For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాంధవ్యంలో ఏర్పడే సమస్యలతో మీరు నష్టపోకుండా ఉండాలంటే ఇలా చేయాలి

వాటిని కనీసం లెక్క కూడా చేయరు. చివరి లో మాత్రం అనవసరంగా మాటలు అనుకుంటూ ఉంటారు. దీంతో నిరుత్సాహం వస్తుంది. బంధంపై ఉన్న గౌరవం పోతుంది. అయితే మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు దాన్ని డైవర్ట్ చేస

|

ప్రేమ ఈ పదం వింటేనే ఎంతో మధురమైన అనుభూతి అనిపిస్తుంది. అంత అద్భుతమైన అనుభూతి ఈ ప్రపంచంలో మరేమీ ఉండదేమో. కానీ ప్రతి ఫీలింగ్ వెనుక కూడా తీపి బాధ ఉంటుందంట. రిలేషన్ షిప్ లో అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి. ఆ బాధ మిమ్మల్ని కుంగదీయొచ్చు. కానీ ఎప్పుడేగానీ మీరు నిరుత్సాహపడకండి.

How To Not Lose Yourself In A Relationship

రిలేషన్షిప్ లోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో ఎంత అద్భుతంగా ఉంటుంది. భాగస్వామి కోసం మనం, మన కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ త్యాగాలు వైపున మరో చీకటి కోణాలు మాత్రం ఎవరూ పట్టించుకోరు.

వాటిని కనీసం లెక్క కూడా చేయరు. చివరి లో మాత్రం అనవసరంగా మాటలు అనుకుంటూ ఉంటారు. దీంతో నిరుత్సాహం వస్తుంది. బంధంపై ఉన్న గౌరవం పోతుంది. అయితే మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేందుకు కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో కావాలి.

మీ ఐడెంటిటీని ఇష్టం ఉంటేనే మార్చుకోండి. ఇక మీ కెరీర్ గోల్స్ పై ఫోకస్ పెట్టండి. వివాహానికి ముందు ఏవిధంగా ఫ్యాషన్‌ ను ఫాలో అవుతారో పెళ్లి అయ్యాక కూడా అలాగే చేయండి. మీ హాబీస్‌ను కూడా వదిలిపెట్టకండి. మీ స్నేహితులతో అలాగే స్నేహాన్ని కొనసాగించండి.

ఇష్టాలను పక్కన పెట్టకండి

ఇష్టాలను పక్కన పెట్టకండి

ఏదైనా స్పెషల్ గా చేయడం అంటే మీకు చాలా ఇష్టం ఉంటేవాటిని పక్కనపెట్టకండి. ఉదాహరణకి ఫోటోగ్రఫీ ఫ్యాషన్ సోషల్ వర్క్ లాంటివి వచ్చిన తర్వాత ఏమనుకుంటారో అని చాలామంది పక్కన పెడుతూ ఉంటారు. అలాంటి అభిరుచుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడకండి. మీ అభిరుచులు మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.

రెండు వేర్వేరు సోల్స్

రెండు వేర్వేరు సోల్స్

ప్రతి మనిషికి రెండు రకాల సోల్స్ ఉంటాయి. ఒకవైపు బాధలో ఉన్న మనంతకు మనం ధైర్యాన్నిఇచ్చుకోగలం. అలా రెండు సోల్స్ మనలోనే ఉంటాయి. ఒకే మనిషి ప్రేమించగలడు.. ద్వేషించగలడు. ఇలా రెండు రకాలుగా చెయ్యగలడు. అందువల్ల మీరు కాస్త బాధలో ఉన్నప్పుడు మీలో ఉన్న మరో సోల్ తో ఆలోచించండి. ఈ బాధను నేను అధిగమించగలను అని ధైర్యం తెచ్చుకోండి.

లక్ష్యాలు

లక్ష్యాలు

మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీ లక్ష్యాలను మాత్రం మరిచిపోకండి. లక్ష్యాలను అధిగమించేందుకు ప్రయత్నించండి. నాకు నచ్చిన జాబ్ లో జాయిన్ అయితే నా భాగస్వామికి దూరంగా ఉండి పని చేయాల్సి వస్తుందేమో అని కొన్ని రకాల జాబ్స్ ను మీరు వదులుకునే అవకాశం ఉంది. అలా ఎప్పటికీ చేయకండి. ఇలా మీ మనస్సును డైవర్ట్ చేసుకుని హ్యాపీగా ఉండండి.

Most Read :పెళ్లయిన ప్రతి జంట ఎదుర్కొనే సమస్య అదే, పిల్లల విషయంలో సూటిపోటి మాటలతో సమాజం అవమానిస్తుంది, ఆ మాటలుMost Read :పెళ్లయిన ప్రతి జంట ఎదుర్కొనే సమస్య అదే, పిల్లల విషయంలో సూటిపోటి మాటలతో సమాజం అవమానిస్తుంది, ఆ మాటలు

భయాన్ని వదిలిపెట్టకండి

భయాన్ని వదిలిపెట్టకండి

కొందరు రకకరాల భయాలతో జీవిస్తుంటారు. తమ భాగస్వామి ఎక్కడ తమని వదిలిపెట్టి పోతాడేమోనని భయపడుతుంటారరు. నేను ఏమన్నా మాట్లాడితే నా లైఫ్ పార్టనర్ నన్ను ఏమన్నా అంటాడేమో నా అభిప్రాయం వ్యక్తపరచాలా వద్దా అని భయపడేవారు చాలా మంది ఉంటారు. మీరు భయపడడం ఆపితేనే ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదంటే లేదు.

 రిలేషన్ షిప్ లో ఉండేవారంతా

రిలేషన్ షిప్ లో ఉండేవారంతా

ఇలాంటి సూచనలన్నీ రిలేషన్ షిప్ లో ఉండేవారంతా కచ్చితంగా పాటించాలి. అప్పుడే జీవితం హ్యాపీగా ఉంటుంది. ప్రతి రిలేషన్ షిప్ లో ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటి సందర్భంలో మీరు కాస్త మనస్సు డైవర్ట్ చేసుకుని ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.

English summary

How not lose yourself in a relationship

How To Not Lose Yourself In A Relationship
Desktop Bottom Promotion