For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral : కరోనాపై పోరులో కలిశారు... ఆసుప్రతిలోనే కళ్యాణం చేసుకుని ఒక్కటయ్యారు...

కోవిద్ -19కు వ్యతిరేకంగా పోరాడేందుకు డాక్టర్, నర్సు హాస్పిటల్ లో డ్యూటీ చేసే సమయంలో ప్రేమలో పడ్డారు.

|

ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి. అది ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా పుడుతుందో.. ఏ వయసులో పుడుతుందో ఎవ్వరికీ తెలియదు.
మీరు ఇది వరకే ఎన్నో ప్రేమ కథలను విని ఉంటారు. చూసి ఉంటారు.

Doctor & Nurse Get Married At Hospital Where They Worked To Fight COVID-19

కానీ ఇప్పుడు చెప్పబోయే ప్రేమ కథ గురించి మీరు ఇంతకుముందు ఎప్పుడూ విని ఉండరు. కనీసం దాని గురించి ఆలోచన కూడా చేసి ఉండరు. ఎందుకంటే ఇది కరోనా ప్రేమ కథ.

మరి ఈ ప్రేమ కథ వారిని పెళ్లి వరకు తీసుకెళ్లిందా? ఒకవేళ పెళ్లి వరకు వెళ్లినా ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో అది సాధ్యమయ్యిందా? లేదా అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?

కఠినమైన లాక్ డౌన్ లో..

కఠినమైన లాక్ డౌన్ లో..

అది కరోనా వైరస్ మహమ్మారి విపరీతంగా మొదలైన సమయం. యునైటెడ్ కింగ్ డమ్(యుకె)లో కఠినమైన లాక్ డౌన్ ప్రారంభమైంది. దేశంలో 2.6 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య కూడా 5.6 మిలియన్లు దాటింది.

అలా ఒక్కటయ్యారు..

అలా ఒక్కటయ్యారు..

ఈ సమయంలో లండన్ లోని కోవిద్-19 ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్, నర్సు జాన్ టిప్పింగ్(34), అన్నలన్ నవరత్నం(30)ల మధ్య పరిచయం ఏర్పడింది. అలా ప్రేమించుకున్న కొద్దిరోజులకే వారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే వారి పెద్దలు ప్రస్తుత పరిస్థితిలో ఇది కష్టమని భావించారు.

వివాహ వేడుక..

వివాహ వేడుక..

అయితే కరోనా తగ్గిపోయాక ఆగస్టులో వివాహం చేసుకుందామని ప్రణాళిక రూపొందించుకున్నారు. తమ కుటుంబాలు ఉత్తర ఐర్లాండ్ మరియు శ్రీలంక నుండి యుకెకు రాలేరని ఈ జంట భయపడింది. దీంతో వారు లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్ లోని గ్రేడ్-2 లిస్టెడ్ చాపెల్ లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు వారి కుటుంబాలు మరియు స్నేహితులు వర్చువల్ గా హాజరయ్యారు.

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

వర్చువల్ రిసెప్షన్

వర్చువల్ రిసెప్షన్

‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మేము ఈ వేడుకను నిర్వహించాలనుకున్నాం. అయితే పరిస్థితి మా చేతిలో లేదని, మేం ఇంకా చేసేదేమీ లేదని నిర్ధారించుకున్నాం. అందుకే మేము వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ప్రియమైన వారికి వీడియోలో చూసేందుకు ఏర్పాట్లు చేశాం. ఇలా జరిగినందుకు నేను ఎంతగానో ఆనందించాను'అని టిప్పింగ్ చెప్పారు.

మనోహరమైన వివాహం..

మనోహరమైన వివాహం..

ఈ వివాహాన్ని టిప్పింగ్ ఇలా వర్ణించారు. ‘ఇది ఒక మనోహరమైన వివాహం. ప్రార్థనా మందిరం కూడా అందంగా ఉంది. అయినప్పటికీ మేము పని చేసే చోటనే ఆసుప్రతిలో వివాహం చేసుకోవడం కొంత అవాస్తవంగా అనిపించింది'అన్నారు.

అందరి సహకారం..

అందరి సహకారం..

‘నేను వివాహం గురించి ప్రతిపాదించిన క్షణం నుంచీ జాన్ మరియు నేను వివాహం చేసుకోవాలనుకున్నాం. మేము ఒకరికొకరు కట్టుబడి ఉండినందుకు, ఆసుపత్రి సిబ్బంది మాకు బాగా సహకరించారు. అలా అందరి సహకరంతో మేము సంతోషంగా వివాహం చేసుకున్నామని' నవరత్నం చెప్పారు.

ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

ఇలా పెళ్లి చేసుకున్న వీరు వారి వివాహ వేడుకల ఫోటోలను ఆస్పత్రి ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కొద్దిగంటల్లోనే వీరి ఫొటోలు వైరల్ అయిపోయాయి. కొన్ని లక్షల మంది లైకులు, వేలాది మంది నూతన వధూవరులను అభినందిస్తూ కామెంట్లు చేశారు.

అందరి ఆశీస్సులు..

అందరి ఆశీస్సులు..

ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. మీరు ఇష్టపడే వారితో సమయం గడపడం, అది కూడా అనిశ్చిత సయంలో నిజంగా ఒక అద్భుతం. వధూవరులు తమ కుటుంబాలను దగ్గరగా లేనప్పటికీ, వారు కనీసం ఒకరినొకరు చూసుకున్నందుకు, పలకరించుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం. అన్నాలన్ మరియు జాన్ సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలని కోరుకున్నారు.

All Images credited to : Twitter

English summary

Doctor & Nurse Get Married At Hospital Where They Worked To Fight COVID-19

Here we talking about doctor & nurse get married at hospital where they worked to fight covid-19. Read on.
Story first published:Saturday, June 27, 2020, 12:48 [IST]
Desktop Bottom Promotion