For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాతో క్వారంటైనులో కలిశారు... కళ్యాణం చేసుకుని ఒక్కటయ్యారు...!

కరోనా సమయంలో కలిగిన ఒక ప్రేమ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా కారణంగా మనుషులందరి మధ్య అందనంత దూరం పెరిగిపోతోంద. మానవత్వం అనేది ఎప్పుడో చచ్చిపోయిందని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే చాలా మంది కరోనా వల్ల సహాయం చేసుకోవడాన్నే మానేశారు. కనీసం పలకరించుకోవడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

A Interesting Corona love story in telugu

కానీ కరోనా వంటి కష్టకాలంలో వారిద్దరూ కలిసి అడుగులేయాలనుకున్నారు.. కడదాకా కలిసి జీవించాలనుకున్నారు.. అంతే వారి కోరికలను తీర్చుకోవడానికి ప్రేమ పేరుతో ఒక్కటయ్యారు.

A Interesting Corona love story in telugu

అయితే ఈ ప్రేమ జంట విచిత్రంగా క్వారంటైనులో కలిశారు.. ముందుగా కళ్లు కళ్లు కలిశాయి.. మొదట్లో కేవలం చూపులతోనే మాట్లాడుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత మెల్లగా పరిచయం పెంచుకున్నారు.

A Interesting Corona love story in telugu

అంతే అందరూ ఆశ్చర్యపోయేలా అనునిత్యం కబుర్లు చెప్పుకున్నారు.. అంతే క్వారంటైను నుండి బయటపడేలోపు కళ్యాణం చేసుకోవాలనుకున్నారు.. అయితే వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? లేదా సినిమాల్లో మాదిరిగా వీరికి ఏమైనా అడ్డంకులు ఎదురయ్యాయా? ఇరు కుటుంబాల తల్లిదండ్రులు ఏమైనా కండిషన్లు పెట్టారా లేదా అంతా సాఫీగా సాగిందా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కరోనా కారణంగా..

కరోనా కారణంగా..

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ రావడంతో వారిద్దరూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ పక్క పక్కనే బెడ్లు ఖాళీగా ఉండటంతో వారికి ఆ రెండు బెడ్లను కేటాయించారు. అక్కడే వారిద్దరికీ ముందుగా కళ్లు కళ్లు కలిశాయి.. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అంతే కాలానికి తెలియకుండానే కబుర్లన్నీ చెప్పుకున్నారు..

ఇద్దరి మనసులు కలిశాయి..

ఇద్దరి మనసులు కలిశాయి..

అలా క్వారంటైనులో ఉన్నన్నీ రోజులు వారిద్దరూ ముచ్చట్లలో మునిగిపోయారు. అంతే అతి తక్కువ వ్యవధిలో వారిద్దరి అభిప్రాయాలు, అభిరుచులను గౌరవించుకున్నారు. అంతే వారిద్దరి మనసులు కలిసిపోయాయి. అంతే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

కరోనా నుండి కోలుకున్నాక..

కరోనా నుండి కోలుకున్నాక..

అలా వారి ప్రేమ ముందు కరోనా మహమ్మారి కూడా ఓడిపోయింది. తర్వాత చేసిన టెస్టులో ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. అంతే వీరిద్దరినీ ఒకేసారి ఆసుపత్రి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల్లోని తల్లిదండ్రులకు తెలిపారు. వారు కూడా వీరి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు పెట్టలేదు.

గుంటూరులో వివాహం..

గుంటూరులో వివాహం..

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఆ ప్రేమికుడిది ప్రకాశం జిల్లా. అమ్మాయిది మాత్రం గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట. అంతేకాదండోయ్.. వీరిద్దరి ప్రేమ వివాహానికి వారి పెద్దలు ఓకే చెప్పడానికి మరో కారణం ఉంది. అదేంటంటే ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. అందుకే వీరి పెళ్లి ఎలాంటి బ్రేకులు లేకుండా సింపుల్ గా గుంటూరు జిల్లా పొన్నూరులోని ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిపోయింది.

నిబంధనలు పాటిస్తూనే..

నిబంధనలు పాటిస్తూనే..

అయితే వీరి కళ్యాణం కూడా కరోనా నిబంధనల మధ్యే జరగడం విశేషం. అలా కరోనా వీరిద్దరినీ కలిపింది. దీన్ని బట్టి కరోనా మనుషుల మధ్య దూరాన్ని పెంచడమే కాదు.. కొందరిని దగ్గర కూడా చేస్తుంది.

మరో ప్రేమ కథ..

మరో ప్రేమ కథ..

మరో ప్రేమ కథలోని ఈ జంట పెళ్లికి ముందు నుండే ప్రేమించుకునేవారు. అయితే తెలుగు సినిమాల్లో మాదిరిగా వీరి ప్రేమకు, పెళ్లిని పెద్దలు నో చెప్పడంతో వీరు గుజరాత్ నుండి ఒడిశా రాష్ట్రానికి పారిపోయే వచ్చేశారు.

సహజీవనం చేస్తూ..

సహజీవనం చేస్తూ..

వీరిద్దరూ అక్కడే ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో పని చేస్తూ సహజీవనం చేస్తూ ఉండేవారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వీరికి పని లేకుండా పోయింది. అంతే వీరిద్దరూ మళ్లీ సొంతూళ్లకు బయలుదేరారు. అయితే అప్పటికే ఆమె ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.

టెస్టులు చేస్తే..

టెస్టులు చేస్తే..

కరోనా టెస్టుల్లో భాగంగా వీరిద్దరికీ టెస్టులు చేయగా.. వీరిద్దరికీ నెగిటివ్ వచ్చింది. అయితే వీరిని ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైనులో ఉంచారు. అతి తక్కువ రోజుల్లోనే వీరి క్వారంటైన్ సమయం ముగిసింది. దీంతో అక్కడున్న అధికారులే వీరిద్దరికీ తల్లిదండ్రులుగా మారి పెళ్లి చేశారు. ఆ తర్వాత కొత్త జంట వారి ఇంటికి వెళ్లిపోయింది.

కరోనా ప్రేమ..

కరోనా ప్రేమ..

చూశారా... కరోనా మహమ్మారి మనుషుల్లో భయాన్నే కాదు.. ప్రేమను కూడా చిగురింపజేస్తోంది. అంతేకాదు వారి ప్రేమ కథను నిజం చేస్తూ పెళ్లిపీటల దాకా తీసుకెళ్తోంది. అందుకు నిదర్శనమే ఈ రెండు సంఘటనలు.

English summary

A Interesting Corona love story in telugu

Here we talking about the interesting corona love story in telugu. Read on
Story first published:Friday, November 13, 2020, 15:57 [IST]
Desktop Bottom Promotion