For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...

|

కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూతో పెళ్లి తర్వాత కలిసి హనీమూన్ ఎంతలా ఎంజాయ్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అయితే ఇటీవల తన అభిమానులతో లైవ్ ఛాట్ చేసిన కాజల్ తన డైలీ లైఫ్, గౌతమ్ తాను ఎలా గడుపుతున్నానే విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానమిచ్చిన కాజల్ ఓ ప్రశ్నకు మాత్రం చాలా క్రేజీగా సమాధానమిచ్చింది.

ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీరు ఏమి చేస్తారని, ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కాజల్ ఇలా బదులిచ్చింది. 'ప్రతిరోజూ అరగంట పాటు వర్కవుట్ చేస్తానని, అలాగే నా భర్తను కౌగిలించుకోవడం(Hug)మాత్రం కంపల్సరీ' అని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా కౌగిలింతల్లోని రకాలు.. ప్రేమగా కౌగిలించుకోవడం వల్ల కలిగి ప్రయోజనాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కౌగిలింతల్లో ఏదో తెలియని పులకింత... మనసులోనూ ఏదో గిలిగింత...

భిన్నమైన భావోద్వేగాలకు..

భిన్నమైన భావోద్వేగాలకు..

ఒక కౌగిలింత అనేది మనిషిలో భిన్నమైన భావోద్వేగాలకు ప్రేమకు చక్కటి చిహ్నం. ఆలింగనం అనేది మరింత ఎక్కువగా ప్రేమను పంచుతుంది. మీరు ఎవరినైనా ప్రేమతో ఆలింగనం చేసుకుంటే అది ప్రత్యేకమైన అనుభూతికి సహాయపడుతుంది.

నిరాశగా ఉన్నప్పుడు..

నిరాశగా ఉన్నప్పుడు..

కౌగిలింత(Hug) అనేది విరిగిన హృదయాలను కూడా అతికించే ప్రయత్నం చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే కౌగిలింతలలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి సందర్భానికి తగ్గట్టు ప్రత్యేకమైన కౌగిలింతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీరు మీ భాగస్వామిని కౌగిలించుకుంటే అది వారికి సురక్షితమైన కౌగిలింతగా భావన కలుగుతుంది.

మాటల్లో చెప్పలేనంత..

మాటల్లో చెప్పలేనంత..

మీ భాగస్వామిని ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు ఆ ఫీలింగ్ పదాలతో వర్ణించలేని విధంగా ఉంటుంది. మీ నిజ జీవితంలో మీరు కూడా అలాంటి హగ్ కోసం ప్రయత్నించండి. ఎనలేని మధురమైన అనుభూతిని పొందండి...

శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...

ఫ్రెండ్స్ హగ్..

ఫ్రెండ్స్ హగ్..

మనలో చాలా మంది స్నేహితులు సాధారణంగా హగ్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. దీన్ని బియర్ హగ్ అంటారు. స్నేహితులకు ఈ విధంగా కౌగిలితో పలకరించేవారు మంచి స్నేహితులుగా గుర్తింపు పొందుతారు.

ప్రేమతో కౌగిలి..

ప్రేమతో కౌగిలి..

ఇలాంటి కౌగిలింతలు మనకు ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే నిజ జీవితంలో మీరు ఎవరినైనా ప్రేమగా కౌగిలించుకుంటే వారితో మీ బంధం మరింత బలపడుతుంది. మీ ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

నమ్మకం పెరుగుతుంది..

నమ్మకం పెరుగుతుంది..

ప్రేమగా కౌగిలించుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందని కచ్చితంగా తెలుపుతుంది. ఈ కౌగిలిలో ఎదుటి వ్యక్తిని ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకుని వారి భుజంపై తలవాలుస్తారు. అదే సమయంలో చెవిలో ఏవేవో గుసగుసలు వినిపిస్తుంటారు.

పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ గురించి ఎక్కువమంది అబద్ధాలే చెబుతారని మీకు తెలుసా...!

ఎక్కువసేపు కౌగిలించుకుంటే..

ఎక్కువసేపు కౌగిలించుకుంటే..

మీ మనసుకు నచ్చిన వారిని వదిలి వెళ్తున్నప్పుడు.. వారిని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్తున్నప్పుడు మీరు ఎక్కువ సేపు కౌగిలించుకుంటారు. ఈ కౌగిలింతలో ఎక్కువగా ఆనందభాష్పాలు నిండి ఉంటాయి.

రొమాంటిక్ హగ్..

రొమాంటిక్ హగ్..

ఈ రకమైన హగ్ అనేది మీ లైఫ్ లో ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. ఇది చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఇలాంటి కౌగిలిలో ఇద్దరు ప్రేమికులు వారి మనసులోని స్పందనలను మరియు శ్వాసను వింటారు.

కిస్ హగ్..

కిస్ హగ్..

కౌగిలింత అనేది కిస్ కు వెల్ కమ్ చెప్పే ఒక వేదిక అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి హగ్ ప్రారంభమై అవి మంచి ఫాంటసీలకు దారి తీస్తాయి.

అవధుల్లేని ఆనందంతో హగ్..

అవధుల్లేని ఆనందంతో హగ్..

ఇలాంటి కౌగిలింత అవధుల్లేని ఆనందంతో నిండి ఉంటుంది. మనకు నచ్చిన వారు ఎన్నో రోజుల నుండి కనబడకుండా.. అకస్మాత్తు మన కళ్లెదుట ప్రత్యక్షమైతే.. అప్పుడు అవధుల్లేని ఆనందంతో అమాంతం వారిని కౌగిలించుకుని వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు. ఈ కౌగిలిలో ఎంతో ఆత్మీయత ఉంటుంది. ప్రేమికులు ఇలాంటి కౌగిలిని బాగా ఎంజాయ్ చేస్తారు.

Photos Credited to Insta

English summary

Kajal Gives a Hug to Her Husband Everyday, Benefits of Hugging

Here we talking about the kajal gives a hug to her husband everyday, benefits of hugging. Read on