For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీరి ప్రేమకు సమాధులే సాక్ష్యమట.... వారిద్దరినీ కలిపింది కూడా అవేనట...!

కనీసం చూసైనా ఉంటాం. ఈ మధ్యన పాఠశాల ప్రేమ కథలను కూడా చూస్తున్నాం. అయితే స్మశానంలో సమాధుల మధ్య కూడా ప్రేమ పుడుతుందని ఎవ్వరైనా ఊహిస్తారా?

|

ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే ప్రేమ కథలు చాలా పాపులర్ అవుతున్నాయి. అంతేకాదు కొన్ని ప్రేమ కథలు ఖండతరాలు దాటిపోతున్నాయి. అంతేకాదు ఆ ప్రేమ కాస్త పెళ్లిళ్ల వరకు వెళ్తూ తమ బంధాలను మరింత బలంగా మార్చుకుంటున్నాయి.

Love Story of a couple who met in graveyard

ఇటీవల మనం ఓ తెలంగాణ అబ్బాయి.. అమెరికా అమ్మాయి ప్రేమ వివాహం కూడా చూశాం. అలానే ఇటీవల ట్విట్టర్ లో ఓ ఇంగ్లీష్ వ్యక్తి తన ప్రేమ కథ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు. తాను ప్రేమలో పడినప్పటి నుండి తాను ఎదుర్కొన్న సమస్యలతో పాటు తనకు ఎదురైన అనుభవాలన్నింటి గురించి ట్వీట్ చేస్తుండేవాడు. అలా తన ప్రేమకు సమాధులే సాక్ష్యమని ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ వివరాలేంటో తన మాటల్లోనే తెలుసుకుందాం..

నాకు 20 ఏళ్ల వయసులో..

నాకు 20 ఏళ్ల వయసులో..

‘నాకు 20 సంవత్సరాలు వయసు వచ్చిన సమయంలో మా నాన్న అకస్మాత్తుగా మరణించారు. మాది సస్సెక్స్ లోని ఓ చిన్న గ్రామం. ఆయన చనిపోయిన తర్వాత అక్కడే ఓ ప్రాంతంలో మా నాన్న సమాధిని నిర్మించాం. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం.

ఆయనకు ఇష్టమైన పూలు..

ఆయనకు ఇష్టమైన పూలు..

అందుకే ఆయన మరణించిన తర్వాత కూడా తరచుగా నేను ఆయన సమాధి దగ్గరికి వెళ్లేవాడిని. అలా వెళ్లినప్పుడల్లా ఆయనకు ఇష్టమైన పూలను తీసుకెళ్లేవాడిని. మా నాన్న సమాధిపైనే ఆ పూలు పెట్టేవాడిని.

ఫ్లవర్ షో మాదిరిగా..

ఫ్లవర్ షో మాదిరిగా..

స్మశానానికి నేను వెళ్లే సమయంలో నా వెంట మా అమ్మ, మా నానమ్మ, తాతయ్యలు కూడా వచ్చేవారు. వారు కూడా నాన్న సమాధి వద్దకు వెళ్లి పూలు ఉంచేవాళ్లు. మేమందరం తీసుకొచ్చే పూలతో ఆయన సమాధి ఓ ఫ్లవర్ షో మాదిరిగా కనిపించేది. అలా ఆ సమాధి ఎప్పుడూ తాజా పూలతో అందంగా కనిపించేది. దీన్ని చూసినప్పుడల్లా నేను చాలా సంతోషపడేవాడిని.

పక్కనున్న సమాధిని చూస్తే..

పక్కనున్న సమాధిని చూస్తే..

అయితే నాకు ఎప్పుడూ కొంత బాధగా అనిపించేది. ఎందుకంటే మా నాన్న పక్కన ఉన్న సమాధిని చూసేందుకు ఎవ్వరూ వచ్చేవారు కాదు. దీంతో మా నాన్న సమాధి పక్కన అది అందవికారంగా కనిపించేది. ఆ సమాధిపై ఎప్పుడూ పూలు ఉండటం అనేదే నేను చూడలేదు. అందుకే నేను మా నాన్న సమాధి వద్దకు వెళ్లినప్పుడల్లా.. పక్కనున్న సమాధిపై కూడా కొన్ని పూలు పెట్టేవాడిని.

ఏదో బంధం..

ఏదో బంధం..

అప్పటివరకూ నేను ఎప్పుడూ ఎవ్వరినీ కలిసేవాడిని కాదు. కనీసం ఎవ్వరిని తల ఎత్తి కూడా చూసేవాడిని కాదు. అయితే ఎవరో చనిపోయిన వ్యక్తి కోసం నేను పూలు కొని తీసుకెళ్లడం అనేది నాకే వింతగా అనిపించేది. మా వాళ్లు కూడా నన్ను వింతగా చూసేవారు. కానీ ఎందుకో తనకి నాకు ఏదో బంధం ఉందేమో అనిపించింది. ఏదో బంధం తనవైపు లాగుతున్నట్లుగా అనిపించేది. అతడు కేవలం 37 ఏళ్లకే చనిపోయాడు.

మనసులో స్నేహితుడిగా..

మనసులో స్నేహితుడిగా..

ఈ విషయాన్ని నాతో నేను చెప్పుకునే ఓ జోక్ లా మారింది. అలా వెళ్లినప్పుడల్లా ఓ బొకేతో తనతో బంధాన్ని కలుపుకున్నా. అందరికీ చెబితే విచిత్రంగా అనిపిస్తుంది. కానీ తనని నా మనసులో ఓ స్నేహితుడిలా ఊహించుకన్నా. అలా కొంతకాలం కొనసాగిన తర్వాత తన గురించి తెలుసుకోవాలనిపించింది.

గూగుల్ లో సమాచారం దొరికింది..

గూగుల్ లో సమాచారం దొరికింది..

మా ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఉందని అనిపించింది. మేమిద్దరం ఒకే స్కూల్ లో కలిసి చదివామా లేదా స్పోర్ట్స్ క్లబ్ లో కలిసి ఆడామా అనే రకరకాల అనుమానాలు నన్ను వెంటాడేవి. అందుకే తన గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో తన గురించి వెతికాను. కేవలం పది సెకన్లలో తన గురించి సమాచారం దొరికింది.

తన వివరాలు తెలుసుకున్నాక..

తన వివరాలు తెలుసుకున్నాక..

తన వివరాలు తెలుసుకున్నాక నాకు కొంత ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే తను తన భార్యను హత్యను చేశాడు. అంతేకాదు తన తల్లిదండ్రులను కూడా హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే అతని సమాధి వద్దకు ఎవరూ రావడం లేదు. నేను తప్ప.

కొందరికి వింతగా..

కొందరికి వింతగా..

తన గురించి తెలుసుకోకుండా.. తన సమాధిపై రెండున్నరేళ్లు పూలు పెట్టినందుకు వారి బంధువులకు క్షమాపణ చెప్పాలనిపించింది. ఇదంతా కొందరికి వింతగా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం నేను వారికి ద్రోహం చేసినట్లుగా అనిపించింది. అందుకే వారిని ఎక్కడ సమాధి చేశారో అక్కడికి వెళ్లాను. ఆ తర్వాత వారి సమాధులపై పూలు పెట్టి వారికి క్షమాపణలు చెబుతుండగానే అక్కడికి ఓ అమ్మాయి వచ్చింది.

తనకు అర్థం కాలేదు..

తనకు అర్థం కాలేదు..

తను వారికి బంధువట. వారి బంధువులకు ఎందుకు సారీ చెబుతున్నానో తనకు అర్థం కాలేదు. వారి కోసం నేను పూలు ఎందుకు తీసుకువచ్చానో.. అసలు నేనేవరో తనకు అర్థం కాక.. నేను ఎవరిని అని అడిగింది. నాకు కొంత ఇబ్బందిగా అనిపించింది.

నా ప్రవర్తన..

నా ప్రవర్తన..

అయినా నేను తనకు ఆ విషయం చెప్పకుండా రెండున్నరేళ్లు అలాగే నిజం దాచేశాను. అయితే ఓ రోజు ఆ వివరాలను వివరిస్తే.. అది తనకు కాస్త వింతగా అనిపించినా.. నా ప్రవర్తన తనకు చాలా బాగా నచ్చింది. అదే విషయం నాకు చెప్పింది. అలా స్మశానం నుండి మేమిద్దరం బయటకు వెళ్తున్న సమయంలో డ్రింక్ తాగడానికి రమ్మని పిలిచింది. తర్వాత నాతో డేటింగుకు కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత మా ప్రేమ రెండేళ్ల పాటు కొనసాగింది. రెండేళ్ల తర్వాత ఓసారి అకస్మాత్తుగా నన్ను పెళ్లి చేసుకుంటవా? అని నేను అడిగిన ప్రశ్నకు వెంటనే సరే అనే సమాధానం ఇచ్చింది. అలా మా ఇద్దరి పెళ్లి కూడా జరిగింది. అలా ఆ సమాధులు మా ఇదర్ని కలిపాయి. ప్రస్తుతం మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం‘ అంటూ సోషల్ మీడియా ద్వారా తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి.

English summary

Love Story of a couple who met in graveyard

Here we talking about love story of a couple who met in graveyard. Read on
Story first published:Saturday, March 28, 2020, 9:13 [IST]
Desktop Bottom Promotion