For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా కాలంలోనూ కెనడియన్లు ఆ కార్యాన్ని అద్భుతంగా ఆస్వాదించారట...! కానీ పార్ట్నర్ తో కాదంట...!

కోవిద్-19 వంటి భయంకరమైన పరిస్థితిలో కెనడియన్లు రతి క్రీడలో రెచ్చిపోయారట.. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 సంవత్సరంలో మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కరోనా కారణంగా కపుల్స్ కు కావాల్సినంత ఏకాంతం దొరికింది.

Canadians are having more sex during the covid-19 pandemic

దీంతో చాలా మంది జంటలు రతి క్రీడలో రెచ్చిపోయారని పలు సర్వేలలో తేలింది. దీని వల్ల జనాభా విపరీతంగా పెరుగుతుందని, జనాభా లెక్కల్లో మార్పులొస్తాయని అంచనాలు వేశారు నిపుణులు.

Canadians are having more sex during the covid-19 pandemic

అయితే ఇలాంటి కథనాలన్నీ కెనడా దేశంలో నిజం కాలేదు. మరింత వివరంగా చెప్పాలంటే.. మహమ్మారి కారణంగా కెనడా వాసుల రతి క్రీడలో బాగా నష్టం వాటిల్లిందని.. దీని వల్ల అమ్మాయిల లైంగిక ఆరోగ్యం విషయంలో చాలా మార్పులొచ్చాయని రీసెర్చ్ చైర్, బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రొఫెసర్ వివరించారు. మరోవైపు సింగిల్ గా ఉండే వారు ఈ సమయంలో విరహ వేదనతో రగిపోయారట. కానీ కెనడాలో మాత్రం కొందరు తమ భాగస్వాములతో కాకుండా ఇతరులతో లైంగిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేశారట. ఈ సందర్బంగా ఆ కార్యం గురించి ఇంకా ఎలాంటి అధ్యయనాలు చేశారు? ఎవరెవరిని ప్రశ్నించారు? వారు ఎలాంటి సమాధానాలిచ్చారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లైంగిక కోరికలపై..

లైంగిక కోరికలపై..

ఆమె గత రెండు దశాబ్దాలుగా లైంగిక కోరికలు అనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా యుబిసి లైంగిక ఆరోగ్య పరిశోధనలో తమ టీమ్ కరోనా ప్రారంభంలో లైంగిక కోరికలు, సంబంధం, ఆచరణల మీద మహమ్మారి ఏ విధంగా ఒత్తిడి చూపిస్తుంది.. లైఫ్ స్టైల్ ను ఎలా మారుస్తుంది? ఎలా మార్చింది అనే ప్రశ్నలడిగారు.

ఎంతమందంటే..

ఎంతమందంటే..

ఇందుకోసం కెనడాలోని అన్ని ప్రావిన్సులు, ప్రాంతాల నుండి సుమారు వెయ్యి మందిని ఎంపిక చేసుకున్నారు. అందులో 19-81 వయసు ఉన్న వారికి ఈ అధ్యయనంలో చేర్చారు. వీరిలో సగటు వయసు 30 ఏళ్లు. వీరిలో 70 శాతం మంది తెల్లవారు కాగా.. 30 శాతం మంది మిగిలిన వారు ఉన్నారు. వీరిలో సగానికి పైగా హెటిరో సెక్సువల్స్ కాగా.. ఏడు శాతం మంది బైనరీ జెండర్ గా గుర్తించారు. మొత్తానికి 37 శాతం మంది తమ భాగస్వామితో ఆ కార్యంలో పాల్గొన్నారు.

లాక్ డౌన్ ప్రారంభంలో

లాక్ డౌన్ ప్రారంభంలో

లాక్ డౌన్ ప్రారంభంలో కరోనా వైరస్ ఒత్తిడి వల్ల ఇంట్లో ఉండే భాగస్వామి మీద లైంగిక ఒత్తిడి అధికంగా పడింది. అయితే ఇది సింగిల్ గా ఉంటున్న వ్యక్తుల్లో ఎలాంటి ప్రభావం చూపలేదట. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఇదే వాస్తవమట. దీనికి కారణం ఏంటంటే.. కొన్ని మహమ్మారుల సమయంలోనూ భాగస్వాముల మధ్య ఇలాంటి లైంగిక హింస రేటు పెరగడం కనిపించింది.

భాగస్వామితో కాకుండా..

భాగస్వామితో కాకుండా..

దీంతో మహిళా భాగస్వామి దీర్ఘకాల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు మహిళల భద్రత కోసం షెల్టర్లు అందుబాటులో లేకపోవడం.. తప్పనిసరిగా భాగస్వామితో ఉండాల్సి రావడందో ఈ హింస ప్రభావం మహిళల మీద మరింత ఎక్కువైంది. దీంతో చాలా మంది తమ భాగస్వాములతో కలిసి ఉంటున్న వారితో కాకుండా.. ఇతరులతో రతి క్రీడలో పాల్గొనాలన్న కోరికలు పెరిగాయట.

హస్తప్రయోగం..

హస్తప్రయోగం..

ఇతరులతో ఆ కార్యంలో పాల్గొనడానికి అవకాశం లేని వారు హస్త ప్రయోగం చేసుకోవడం ప్రారంభించారట. మరోవైపు లాక్ డౌన్ తర్వాత 2020 వేసవి సెలవుల్లో లైంగిక ఆసక్తి ఉందన్న దాని మీద కూడా అధ్యయనాలు జరిగాయి. ఆ సమయానికి లాక్ డౌన్ సడలింపులు వచ్చాయి. అప్పటి నుండి సాధారణ జీవనశైలికి అలవాటు పడ్డారు. అయితే అప్పటికే లైంగిక కార్యంలో పాల్గొనకుండా దాదాపు నెలల వ్యవధి గడుస్తోంది. దీంతో వీరిలో భాగస్వామితో లైంగిక పరమైన కోరికలు తగ్గాయి కానీ పెరగలేదు.

ఇతరులపై ఆసక్తి..

ఇతరులపై ఆసక్తి..

అయితే ఆశ్చర్యకరంగా భాగస్వామితో లేని వారి లైంగిక కార్యకలాపాలు పెరిగాయట. దీనంతటికి కారణం భాగస్వామితో ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోవడమే. మరోవైపు సహజీవనం చేస్తున్న జంటలు ఎక్కువ సమయం కలిసి గడపడం వల్ల అది వారి లైంగికతను ఒత్తిడికి గురి చేసింది. వర్క్ ఫ్రం హోమ్, సోషల్ గాదరింగ్స్ తగ్గిపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ట్రావెలింగ్ నిషేధం ఇవన్నీ కెనడా వాసుల లైంగిక జీవితాల మీద ఈ స్థాయిలో ప్రభావం చూపించడంలో ఆశ్చర్యం లేదంటున్నారు అధ్యయనకారులు.

మరికొందరు..

మరికొందరు..

యూరప్, అమెరికాలో జరిపిన అధ్యయనాల్లో మరో వెలుగు చూసిన మరో అంశం.. లైంగిక విద్య పెరగడం. కిన్సే ఇన్ స్టిట్యూట్ పరిశోధనకుల టీమ్ జరిపిన అధ్యయనంలో మరొకొందరు ప్రయోగాత్మకమైన లైంగిక కార్యకలాపాల్లో మునిగిపోయారు. అంతేకాదు హస్త ప్రయోగాలూ ఎక్కువగానే ఉన్నాయి. కరోనా పరిస్థితులు, ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఇదొక మార్గంగా మారింది.

English summary

Canadians are having more sex during the covid-19 pandemic

Here we are talking about the Canadians are having more sex during the covid-19 pandemic. Read on
Desktop Bottom Promotion