Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అలాంటి మగాళ్లనే మగువలు ఎక్కువగా ఇష్టపడుతున్నారట...!
ఈ ఆన్ లైన్ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం, బూడిదరంగు జుట్టు ఉన్న మగవారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు
మగవారికి ఇది మాంచి కిక్ ఇచ్చే సర్వే. ఎందుకంటే ఈ సర్వేలో అమ్మాయిలు అందరూ అనుకున్న దాని కంటే భిన్నంగా సమాధానాలు ఇచ్చారు. అంతే కాదు మగవారి వెంట్రుకలపై చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారట..

ఈ విషయం విన్న తర్వాత నుండి మీరు కచ్చితంగా మీ జుట్టుకు రంగులు వేయటం మానుకుంటారు.. సహజంగా రంగులు మారే మీ వెంట్రుకలతోనే మీరు నిక్షేపంగా బయటకు వెళతారు. ఎందుకంటే ఇటీవల ఓ ఆన్ లైన్ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వేలో మగవారి జుట్టు ఏ కలర్లో ఉంటే నచ్చుతారు?

మగాళ్ల వెంట్రుకలు పూర్తిగా నల్లగా ఉంటేనే మీకు నచ్చుతారా? అని ప్రశ్నించగా.. ఆ సర్వేలో పాల్గొన్న మహిళల్లో 72 శాతం మంది కాదు అని సమాధానమిచ్చారట. అయితే పురుషుల జుట్టు ఏ రంగులో ఉంటే ఎక్కువగా ఇష్టపడతారో అనే వివరాలను ఆ సర్వేలో తెలియజేశారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ స్టోరీలో చూడండి...

బూడిద రంగులో..
మీకు మన దక్షిణాది సినిమాల్లో రజనీకాంత్, అజిత్, జగపతిబాబు హెయిర్ ఏ కలర్లో ఉంటుందో మీకు బాగా గుర్తుంది కదా. అచ్చం అలాంటి హెయిర్ నే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. ముఖ్యంగా బూడిద రంగులో ఉంటే అమ్మాయిలకు బాగా నచ్చుతుందట.

మరీ పాతగా కనిపించకూడదు..
ఈ ఆన్ లైన్ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం, బూడిదరంగు జుట్టు ఉన్న మగవారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వారిలో వయసు పైబడినట్టు మాత్రం కనిపించకూడదట.

హెయిర్ స్టైల్ కూడా..
అయితే బూడిద రంగులో కనిపించే హెయిర్ స్టైల్ కు కూడా అమ్మాయిలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. ఈ సర్వేలో పాల్గొన్న అమ్మాయిల అభిప్రాయం ప్రకారం పురుషులలో బూడిద రంగుతో కొంత తెల్ల రంగు జట్టు ఉన్న వారిని ఇష్టపడతారట.

వారినే ఎందుకు ఇష్టపడతారంటే..
స్కాట్లాండ్ లోని సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలోని ఒక పరిశోధకుడు చేసిన అధ్యయనం ప్రకారం, మహిళలు తమ తండ్రి మాదిరిగానే కనిపించే మగవారి పట్ల ఆకర్షితులు అవ్వుతారంట. ఇదేమీ కొత్త కాదు. వాస్తవానికి ఇది వారి భద్రత యొక్క భావాన్ని పెంచుతుందట. అందుకే అలాంటి రంగు జుట్టు ఉన్న వారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట.

పరిపక్వత కోరుకుంటారు..
వయసుతో పాటు వారి భాగస్వాములలో చాలా మంది మహిళలు అవగాహన మరియు పరిపక్వతను కోరుకుంటారని మనందరికీ తెలుసు. చాలా సందర్భాలలో మగవారి జుట్టు ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత పండిపోవడం అంటే నల్ల రంగు నుండి తెల్లగా లేదా బూడిద రంగులో మారుతూ ఉంటుంది.

సర్వే ఎవరు నిర్వహించారంటే..
ఇంతకీ ఈ సర్వే నిర్వహించిన సంస్థ పేరు ఏంటంటే మ్యాచ్.కామ్. ఇటీవల ఈ ఆన్ లైన్ డేటింగ్ సంస్థ మగాళ్ల జుట్టు రంగుపై నిర్వహించిన సర్వేలో అమ్మాయిలు తమ అభిప్రాయాలను చెప్పారట.

నిశ్చింతంగా ఉండండి..
చూశారు కదా.. మగవారు ఇప్పటి నుండి మీరు జుట్టుకు రంగు వేయడం వంటివి తగ్గించుకోండి. న్యాచురల్ హెయిర్ స్టైల్ నే మెయింటెయిన్ చేయండి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి.



Click it and Unblock the Notifications