For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లేడీస్ సింగిల్ గానే ఉంటారట.. అబ్బాయిలతో మింగిల్ అవ్వరంట... ఎందుకో తెలుసా...

పెళ్లి చేసుకోవడానికి మహిళలు ఎందుకని భయపడతారనేందుకు కారణాలు తెలుసుకుందాం.

|

మన దేశంలో ఏ అమ్మాయికైనా 18 సంవత్సరాలు దాటితే చాలు పెళ్లిళ్లు చేసేస్తుంటారు. అయితే ప్రస్తుతం కొందరు చదువు, జాబ్ వంటి కారణంగా 20 నుండి 22 ఏళ్ల వయసు మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే చాలా మంది పేరేంట్స్ తమ అమ్మాయి చదువు పూర్తి చేసుకున్నప్పటి నుండే మంచి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటారు.

Reasons Why Women Are Scared Of Marriage in Telugu

ఇంకా కొంతమందైతే చదువు కూడా పూర్తి కాకముందే పెళ్లి చేసేస్తారు. కానీ పాతికేళ్లు దాటినా అమ్మాయి పెళ్లి చేసుకోలేదంటే చాలు.. తనలో ఏదో లోపం ఉందన్నట్టు చూస్తు ఉంటారు. ఇంకా ఒంటరిగా ఉంటే ఈ సమాజంలో నీకు విలువ ఉంటుందా అంటూ సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటారు.

Reasons Why Women Are Scared Of Marriage in Telugu

అంతేకానీ మనం సింగిల్ గా ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయరు. ఇదిలా ఉంటే.. ఇప్పటితరం అమ్మాయిల్లో చాలా మంది పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారట. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'బర్త్ డే రోజు అలా వచ్చి సర్ ప్రైజ్ చేసిన నా ప్రేయసి...' ఆ తర్వాత ఏం జరిగిందంటే...?'బర్త్ డే రోజు అలా వచ్చి సర్ ప్రైజ్ చేసిన నా ప్రేయసి...' ఆ తర్వాత ఏం జరిగిందంటే...?

పెళ్లయితే..

పెళ్లయితే..

ఓ అధ్యయనం ప్రకారం.. పెళ్లి చేసుకున్న పురుషులలో చాలా మంది ఆనందంగా ఉన్నారంట. కానీ ఆడవారు మాత్రం పెళ్లి జరిగితే తాము ఆనందాన్ని కోల్పోతామని భయపడుతున్నారట. అంతేకాదు ఇప్పటివరకు తమకు ఉన్న ఫ్రీడమ్ కూడా పోతుందని భావిస్తున్నారట.

బాధ్యతలు పెరుగుతాయని..

బాధ్యతలు పెరుగుతాయని..

పెళ్లి చేసుకున్నాక మగవారికి కొన్ని బాధ్యతలు తగ్గుతాయి. కానీ అమ్మాయిలకు అనేక బాధ్యతలు పెరుగుతాయట. చాలా రిస్కులు తీసుకోవాల్సి వస్తుందట. అటు ఇంటి పని.. ఇటు ఆఫీసు పని రెండింటిని ఎలా మ్యానేజ్ చేయాలో అని తెగ టెన్షన్ పడతారట. అందుకే పెళ్లికి నో చెబుతుంటారట.

పిల్లలు పుట్టాక..

పిల్లలు పుట్టాక..

మరికొందరు అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుడితే వారి కెరీర్ అక్కడితో ఆగిపోతుందని ఆలోచిస్తారట. దీంతో వారి లైఫ్ అన్ హ్యాపీగా ఉంటుందట. అందుకే ప్రపంచంలో జీవితాంతం ఆనందంగా ఉండాలనుకునే అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదని ఫిక్సవుతారట.

‘నా ప్రియురాలు సడెన్ గా నా రూమ్ కొచ్చింది.. అప్పుడేమైందంటే...'‘నా ప్రియురాలు సడెన్ గా నా రూమ్ కొచ్చింది.. అప్పుడేమైందంటే...'

ఫలానా వయసులోనే..

ఫలానా వయసులోనే..

ముఖ్యంగా అమ్మాయిలు ఫలానా వయసులోనే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలంటూ సమాజంలో ఉన్న ఆలోచనను మార్చుకోవాలని, అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఉండటం తప్పు కాదని.. ఇలా చేయడం వల్లే తాము జీవితాన్ని జాలీగా గడుపుతున్నామని చెబుతున్నారు.

బానిసగా ఉండాల్సి వస్తుందని..

బానిసగా ఉండాల్సి వస్తుందని..

తాము పెళ్లి చేసుకుంటే.. భర్త చెప్పినట్టే నడుచుకోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్క విషయంలో తనదే ఆధిపత్యం ఉంటుందని, అలాంటివి తమకు నచ్చవట. అందుకే పెళ్లి చేసుకొని భర్తకు బానిసలాగా బతికేకంటే సింగిల్ గా ఉండడమే మంచిదని భావిస్తారట.

నమ్మకం లేకపోవడం..

నమ్మకం లేకపోవడం..

చాలా మంది పెళ్లికి ముందు ఏవేవో కలలు కంటూ ఉంటారు. అయితే అవి పెళ్లి చేసుకున్నాక నిజం అవుతాయో కాదోనని, తమ నమ్మకాలు నిజమవుతాయో లేదోనని, తమ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఎక్కడ విలువఇవ్వరోనని పెళ్లికి నో చెబుతారంట.

తక్కువగా చూస్తారని..

తక్కువగా చూస్తారని..

పెళ్లి చేసుకున్న వారంతా చాలా విషయాల్లో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. తమ కంటే ఎక్కువ చదువుకున్నామని లేదా తమ కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నామని, లేదా వయసులో మీ కంటే పెద్ద కాబట్టి భర్త చెప్పిందే వినాల్సి వస్తుందనే కారణాలతో చాలా మంది అమ్మాయిలు పెళ్లికి నో చెబుతారంట.

భర్త కోసం మారాల్సి వస్తుందని..

భర్త కోసం మారాల్సి వస్తుందని..

పెళ్లికి ముందు ఎంతో స్వేచ్ఛగా జీవించిన తాము పెళ్లి కోసం తాము ఎన్నో విషయాలను భర్త కోసం త్యాగం చేయాల్సి వస్తుందని.. కేవలం భర్తను మెప్పించడానికి తమను తాము మార్చుకోవడమంటే చాలా కష్టమట. లేదంటే తమ రిలేషన్ షిప్ లో అప్పటినుండి దూరం పెరుగుతుందని లేదా గొడవలు స్టార్టవుతాయని భయపడతారంట. అందుకే పెళ్లి చేసుకోకపోతే ఇలాంటి గొడవలేమీ ఉండవని ఫీలవుతారట.

మంచి అబ్బాయి కోసం..

మంచి అబ్బాయి కోసం..

ఇలాంటి కారణాలతో ఈతరం అమ్మాయిలు త్వరగా పెళ్లి చేసుకోవడానికి నో చెబుతున్నారట. మరికొందరు పెళ్లికి ముందే తమకు కాబోయే భాగస్వామి గురించి అన్ని వివరాలను కనుక్కొని, తమకు అన్ని విధాలుగా సెట్ అవుతాడనుకుంటేనే ముందడుగు వేస్తున్నారట. లేదంటే ఎంత లేటైనా సరైన జోడి కోసం వెయిట్ చేస్తున్నారట.

English summary

Reasons Why Women Are Scared Of Marriage in Telugu

Here we are talking about the reasons why women are scared of marriage in Telugu. Have a look
Story first published:Saturday, June 26, 2021, 19:33 [IST]
Desktop Bottom Promotion