For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే ఆ కార్యంలో ఆందోళన అనేదే ఉండదట...!

శృంగారం గురంచి ఎలాంటి యాంగ్జైటీ ఉంటుంది.. దాన్ని అధిగమించేందుకు గల చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ శృంగారం అనగానే మనసులో కోరికలు గుర్రాలై పరుగెత్తడం మొదలెడతాయి. వయసులో ఉండే యువతీ యువకులు ఎప్పుడెప్పుడు శృంగారంలో పాల్గొందామా.. అని తహతహ లాడుతూ ఉంటారు.

Sexual Performance Anxiety & Tips to Overcome It in Telugu

తమ తనువుల దాహాన్ని ఎప్పుడు తీర్చుకుందామా అని ఆరాటపడుతూ ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత మాత్రం ఆ కార్యంలో పాల్గొనేందుకు ఆందోళన పడుతూ ఉంటారు. ఇక తొలిసారి శృంగారంలో పాల్గొనే వారు కూడా తాము భాగస్వామిని సుఖపెడతామా లేదా అని ఆలోచిస్తూ తమకు తెలియకుండానే ఒత్తిడిని ఫీలవుతుంటారు.

Sexual Performance Anxiety & Tips to Overcome It in Telugu

మరోవైపు తమకు శృంగారంలో ఉన్న ఊహాల గురించి చెబితే.. తమ భాగస్వామి కో ఆపరేట్ చేస్తుందా లేదా అని భయపడుతూ ఉంటారు. కొందరు పురుషులైతే తాము లావుగా ఉన్నామని.. మరికొందరు తాము చిన్నగా ఉన్నామని.. తమ పురుషాంగం చిన్నదిగా ఉందని.. దీంతో తాము ఆ కార్యాన్ని ఆస్వాదించలేమని భావిస్తూ ఉంటారు.

Sexual Performance Anxiety & Tips to Overcome It in Telugu

అయితే ఇలాంటి విషయాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు. అయితే అలాంటి అపొహలను తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలంటున్నారు నిపుణులు. లేకపోతే లేని పోని సమస్యలు వస్తాయని, వాటిని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో ఇప్పుడే చూసెయ్యండి మరి.

మీ ప్రియురాలిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి చేయక తప్పదు బ్రదర్...!మీ ప్రియురాలిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి చేయక తప్పదు బ్రదర్...!

అంగస్తంభన సమస్యలు..

అంగస్తంభన సమస్యలు..

మీరు శృంగార కార్యంలో పాల్గొనడానికి ముందు ఎక్కువగా ఆందోళన చెందితే అంగస్తంభన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఒత్తిడి వల్లే వస్తుందట. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ముందుగా మానసికంగా సిద్ధం కావాలని.. అలాగే మీ పార్ట్నర్ ను కూడా ఆ కార్యానికి మానసికంగా ప్రిపేర్ చేయాలని చెబుతున్నారు.

గ్యాప్ తీసుకోవాలి..

గ్యాప్ తీసుకోవాలి..

ఒకవేళ మీకు మరీ ఒత్తిడిగా అనిపిస్తే.. కొంత గ్యాప్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముందుగా మీ మనసులో లేదా మెదడులో వచ్చే ప్రతికూల ఆలోచనలకు చెక్ పెట్టాలంటున్నారు. కేవలం శృంగారం గురించి ఆలోచిస్తే, ఈ ఆందోళన నుండి సులభంగా బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

సరదాగా కబుర్లు..

సరదాగా కబుర్లు..

మీకు ఆ కార్యంలో పాల్గొనేందుకు ఆందోళనగా ఉంటే.. నేరుగా శృంగారంలో పాల్గొనకుండా ముందుగా మీ పార్ట్నర్ తో పడకగదిలో సరదాగా కబుర్లు చెప్పుకోవాలట. అయితే అవన్నీ రొమాంటిక్ ముచ్చట్లు అయి ఉండాలట. దీని వల్ల మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. మీరు ఆ కార్యానికి ఆటోమేటిక్ గా చేరువవుతారట. ఇక మీరిద్దరూ అందుకు సిద్ధమయ్యారని అనిపించినప్పుడు ఆ కార్యంలోకి అడుగుపెడితే అద్భుతంగా ఆస్వాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.

రతిక్రీడలో మహిళలు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు...రతిక్రీడలో మహిళలు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు...

లోదుస్తులు..

లోదుస్తులు..

ఒకవేళ మీ భాగస్వామి ఆ కార్యం విషయంలో ఆందోళన పడుతుంటే.. మీరు తనపై చూపే ప్రేమ, సెక్సీ డ్రస్.. ముఖ్యంగా మూడ్ వచ్చే లోదుస్తులను వేసుకుంటే వారి మూడ్ మారే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా మీ పార్ట్నర్ కు కొత్తగా కనిపించేలా.. వారిని ఆకర్షించే ప్రయత్నం చేయాలట. ఇందుకోసం లోదుస్తులపై కొంచెం ఫోకస్ పెడితే చాలట.

ఫోర్ ప్లే..

ఫోర్ ప్లే..

శృంగారంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అస్సలు మరచిపోకూడదు. ప్రారంభంలో మీరు ఎంతలా ఫోర్ ప్లే చేస్తారో.. ఆ కార్యంలో అడుగుపెట్టాక.. ఆసాంతం అద్భుతమైన అనుభూతిని పొందుతారట. ఫోర్ ప్లే చేయడం వల్ల మీ ఇద్దరిలో సెక్స్ హార్మోన్లు విడుదలై.. మీరిద్దరూ స్వర్గపు అంచుల దాకా వెళ్లిన అనుభూతిని ఫీలవుతారట.

సుఖపడాలంటే..

సుఖపడాలంటే..

ఇక శృంగారంలో మీరిద్దరూ రతి మన్మథుడిలా రెచ్చిపోవాలంటే.. ప్రారంభం నుండి మీరిద్దరూ ఒకరినొకరు మెడ, చెవుల వెనుకభాగంలో సుకుమారంగా తాకుతూ.. ముద్దులు పెట్టుకోవాలట. ఆ తర్వాత ముందుభాగానికొచ్చి గట్టిగా హగ్ చేసుకోవడం వంటివి చేస్తే ఆ కార్యంలో మీకు కావాల్సిన సుఖాన్ని ఇట్టే పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

క్రమం తప్పకుండా..

క్రమం తప్పకుండా..

శృంగారంలో పాల్గొనే వారు ఎక్కువగా ఎక్సర్ సైజ్ పై కూడా ఫోకస్ పెట్టాలట. మీరు రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేయడం వల్ల మీకు ఒత్తిడి తగ్గే అవకావం ఎక్కువగా ఉంటుందట. మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అందుకే నిత్యం యోగా వంటివి చేయడం అలవాటు చేసుకోవాలని లేదా ప్రతిరోజూ కనీసం అరగంట పాటు ఎక్సర్ సైజ్ చేయాలని.. వీటిని రెగ్యులర్ చేస్తే.. మీరు శృంగార సమస్యల నుండి సులభంగా బయటపడతారని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Sexual Performance Anxiety & Tips to Overcome It in Telugu

Here we are talking about the sexual performance anxiety & tips to overcome it in Telugu. Have a look
Desktop Bottom Promotion