ప్రేమ క‌థ: ప్రేమ‌తో ఆనంద‌మ‌య ప్ర‌పంచాన్ని సృష్టించుకున్నారు

By: sujeeth kumar
Subscribe to Boldsky

ప్రేమ‌లో ప‌డ‌టానికి స‌రైన వ‌య‌సు అనేది ఉంటుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. చ‌దువు పూర్త‌యి వృత్తిలోకి అడుగుపెట్టిన త‌ర్వాతే పెళ్లి, ప్రేమ గురించి ఆలోచించాల‌నే భావన మ‌న‌లో చాలా మందికి ఉంటుంది.

ప్రేమ అనే భావన ఎప్పుడైనా, ఎక్క‌డైనా క‌లుగుతుంది. దాన్నెవ‌రు ఆప‌లేరు. చిన్న వ‌య‌సులో పుట్టే ప్రేమ‌ను అన్ని సంద‌ర్భాల్లోనూ ఆక‌ర్ష‌ణ‌గా కొట్టిపారేయ‌లేం. కొన్ని సార్లు చిన్న వ‌య‌సులో పుట్టే ప్రేమే కల‌కాలం నిలిచిపోతుంది.

When Love Can’t Be Separated

ప్రేమ చిగురించ‌డానికి ఎంత స‌మ‌యం ఇస్తే, జంట‌ల మ‌ధ్య అంత బ‌ల‌మైన బంధం ఏర్ప‌డుతుంది. ఇప్పుడు రాఘ‌వ్‌, నైనాల ప్రేమ బంధం గురించి తెలుసుకుందాం. వాళ్లు ఇత‌రుల‌కు ఎలా ఆద‌ర్శంగా నిలుస్తున్నారో చూద్దాం...

పాఠ‌శాల స‌మ‌యంలో...

పాఠ‌శాల స‌మ‌యంలో...

రాఘ‌వ‌, నైనాలదీ ఎదురెదురు ఇళ్లే. వాళ్ల‌క‌ప్పుడు 5 ఏళ్లు. ఆట‌పాట‌లు అన్నీ క‌లిసే చేసేవారు. వాళ్ల‌ది విడ‌దీయ‌రాని బంధంగా ఉండేది. ఏళ్లు గ‌డిచేకొద్దీ వాళ్ల మ‌ధ్య స్నేహం బాగా పెరిగి ప్రేమ చిగురించింది. ఇద్ద‌రు ప్రేమ ప‌క్షుల్లా స‌మ‌యం గ‌డిపేవారు. ఎప్పుడూ ఒకే ద‌గ్గ‌ర క‌నిపించేవారు. అలా స‌మయం గ‌డుస్తూ వ‌స్తుంది.

స‌మాజంలో...

స‌మాజంలో...

అయితే వీళ్ల బంధం అలాగే కొన‌సాగ‌లేక‌పోయింది. ఇరు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌ల‌కు వీళ్ల ద‌గ్గ‌రిత‌నం అంత‌గా రుచించ‌లేదు. స్కూల్లోనే వీరి స్నేహం, ప్రేమ‌ల విష‌య‌మై ఫిర్యాదులు చేశారు. స్కూల్లో ఇలాంటి వ్య‌వ‌హారాలు న‌డ‌వ‌కుండా చూడాల‌ని అక్క‌డి సిబ్బందికి గ‌ట్టిగానే హెచ్చరించారు. అదీ గాక ప్రేమా, గీమా అనేదానికి ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని అనుకొని త‌గిన చ‌ర్య‌ల్లో త‌ల్లిదండ్రులు ప‌డ్డారు.

ఎడ‌బాటు బాధాక‌రం

ఎడ‌బాటు బాధాక‌రం

ఏళ్లు గ‌డిచేకొద్దీ రాఘ‌వ‌, నైనాలు త‌మ ఆఖ‌రు ప‌రీక్ష‌లు పూర్తి చేశారు. రాఘ‌వ మెడిక‌ల్ ప‌రీక్ష‌లు బాగా రాసి వైద్య వృత్తి చేసేందుకుగాను వెళ్లాడు. మ‌రో ప‌క్క నైనా ఫ్యాష‌న్ స్కూల్‌కు వెళ్లింది. 4 ఏళ్ల‌పాటు వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఎడ‌బాటు. ఈ నాలుగేళ్లు త‌ర‌చూ క‌లుస్తు ఉండేవారు. వారి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింది.

మ‌ళ్లీ కలిశారు...

మ‌ళ్లీ కలిశారు...

ఇద్దరి డిగ్రీలు పూర్త‌య్యాయి. రాఘ‌వ డాక్ట‌ర్ గా, నైనా ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించాల‌నుకున్నారు. ఏ న‌గ‌రంలో సెటిల్ బాగుంటుందో అనే త‌ర్జ‌న‌భ‌ర్జ‌న మొద‌లైంది.

చాలా చ‌ర్చ‌ల త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ముంబ‌యిలో స్థిర‌ప‌డాల‌నే నిశ్చ‌యానికొచ్చేశారు. వాళ్ల చిన్న‌నాటి పాఠ‌శాల రోజులు గుర్తుకొచ్చాయి. ప్రేమ‌, బంధాలు బ‌ల‌ప‌డ్డాయి.

ఆ త‌ర్వాత‌...

ఆ త‌ర్వాత‌...

అయిదేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేశారు. ఇద్ద‌రూ త‌మ త‌మ కెరీర్‌ల‌తో బాగా వృద్ధి చెందారు. ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాల‌నుకున్నారు. అప్పుడే వాళ్ల త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఒప్పుకోలేదు..

ఒప్పుకోలేదు..

వాళ్ల త‌ల్లిదండ్రులు సుల‌భంగా ఒప్పుకుంటార‌ని అనుకున్నారు. అయితే అనుకున్న‌ది జ‌ర‌గ‌లేదు. ఇరు కుటుంబాలు అది చిన్న నాటి ఆక‌ర్ష‌ణ అని కొట్టిపారేశారు. అప్పుడే దాన్ని తుంచేయాల్సింది అని అన్నారు. పెళ్లికి స‌సేమిరా ఒప్పుకోలేదు.

రిజిస్ట‌ర్ మ్యారేజ్‌..

రిజిస్ట‌ర్ మ్యారేజ్‌..

దాదాపు ద‌శాబ్దంన్న‌ర పైగా ఇద్ద‌రి బంధం కొన‌సాగుతూ వ‌చ్చింది. తాము ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేమ‌నే నిశ్చ‌యానికి వ‌చ్చారు. త‌ల్లిదండ్రులు ఒప్పుకోక‌పోయినా రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోవాల‌నుకున్నారు.

మూడేళ్ల త‌ర్వాత‌...

మూడేళ్ల త‌ర్వాత‌...

వాళ్లు పెళ్లి చేసుకొని మూడేళ్లు అయ్యింది. ముంబ‌యిలోని బాంద్రాలో ఒక పోష్ అపార్ట్‌మెంట్లో ఆనందంగా జీవితం గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికీ వాళ్ల వాళ్ల త‌ల్లిదండ్రులు వారి పెళ్లిని ఒప్పుకోరు. అయినా రాఘ‌వ‌, నైనాలు త‌మ‌కంటూ ఒక ప్ర‌పంచాన్ని నిర్మించుకొని అందులో ఆనందంగా గ‌డిపేస్తున్నారు. ఈ ప్రేమ జంట అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

English summary

When Love Can’t Be Separated

When Love Can’t Be Separated,Only for a few, true love happens at an early age. And, very rarely, this love will have a happy ending, despite several odds. So, here is one such story where the couple knew each other from the age of five. Yes!! Read on to know what actually happened to their love story.
Subscribe Newsletter