For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కార్యం కోసం బ్లాక్ మెయిల్ చేసిన బాయ్ ఫ్రెండ్ ను ఎలా భయపెట్టిందో తెలుసా...

|

ప్రేమ అనే రెండక్షరాలకే ఎంతటి శక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రేమ అంటే ఏ స్వార్థం లేనిది.. అయితే అదంతా నిజమైన ప్రేమలో మాత్రమే. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రేమ అంటే కొన్ని రోజులు కలిసి ఉండటం.. ఆ తర్వాత ఏదో ఒక కారణం చూపి బ్రేకప్ చెప్పడం సహజమైపోయింది.

కరోనా వచ్చినా.. కరోనా రాకున్నా.. లాక్ డౌన్ పెట్టినా.. అన్ లాక్ చేసినా కామంధుల చేతుల్లో మహిళలు బలి అవుతూనే ఉన్నారు. ఇందుకు సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ఎవ్వరూ అతీతం కాదు.

ఇలా ఇద్దరి వ్యక్తుల మధ్య నలిగిపోయిన ఓ బుల్లి తెర నటి శ్రావణి అనే అమ్మాయి కూడా తనువు చాలించింది. అయితే కొందరు మాత్రం ఇలాంటి వాటిని తట్టుకుని నిలబడతారు. ఇలాంటి వారికి ఎదురెళ్లడమే కాదు.. తమకు మోసం చేసిన వారికి సరైన రీతిలో సమాధానం చెబుతారు.. అలా తనకు మోసం చేసిన వ్యక్తికి తగిన రీతిలో బుద్ధి చెప్పిన ఓ అమ్మాయి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

నాకు మరిదిపై మోజు పెరుగుతోంది... నా భర్తపై ఆసక్తి తగ్గుతోంది.. నేనేం చేయాలి...నాకు మరిదిపై మోజు పెరుగుతోంది... నా భర్తపై ఆసక్తి తగ్గుతోంది.. నేనేం చేయాలి...

చిన్నతనం నుండి..

చిన్నతనం నుండి..

నేను ఓ చిన్న పట్టణంలో పుట్టి పెరిగాను. మా ఏరియాలో మా అమ్మే పెద్ద మనిషి. ఆమె గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె ఎంత చెబితే అంత. ఉదాహరణకు బహుబలిలో రాజమాత(రమ్యక్రిష్ణ) మాట శాసనంగా ఎలా ఉంటుందో.. రియల్ లైఫ్ లో మా అమ్మ మాట కూడా అంతే. నాకు ఇద్దరు అన్నయ్యలు. మా ఏరియాలో మాకు మంచి పేరుంది. మా అమ్మ మాట నేను ఎప్పుడూ జవదాటలేదు. చిన్నతనం బాలికల పాఠశాల, కళాశాలల్లోనే చదువుకున్నాను.

ఉన్నత చదువుల కోసం..

ఉన్నత చదువుల కోసం..

అయితే ఇంటర్మీడియట్ తర్వాత నేను ఉన్నత చదువుల కోసం సిటీకి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్లి చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే నేను చేరబోయే కాలేజీ కో ఎడ్యుకేషన్ కాలేజీ. మగవారితో ఫ్రెండ్ షిప్.. మా ఏరియా కాకపోవడంతో నాకు ఉండే స్వేచ్ఛ, ఇతర విషయాలన్నీ నాకెంతో నచ్చాయి.

ధైర్యం చేయలేకపోయా..

ధైర్యం చేయలేకపోయా..

నేను చాలా సంప్రదాయబద్ధంగా పెరిగాను. ఊళ్లో ఉన్నప్పుడు కేవలం లంగా, ఓణీలను లేదా పంజాబీ డ్రెస్ మాత్రమే వేసుకునేదాన్ని. అయితే సిటీలో నా స్నేహితులందరూ మోడ్రన్ దుస్తుల్లో వస్తుంటే, నేను మాత్రం అవి వేసుకునే ధైర్యం చేయలేకపోయాను. అప్పుడప్పుడు ధైర్యం చేసి జీన్స్, టీషర్ట్ వేసుకునేదాన్ని.

రతి క్రీడలో పాల్గొనడానికి ముందు ఆ పని కచ్చితంగా చేయాల్సిందేనా?రతి క్రీడలో పాల్గొనడానికి ముందు ఆ పని కచ్చితంగా చేయాల్సిందేనా?

ఏదో తెలియని మార్పు..

ఏదో తెలియని మార్పు..

అయితే అబ్బాయిలతో కలిసి తొలిసారిగా చదవడం.. ఫ్రెండ్ షిప్ కారణంగా.. నాలో ఏదో తెలియని మార్పు వచ్చింది. తను చాలా అందంగా, చక్కని మాటతీరుతో అందరితో కలిసిపోయేవాడు. నేను మగవారితో మాట్లాడేందుకు మోహమాటపడుతున్నానని అర్థం చేసుకుని, తనే నన్ను ప్రోత్సహించేవాడు. అది నాకు బాగా నచ్చింది.

కాఫీకి పిలిచాడు..

కాఫీకి పిలిచాడు..

అయితే ఓ రోజు తను నన్ను తనతో పాటు కలిసి కాఫీ తాగడానికి పిలిచాడు. నేను కూడా ఓకే చెప్పి వెళ్లిపోయా. అలా మేమిద్దరం మంచి స్నేహితులుగా మారిపోయాం. ఫస్టియర్ మొత్తం ఇద్దరం కలిసి ఉండేవాల్లం. అలా మేం ఎప్పుడు స్నేహితుల నుండి ప్రేమికులుగా మారిపోయామో మాకే తెలీదు.

ఏకాంతంగా గడిపేవాళ్లం..

ఏకాంతంగా గడిపేవాళ్లం..

నేను తొలిసారి ముట్టుకున్న, కిస్ చేసిన పురుషుడు కూడా తనే. కొన్నిసార్లు ఖాళీ సమయం దొరికితే మేమిద్దరం అందరికీ దూరంగా వెళ్లి ఏకాంతంగా గడిపేవాళ్లం. అయితే ఎప్పుడూ ముద్దుల విషయం దాటి ముందుకు పోలేదు. ఎందుకంటే.. పెళ్లి తర్వాతే నేను ఆ కార్యంలో పాల్గొనాలని ఫిక్సయ్యాను.

మగవారి మనసులోనూ శృంగార భయాలుంటాయా? అవేంటో తెలుసుకోండి...మగవారి మనసులోనూ శృంగార భయాలుంటాయా? అవేంటో తెలుసుకోండి...

ఒకరోజు ట్రై చేశాడు..

ఒకరోజు ట్రై చేశాడు..

అయితే ఒకరోజు వారి రూమ్ లో తనని కలిసినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ తనతో కలయికలో పాల్గొనేందుకు ప్రయత్నించాడు. అయితే నేను వెంటనే తేరుకుని, ఏదో ఒక అబద్ధం చెప్పి, అక్కడి నుండి వెంటనే తప్పించుకుని వచ్చేశా. నేను నిన్ను ప్రేమించాను. కానీ ఆ కార్యం వంటి విషయాలన్నీ పెళ్లయ్యాకే అని, పెళ్లికి ముందు నేను సిద్ధంగా లేనని చెప్పేశాను. తను కూడా నన్ను అర్థం చేసుకున్నాడు.

సెలవుల రోజుల్లో..

సెలవుల రోజుల్లో..

అంతలోపే మాకు పరీక్షలు దగ్గరపడ్డాయి. అవి అయిపోయిన తర్వాత సెలవులు కూడా ఇచ్చేశారు. అయితే సెలవుల్లో ఫోన్ మాట్లాడటం.. చాటింగ్ చేయడం వంటివి చేసేదాన్ని. ఓ రోజు రాత్రి నాకు నేను నిన్ను బాగా మిస్సవుతున్నా.. ఓ సెల్ఫీ పంపు అన్నాడు. నేను పంపాను. ఇది కాస్త రొమాంటిక్ గా ఉన్నది పంపు అన్నాడు. నా బాయ్ ఫ్రెండ్ కదా అన్న ధైర్యంతో సెక్సీగా ఉన్న ఫోటోలను పంపాను. ఆ తర్వాత మాములుగానే మాట్లాడుకున్నాం.

మళ్లీ కాలేజీ ప్రారంభం..

మళ్లీ కాలేజీ ప్రారంభం..

అలా చాలా త్వరగానే సెలవులు ముగిసిపోయాయి. సెకండియర్ కు ఎంతో ఉత్సాహంగా కాలేజీకి వెల్లాను. తను కనిపించగానే ఎంతో ఆనందంగా అనిపించింది. కానీ నా బాయ్ ఫ్రెండ్ మాత్రం నన్ను పక్కకు తీసుకెళ్లాడు. నా ఫొటోలు, రొమాంటిక్ చాటింగ్ నాకు చూపించాడు. అవి చూపించి తనతో కలయికకు ఒప్పుకోవాలని, లేదంటే ఈ మెసెజ్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, అందరికీ షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.

నిద్ర పట్టలేదు..

నిద్ర పట్టలేదు..

నాకు అప్పుడు ఏమి చేయాలో అర్థం కాలేదు. వెంటనే అక్కడి నుండి ఏడుస్తూ వెళ్లిపోయాను. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఆ తర్వాత రోజు నుండి నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు.

నేను డల్ గా ఉండటాన్ని..

నేను డల్ గా ఉండటాన్ని..

ఈ సమయంలో నేను డల్ గా ఉండటాన్ని మా మేడమ్ గమనించారు. ఏం జరిగిందని ఆమె అడగ్గానే ఏడుపు ఆపుకోలేకపోయాను. అయితే తను ఇచ్చిన ధైర్యంతో మా అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాను.

ఫొటోలు డిలీట్ చేయించా..

ఫొటోలు డిలీట్ చేయించా..

తను ముందు నన్ను ఎన్ని తిట్టినా.. కొట్టినా నా పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యంగా ఉండేలా చేసింది. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి మా మేడమ్ తనని ప్రిన్సిపల్ రూమ్ కు పిలిపించారు. అక్కడ తనకు వార్నింగ్ ఇచ్చి, ఫొటోలీను డిలీట్ చేయించారు. మళ్లీ తన వల్ల నాకేమైనా ఇబ్బంది వస్తే, కాలేజీ నుండి తొలగిస్తామని, అడ్మిషన్ కూడా ఎక్కడా దొరక్కుండా చేస్తామని చెప్పడంతో తను భయపడ్డాడు.

మా మేడమ్ కు మాటిచ్చా..

మా మేడమ్ కు మాటిచ్చా..

ఆ తర్వాత నేను ఎప్పుడు ఎదురుపడ్డా కూడా తను తల వంచుకుని వెళ్లిపోయేవాడు. నా జీవితంలో నా మొదటి ప్రేమ తనకున్న కామ కోరికల వల్ల చెడు అనుభవంగా మిగిలిపోయింది. అయితే తర్వాత నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోనని, ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పుడు రిపీట్ కావని నేను మా మేడమ్ కు మాటిచ్చాను. అప్పటి నుండి నా జీవితం చదువు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా సాగుతోంది.

English summary

My boyfriend tried to blackmail me for love in telugu

Here we talking about my boyfriend tried to blackmail me for love in telugu. Read on
Story first published: Tuesday, September 15, 2020, 16:00 [IST]