For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గడ్డం పెంచితే ఆ కార్యంలో రెచ్చిపోతారా? అందుకే గర్స్ ఇలాంటి వారిని ఇష్టపడతారా?

|

ప్రస్తుత కరోనా కాలంలో ప్రతి ఒక్కరికీ గడ్డం బాగా పెరిగిపోయింది. కొందరు బార్బర్ షాపులో షేవింగ్ చేయిస్తే ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడుతుంటే.. మరికొందరు మాత్రం కరోనా కాలంలోనైనా గడ్డం పెంచితే క్రేజీగా ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఒకప్పుడు గడ్డం పెంచితే ప్రేమలో ఫెయిల్ అయ్యావా అని అడిగేవారు. కానీ ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్ గా మారింది.

అమ్మాయిలు కూడా ఎక్కువగా గడ్డం ఉండేవారినే ఇష్టపడుతున్నారు. అయితే గడ్డం పెంచడం వల్ల చాలా లాభాలున్నాయని అతి కొద్దిమందికి తెలుసు.

అయితే హిందూ సంప్రదాయంలో గడ్డం పెంచడం వెనుక కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. భార్య గర్భంతో ఉన్న సమయంలో భర్తలు గడ్డం పెంచుతారు. అలాంటి సమయాల్లో షేవింగ్ అనేదే చేసుకోరు.

అయితే మగవారి గడ్డం పెంచడం వల్ల సూర్య కిరణాల నుండి రక్షణతో పాటు ఇంకా అనేక లాభాలున్నాయని ఇటీవలే ఒక అధ్యయనంలో తేలిందట.

ఆ అధ్యయనంలో గడ్డం గురించి కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు కూడా బయటపడ్డాయి. అవేంటో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సర్వే! మగవారికి అంగం చిన్నగా ఉంటే కలయికలో కష్టమేనా? ఏది నిజమో తెలుసుకోండి...

చర్మ సమస్యను ఎదుర్కోవచ్చు..

చర్మ సమస్యను ఎదుర్కోవచ్చు..

మగవారి చర్మం చాలా మందిలో రఫ్ గా ఉంటుంది. డ్రై స్కిన్, బ్లాక్ హెడ్స్, ముడతలు, చారల వంటి సమస్యలను పురుషులు ఎక్కువగా ఎదుర్కొంటారని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అయితే గడ్డం ఎక్కువగా పెంచడం వల్ల సూర్య కిరణాల నుండి రక్షణగా ఉంటుందని అంటున్నారు.

గడ్డం పెంచితే..

గడ్డం పెంచితే..

జోన్హా రెవెన్సెనియా తన హఫ్పోస్ట్ బ్లాగులో చెప్పినట్టు.. ‘గడ్డం హాట్ గా ఎలా కనిపిస్తుంది? అనడానికి సైన్స్ లో ఒక థియరీ కూడా ఉంది' అని నిరూపితమైంది. దీని ప్రకారం సూర్యుడి నుండి హానికరమైన అతినీల లోహిత కిరణాలను 95 శాతం వరకు నిరోధించగలదని పేర్కొంది. దీంతో గడ్డం సూర్యరశ్మి ప్రభావం తగ్గిస్తుందని, చర్మ క్యాన్సర్ బారినపడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని దక్షిణ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులను టాగ్ చేస్తూ రెవెన్సెన్సియా చెబుతున్నారు.

రతి క్రీడలోనూ..

రతి క్రీడలోనూ..

అంతే కాదండోయ్.. గడ్డం పెంచడం వల్ల రతి క్రీడలోనూ రెచ్చిపోవచ్చని ఓ అధ్యయనం చెబుతోంది. ఇది రతి క్రీడలను పునఃప్రారంభానికి బాగా ఉపయోగపడుతుంది' అని పరిశోధకులు కనుగొన్నారు. రెగ్యులర్ రతి క్రీడలో పాల్గొనేవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇది గడ్డం పెరుగుదలకు ప్రభావితం చేస్తుందని తేలింది.

ఫస్ట్ నైట్ తర్వాత కొత్త పెళ్లికూతురు మదిలో మెదిలే ప్రశ్నలేంటో తెలుసా?

కొన్ని రోగాలు మాయం..

కొన్ని రోగాలు మాయం..

గడ్డం పెంచడం వల్ల గొంతు వ్యాధి నుండి తప్పించుకోవడమే కాదు, మీ శరీరానికి విషపూరిత ఎక్స్ పోజపర్స్ నుండి ఉపశమనం పొందొచ్చు. అలాగే ఆస్తమా సమస్య కూడా మాయమయ్యే అవకాశం ఉంది.

మొటిమలకు చెక్..

మొటిమలకు చెక్..

గడ్డం పెంచడం వల్ల మొటిమలకు కూడా చెక్ పెట్టొచ్చు. అంతేకాదు ఇది అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. బ్యాక్టీరియా సహజంగా చర్మంపై ఉన్నా.. షేవింగ్ చేయడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి. అయితే షేవింగ్ చేయకపోవడం ద్వారా, మొటిమల మంటను కూడా తగ్గిస్తుంది. షేవింగ్ అనేది మొటిమల బ్రేక్ అవుట్ కు దారి తీస్తుంది. ఇప్పటికే ఉన్న మొటిమల సమస్యను పెంచుతుంది. అయితే గడ్డం పెరుగుదల మొటిమలకు సంబంధించిన చర్మ వ్యాధులను దూరం చేస్తుంది.

షేవింగ్ కోసం అదనపు సమయం..

షేవింగ్ కోసం అదనపు సమయం..

బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ & డెర్మటాలజీ డిపార్ట్ మెంట్ చైర్మన్ డాక్టర్ హెచ్.మెస్కాన్ ‘ది స్పార్టన్బర్గ్'తో మాట్లాడుతూ మగవారిలో చాలా మంది సగటున తమ జీవిత కాలంలో షేవింగ్ కోసం అత్యధికంగా 3,350 గంటల సమయం గడుపతారని చెప్పారు. అంటే దాదాపు 139 రోజులు. సుమారు ఐదు నెలలన్నమాట. అయితే గడ్డం పెంచడం వల్ల ఈ సమయం మీకు సేవ్ అవుతుంది.

మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

క్రేజీగా కనిపిస్తారు...

క్రేజీగా కనిపిస్తారు...

ప్రస్తుతం గడ్డం పెంచడంపై చాలా మంది పురుషులు ఆసక్తి పెంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు గడ్డం పెంచుకుని కనబడుతుండటంతో చాలా మంది వారినే ఫాలో అవుతున్నారు. అయితే దీని గురించి కరోనాకు ముందు ఓ సంస్థ న్యూయార్క్ లోని 1000 మంది పురుషులను సర్వే చేయగా, 67 శాతం గడ్డం, మీసాలుంటేనే తాము ఆకర్షణగా ఉంటామని, మిగిలిన వారు గడ్డం, మీసం కారణంగానే తమకు ఫుల్ కాంప్లీమెంట్స్ లభిస్తున్నాయని చెప్పారు. అంతేకాదు గడ్డం వల్ల తమకు మరింత కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పారు.

శీతాకాలంలో..

శీతాకాలంలో..

‘గడ్డం పెంచడం వల్ల శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖం మీద జుట్టు ఉండటం వల్ల ఆయా ప్రాంతాలలో చర్మ రక్షణకు అనుకూలంగా ఉంటుంది' అని నిపుణులు చెబుతున్నారు. ‘చర్మం మీద గాలి, శీతల వాతావరణం ప్రభావితం అయ్యేటప్పుడు, గడ్డం శరీర రక్షణగా పని చేస్తుంది'.

దాన్ని కాపాడటంలో..

దాన్ని కాపాడటంలో..

అంతేకాదు ఇది మీ నోటిని గాలిలో ఉండే బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. తరచుగా ఇది మీ గొంతును కాపాడటంలో సహాయపడుతుంది.

రిలాక్స్ గా..

రిలాక్స్ గా..

గడ్డం, ముక్కు రంధ్రాలలో పెరిగే వెంట్రుకలు, సహజంగా హానికర కణాల దాడి నుండి ఊపిరితిత్తులను కాపాడతాయి. ఉద్యోగం చేసేవారు, ఎక్కువగా పనులలో నిమగ్నమై ఉండేవారు నిరంతరం గాలి, ధూళి కణాలకు బహిర్గతం అవుతుంటారు. గడ్డం కారణంగా, వీటి నుండి కొంత రిలాక్స్ గా ఉంటుంది.

చూశారా అబ్బాయిలు.. గడ్డం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి గడ్డం పెంచేందుకు ప్రయత్నించండి. మీకు ఎలాంటి లుక్ సూట్ అవుతుందో చెక్ చేసుకోండి...

English summary

Benefits Of Having A Bearded Boyfriend

Here are the benefits of having a bearded boyfriend. Take a look.
Story first published: Thursday, July 9, 2020, 18:48 [IST]