For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీ, పురుషులిద్దరూ పెళ్లికి ముందే ఈ విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతురాట...!

|

మనలో అబ్బాయికి పాతికేళ్లు దాటాయంటే చాలు.. ఇంట్లో పెద్దలు, బంధువులు పెళ్లి గురించి ఎక్కడ పడితే అక్కడ ఊరికే అడుగుతూ ఉంటారు. ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు.. నా కోడలిని ఎప్పుడు పరిచయం చేస్తున్నావ్..

వంటి ప్రశ్నలతో తెగ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదేవిధంగా అబ్బాయిలకు 20 సంవత్సరాలు దాటితే చాలు తనకు ఓ మంచి భాగస్వామిని తీసుకురావాలని తల్లిదండ్రులు తెగ కంగారు పడుతూ ఉంటారు. తమకు తెలిసిన బంధువులను, మ్యారేజ్ బ్రోకర్లను, మ్యాట్రిమోనియల్ సైట్లతో పాటు ఇతర చోట్ల మంచి సంబంధం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు.

ఇదిలా ఉండగా.. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి జీవించేందుకు.. వారితో బంధం కలకాలం బలంగా ఉండేందుకు నమ్మకం అనే గట్టి పునాది అవసరం. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలన్నా నమ్మకమే ఓ ఇంధనంలా మారుతుంది. ఇది లేకపోతే ఎవరి జీవితాలైనా తలకిందులైపోతాయి. ఈ సందర్భంగా ఒక అమ్మాయి లేదా అబ్బాయి తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటారు.. వారిలో ఎలాంటి లక్షణాలుంటే ఇష్టపడతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

భాగస్వామిని అలా చూసినప్పుడు.. ప్రతి మగాడిలో కలిగే ఫీలింగ్స్ ఏంటో తెలుసా..

కొత్తలో కొంచెం ఇబ్బంది..

కొత్తలో కొంచెం ఇబ్బంది..

సాధారణంగా మనలో పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో జీవితాంతం ఆనందంగా గడపాలనుకునే వారు తమకు కాబోయే వారితో పెళ్లికి ముందు మాట్లాడేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బంది పడతారు. ముందుగా వారితో మాట్లాడేందుకు కాస్త టెన్షన్ కు గురవుతూ ఉంటారు. అయితే అందరూ అలానే ఉండరు. కొందరు మొదట్లో మాటల ప్రవాహాన్ని ప్రారంభిస్తారు. ఇలాంటి కారణాల వల్ల వారిపై ఇష్టం మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే వారి ఇష్టయిష్టాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

ఎన్నో విషయాలను..

ఎన్నో విషయాలను..

ఇలాంటి సమయంలో స్త్రీ, పురుషులిద్దరూ ఒకరి గురించి మరొకరు చాలా విషయాలను షేర్ చేసుకుంటారు. నిజంగా నేనంటే ఇష్టమేనా? లేదా మీ ఇంట్లో ఏమైనా బలవంతం చేస్తున్నారా? నేను నీకు నచ్చడానికి గల కారణమేంటి? మందు, సిగరెట్ వంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏం చూసి నాకు ఓకే చెప్పావు వంటి ప్రశ్నలడగుతారు. దీనికి భాగస్వామి చెప్పే సమాధానాల్ని బట్టి వారితో కలిసి ముందడుగు వేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు.

వంటలొచ్చా..

వంటలొచ్చా..

ఒకప్పుడు వంటల విషయానికొస్తే.. కేవలం అమ్మాయిలు చేస్తారనే భావన ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో అబ్బాయిలు కూడా వంటలు బాగానే చేస్తున్నారు. యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా సైట్ల పుణ్యమా అని ఎలాంటి వంటకాలనైనా ఇట్టే చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంటల గురించి తమకు కాబోయే భాగస్వామికి ప్రశ్నలు వేస్తున్నారట. మీకు వంటలొచ్చా? రాకపోతే యూట్యూబ్ చూసి నేర్చుకుంటారు కదా.. అలాగే మీరు భోజన ప్రియులా? మీరు శాకహారినా లేదా మాంసాహారినా అనే ప్రశ్నలడుగుతారట.

లాంగ్ రిలేషన్ షిప్..

లాంగ్ రిలేషన్ షిప్..

పెళ్లి చేసుకుని లాంగ్ రిలేషన్ షిప్ కొనసాగించడం వంటి సంప్రదాయపై ఇప్పటికీ మీకు నమ్మకం ఉందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నలు సైతం అడుగుతారట. మన రిలేషన్ షిప్ మీకు ఎంత ముఖ్యం? మన రిలేషన్ షిప్ స్టార్ట్ అయితే వెంటనే మార్చుకోవాల్సిన విషయాలేమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు అడుగుతారట.

దూరంగా ఉండాల్సి వస్తే..

దూరంగా ఉండాల్సి వస్తే..

పెళ్లి చేసుకున్న అనంతరం జాబ్ ట్రాన్స్ ఫర్ ఇతర కారణాల వల్ల ఇద్దరం కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తే ఏం చేద్దాం? అలాంటి పరిస్థితుల్లో నీకు ఓకేనా? వంటి ప్రశ్నలను కూడా అడుగుతారట. వీటితో పాటు ఇంతకుముందు ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? బ్రేకప్ ఎందుకు అయ్యింది అనే విషయాలను చాలా మంది అడుగుతారట.

ఎలా ఉండాలనుకుంటున్నారు?

ఎలా ఉండాలనుకుంటున్నారు?

మనమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత ఉమ్మడి కుటుంబంలో ఉంటే మంచిదా? లేదా వేరు కాపురం పెడదామా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నలడుగుతారట? ఇలాంటి ప్రశ్నలకు ఎదుటి వ్యక్తి నుండి తాము ఆశించిన సమాధానాలు వస్తే వారితో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతారట. లేదంటే అక్కడే వారిని రిజెక్ట్ చేసి మరో మ్యాచ్ కోసం వెతుక్కునే పనిలో ఉంటారట.

తెలివితేటలను గమనిస్తారు..

తెలివితేటలను గమనిస్తారు..

ఒక అమ్మాయి లేదా అబ్బాయి తమకు కాబోయే జీవిత భాగస్వామితో తొలిసారిగా మాట్లాడేటప్పుడు వారి హావభావాలను, వారు ప్రవర్తించే తీరును, అన్నింటి కంటే ముఖ్యంగా వారి తెలివితేటలను గమనిస్తారట. ఆ తర్వాతే ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, జాబ్ ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారట.

కెరీర్ పరంగా..

కెరీర్ పరంగా..

పెళ్లి తర్వాత ఖాళీ సమయంలో ఏమి చేస్తావు? ఎంత మంది పిల్లలైతే బెటర్? ఆర్థిక పరమైన అంశాల్లో బ్యాలెన్స్ గా ఉంటావా? మన రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా గొడవలు జరిగితే లేదా అభిప్రాయ భేదాలు వస్తే మీరేం చేస్తారు? మనీ సేవ్ చేసేందుకు నీవు ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవుతావు? పెళ్లి విషయంలో నీకు భయం కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా? పెళ్లి గురించి నువ్వు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు రోటీన్ గా అడుగుతారట.

అయితే పెళ్లిచూపుల సమయంలోనే ఈ ప్రశ్నలన్నీ అడగరట. ప్రతి ఒక్కరూ సందర్భానుసారంగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారట. కాబట్టి మీరు కూడా పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటే.. వీలైనంత త్వరగా ఇలాంటి ప్రశ్నలు అడగండి.. మీకు కావాల్సిన సమాధానాలను రాబట్టండి. ఆ తర్వాతే ఏడడుగులు వేసేందుకు సిద్ధం కండి.

English summary

How men and women choose their partners in Telugu

Here we are talking about the how men and women choose their partners in Telugu. Have a look
Story first published: Friday, December 3, 2021, 20:00 [IST]