Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
‘నా గర్ల్ ఫ్రెండ్ అప్పటి నుండి అంతా ఫోన్లేనే చేద్దామంటోంది... నాకేమి చేయాలో అర్థం కావట్లేదు’
నా ప్రియురాలు నాతో ఫోనులోనే అన్ని చేయమని చెబుతోంది.
లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఇది మనల్ని ఒక్కోసారి మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. ముందుగా మనం ఏదైనా కోరుకుంటే దాన్ని అందుకునేలా చేస్తుంది.

కానీ అంతలోనే మనం ఎంతగానో ఇష్టపడిన, ప్రేమించిన వ్యక్తులను చాలా దూరం చేస్తుంది. వారి కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఒక యువకుడు తన కాలేజీ చదివే రోజుల్లో తన ప్రియురాలి ఎన్నో కలలు కన్నాడు. తన కలల రాజకుమారిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాంతం గడుదామని అనుకున్నాడు.

కానీ తన జీవితంలో కరోనా లాక్ డౌన్ పెద్ద దెబ్బ కొట్టిందంటూ బాధపడుతున్నాడు. సరిగ్గా ఈ టైమ్ లో తన ప్రియురాలు ఫోన్లోనే అన్ని కావాలని ఫోర్స్ చేస్తోందట. తనకేమి పెళ్లికి ముందు అలాంటివి ఇష్టం లేదంట. ఈ నేపథ్యంలో ఈ కుర్రాడు ఏమి చేశాడు.. తన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఒకే కాలేజీలో..
‘హాయ్! నా పేరు లోకేష్ (పేరు మార్చాం). నేను కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పీజీ చదువుతున్నాను. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. తను నేను స్కూల్ టైమ్ నుండే చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. అందుకే మేమిద్దరం ఒకే కాలేజీ చేరాం.

కరోనా కారణంగా..
ప్రతిరోజూ కాలేజీలో ఎంతో హాయిగా కలిసి గడిపే మాకు కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. లాక్ డౌన్ కారణంగా మా ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అయిన తను సరిగా రావడం లేదు. ఎక్కువగా ఆన్ లైన్ క్లాసులకే ప్రియారిటీ ఇస్తోంది.

లాక్ డౌన్ తర్వాత..
అయితే మేమిద్దరం అప్పటినుండి ఫోన్లో మాత్రం టచ్ లో ఉండేవాళ్లం. నిత్యం చాటింగ్, కాలింగ్ చేసుకుని తెగ ముచ్చటించుకునేవాళ్లం. అయితే చాలా రోజుల తర్వాత మేమిద్దరం అనుకోకుండా కాలేజీ దగ్గర కలిశాం.

అదే తొలిసారి..
లాక్ డౌన్ సడలింపుల తర్వాత తనను చూడటం అదే మొదటిసారి. ఇంతకాలం ప్రత్యక్షంగా కలవని మేము ఒక్కసారిగా లైవ్ లో చూసుకునేసరికి కరోనా వంటి మహమ్మారి కారణంగా తాము భౌతిక దూరాన్ని పాటిస్తూనే పలకరించుకున్నాం.

కొత్తగా ట్రై చేద్దాం..
అయితే తను చాలా రోజుల తర్వాత చూసిన వెంటనే తన కంట్లో కన్నీళ్లు ఆగలేదు. ఆనందబాష్పలు ఉప్పొంగాయి. అంతే ఆరోజు రాత్రి సోషల్ మీడియా ద్వారా సడెన్ వీడియో కాల్ చేసింది. అంతవరకు తను కేవలం ఆడియో కాల్.. చాటింగ్ మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలోనే తను నాతో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పింది.

ఫోన్లోనే రొమాన్స్..
అలా చెప్పడమే ఆలస్యం.. ఫోన్లో రొమాన్స్ చేసేద్దామని చెప్పింది. అంతేకాదు నాకు అలాంటి ఫొటోలు పంపమని చెప్పి షాకిచ్చింది. అయితే మేము ఇద్దరం ఇప్పటివరకు అలాంటి విషయాలు మాట్లాడుకున్నప్పటికీ, కొంత లిమిట్స్ లో ఉండేవాళ్లం.

అలా ఆలోచించలేదు..
అయితే మేము అప్పుడప్పుడు కిస్ చేసుకునేవాళ్లం.. కౌగిలింతల వరకు వచ్చి ఆగిపోయేవాళ్లం. అందుకే, ఫోన్లో అలా చేయాలనే ఆలోచన నాకెప్పుడు కలగలేదు.

నాకిష్టం లేదు..
అయితే ఇప్పుడు తను సడెన్ గా అలా అడిగేసరికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒకవేళ నేను తను చెప్పినట్లు చేస్తే భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురవుతుందేమోనని భయమేస్తోంది.

పోస్ట్ పోన్ చేస్తూ వచ్చా..
అయితే అలాంటివన్నీ నేను ఆలోచించి.. ఇప్పుడొద్దు.. ఇంకోసారి ట్రై చేద్దాం లే అని పోస్ట్ పోన్ చేసేవాడిని. కానీ తను మాత్రం దాని గురించి పదే పదే గుర్తు చేస్తుండేది. అంతేకాదు, తన పర్సనల్ ఫొటోలను కూడా షేర్ చేసింది. మరోసారి వీడియో కూడా షేర్ చేసి షాకిచ్చింది.

నన్ను కలవాలని..
అయితే లాక్ డౌన్ వల్ల తనకు పిచ్చెక్కినట్లు అవుతోందని.. నన్ను కలవాలని.. తనతో గడపాలని కోరింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్టు కాదని నేను తనకు నచ్చజెప్పాను. అయితే తను మాత్రం ఆ విషయం అస్సలు తగ్గడం లేదు. తనంటే నాకు బాగా ఇష్టం. నాకు మాత్రం అలాంటివన్నీ పెళ్లి తర్వాత జరిగితేనే బాగుంటుందనిపిస్తోంది. ఈ పరిస్థితులలో నేనేం చేయాలో తెలియట్లేదు' అని ఓ యువకుడు నిపుణులను సలహా కోరాడు.

నమ్మకం మీద..
దీనికి నిపుణులు చెప్పిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క బంధం అనేది నమ్మకం, అర్థం చేసుకునే విధానంపై డిపెండ్ అయ్యుంటుంది. మీరిద్దరూ కలిసి సమస్యలను సాల్వ్ చేసుకునే దానిపై మీ సంబంధంపై ప్రభావం చూపుతుంది. అది మంచిదా.. చెడ్డదా అనేదే మీరే తేల్చుకోవాలి.

సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోరికలు కలగడం అనేది చాలా సహజం. అంతేకాదు కొందరు అమ్మాయిల్లో ఉద్రేకం కూడా పెరుగుతుంది. ఇది వారి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే సింగిల్ ఉన్నామనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.

విడిపోయామా..
తమ పార్ట్ నర్ నుండి విడిపోయామ అన్న ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే తను ఏవేవో ఊహాలతో మీతో అలా కావాలని కోరి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మీరు తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు కూడా ఉండొచ్చు.

నెమ్మదిగా వివరించండి..
మీకు కంఫర్ట్ లేని, మీకు ప్రాబ్లమ్ అని ఫీలయ్యే వాటి గురించి మీరు నిర్ణయాలు తీసుకోవాలని ఎవ్వరూ బలవంతం చెయ్యలేరు. కాబట్టి, మీ మైండ్ లో ఉండే ఆలోచనలను క్లియర్ గా మీ గర్ల్ ఫ్రెండ్ వివరించండి. అప్పటికీ తను అర్థం చేసుకోకపోతే.. మీ ప్రాబ్లమ్ అలాగే ఉంటే, మీరు బాగా నమ్మేవారి సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











