For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారు లోన్ కట్టాక.. బ్రేకప్ చెప్పింది.. సరిగ్గా పెళ్లికి ముందే మాజీ ప్రియుడితో..!

|

అతను.. ఆమె గత ఆరు నెలలుగా ఆ సంబంధంలో ఉన్నారు. వారిద్దరూ అతి తక్కువ కాలంలోనే చాలా బాగా కలిసిపోయారు. అది ఎంతలా అంటే.. ఏకంగా ఆర్థిక పరమైన విషయాల్లో కూడా సహాయం చేసుకునేంతగా వారి మధ్య బంధం బలపడింది.

ఈ నేపథ్యంలోనే తన ప్రియురాలికి ఒక ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. తనతో కారు కొనేంత డబ్బు లేకపోయినా.. తన బర్త్ డే రోజున, లోన్ తీసుకుని మరీ కారును కొనేశాడు. అయితే అక్కడి నుండి అసలు కథ మొదలైంది.

అచ్చం సినిమాలో మాదిరిగా.. కారు లోన్ పూర్తయిన వెంటనే తన ప్రియురాలు బ్రేకప్ చెప్పేసింది. దీంతో తనకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు తానేం చేయాలని నిపుణులను సంప్రదించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పార్ట్ నర్ తో పొట్లాటే కాదు.. రాజీ పడటమూ ముఖ్యమే...!పార్ట్ నర్ తో పొట్లాటే కాదు.. రాజీ పడటమూ ముఖ్యమే...!

నా కొలిగ్ తో..

నా కొలిగ్ తో..

‘నేను తను ఒకే ఆఫీసులో జాబ్ చేస్తున్నాం. నా వయసు 26 ఏళ్లు. నేను తను ఆరు నెలలుగా డేటింగులో ఉన్నాం. రెండు నెలల క్రితమే మా ఇద్దరికీ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. వెడ్డింగ్ కార్డులను కూడా రెడీ చేసేశాం.

కొత్త కారు కొనేశా..

కొత్త కారు కొనేశా..

ఈ నేపథ్యంలో తను కొత్త కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. తను కోరుకున్న కారు మోడల్ కోసం ఆరు నెలలుగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా పెళ్లికి ముందు తను కోరుకున్న కారు కూడా మార్కెట్లోకి వచ్చేసింది. అయితే ఆ సమయంలో కారు కొనేంత డబ్బు తన వద్ద లేదు. కానీ లోన్ తీసుకుని మరీ కారు కొనేశారు.

లోన్ తీరాక..

లోన్ తీరాక..

అయితే కొద్ది రోజుల్లోనే తన ప్రియురాలి కారు లోన్ మొత్తం కట్టేశారు. పెళ్లికి ముందు ఎలాంటి అప్పులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే కారు లోన్ మొత్తం క్లియర్ చేసేశారు. అయితే లోన్ మొత్తం పూర్తయ్యాక.. తన ప్రియురాలు షాకిచ్చింది. ఓ రోజు సడెన్ గా ఫోన్ చేసి తను తన మాజీ ప్రియుడిని ప్రేమిస్తున్నానని చెప్పింది.

స్త్రీలకు పడకగదిలో సుఖం లేకపోవడానికి కారణాలేంటి... వాటిని అధిగమించేందుకు గల మార్గాలేంటో చూసెయ్యండి...స్త్రీలకు పడకగదిలో సుఖం లేకపోవడానికి కారణాలేంటి... వాటిని అధిగమించేందుకు గల మార్గాలేంటో చూసెయ్యండి...

ఇలా అవుతుందనుకోలేదు..

ఇలా అవుతుందనుకోలేదు..

నేనేమో తనే నా జీవితం అనుకున్నాను. తనతో భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుందని ఎన్నో కలలు గన్నాను. కానీ తను ఇలా బ్రేకప్ చెప్పి, నన్ను మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదు. కొద్ది రోజుల్లో పెళ్లనగా తను ఇలా చేయడంతో.. ఇంట్లో అందరూ తీవ్ర నిరాశలో పడిపోయారు. నేను ఇప్పుడు ఏం చేయాలి' అని ఓ యువకుడు తన బాధను చెప్పుకున్నాడు.

ఖర్చులు మాములే..

ఖర్చులు మాములే..

ఎవరైనా జంటలు ఏదైనా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు ఖర్చులు చేయడం అత్యంత సహజం. అయితే ఇద్దరూ సమానంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అయితే మీరు తొలి నుండి కొంత లిమిట్స్ లో ఉండి ఉంటే మంచిగా ఉండేది. ఏది ఏమైనా తను డేటింగ్ చేసి.. తీరా పెళ్లి సమయంలో బ్రేకప్ చెప్పడం చాలా బాధకరం.

కష్టంగానే ఉన్నప్పటికీ..

కష్టంగానే ఉన్నప్పటికీ..

తను సడెన్ గా ఫోన్ చేసి తన ప్రియుడితో వెళ్తానని.. మిమ్మల్ని మరచిపోమని చెప్పడం.. ఇది మీకు చాలా కష్టంగానే ఉంటుంది. తను చాలా ఉద్దేశపూర్వకంగా మీరు కారు లోన్ క్లియర్ చేశాక.. ఈ విషయం చెప్పడం మోసం చేయడమే. అంతేకాదు తను మీ నమ్మకాన్ని కూడా కోల్పోయారు. ఇది కష్టంగా ఉన్నప్పటికీ, మీరు అలాంటి వారు ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది.

ధైర్యంగా ఉండండి..

ధైర్యంగా ఉండండి..

తను చేసిన మోసాన్ని తలచుకుంటూ ఉండకుండా.. మీరు ధైర్యంగా ముందడుగు వేయాలి. ముఖ్యంగా మీరు వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఇంట్లో వారి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి. వారిలో సంతోషం నింపేందుకు ప్రయత్నించాలి. మీ బాధను మరచిపోవాలంటే.. మీ స్నేహితులతో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. అప్పుడు మీకు కొంతైనా రిలీఫ్ లభిస్తుంది.

English summary

My Girlfriend Broke up With Me After I Paid Four Wheeler Loan, What Should I Do?

Here we are talking about my girlfriend broke up with me after i paid four wheeler loan, what should i do? Read on
Story first published: Friday, May 21, 2021, 8:00 [IST]