీరు గుర్తించినా కూడా ఆమెకు తెలియజేయలేదా!అయితే ఆ అవకాశాన్నిఇప్పుడు అందిపుచ్చుకోండి. మీ బంధుమిత్రుల సమక్షంలో ఆవిడను ప్రశంసించండి.

9.ఆమెతో మాత్రమే ఈ రోజు గడపండి:
మీ భార్య లేక ప్రేయసికై సమయాన్ని వెచ్చించలేకపోతున్నందుకు చింతిస్తున్నారా? ఐతే ఈ రోజులో అనుక్షణం పూర్తిగా ఆమెకే కేటాయించండి. బయట తిరుగుతూ సంతోషంగా గడపండి. లేకుంటే ఇంటిలోనే ఒకరి నునివెచ్చని కౌగిలిలో ఇంకొకరు సేద తీరండి.

10. మీలో రసికతను బయటపెట్టండి:
ఆఖరిగా ఆమె కొరకు ఒక కవిత రాసి లేదా పాట పాడి ఆశ్చర్యపరచండి. ఆమెను బహుమతులతో ఆశ్చర్యచకితురాలిని చెయ్యండి. ఆమెను ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేయడానికి పలుమార్గాలు ఉన్నాయి. చివరిగా అవధులు లేని ప్రేమాభిమనాలలో ఆమెను ముంచెత్తండి.