For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశిచక్రాల వారు కేవలం మనీ కోసమే ప్రేమిస్తారంట...! ఇందులో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!

|

ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతటి శక్తి ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎప్పుడు.. ఎవరిలో ఎక్కడ మొదలవుతుందో అస్సలు తెలియదు. ఈ రెండక్షరాల ప్రేమ మనలో పుట్టిన క్షణం నుండి మన జీవితం ఆనందమయంగా మారిపోతుంది. ఎందుకంటే ఈ ప్రేమకు కులం, మతం, ప్రాంతం, వర్గం, జాతి, ఆస్తి, అంతస్తు అనే భేదాలేవీ ఉండవు. ఇలాంటి అడ్డుగోడలనన్నింటినీ ఛేదించి చాలా మంది ప్రస్తుత జీవితంలో ప్రేమ పేరిట ఒక్కటవుతున్నారు.

అంతేకాదు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు కూడా. ప్రస్తుత సమాజంలో కూడా తమ పిల్లల ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. ఇరు కుటుంబాలు అన్ని విషయాలను చర్చించుకుని, ఆనందం వివాహాలు కూడా జరిపిస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటే.. వారి ఆనందానికి అవధులనేవి ఉండవు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ప్రేమ కోసం ఎదురు చూసే ప్రతి వ్యక్తికి తమ భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంలో కొన్ని కోరికలు ఉంటాయి. కొంతమంది సినిమాల్లో చూపినట్టు, ప్రేమ విషయంలో ఓ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు.

అది శారీరక లక్షణాలు లేదా వ్యక్తిత్వ లక్షణాలు కావచ్చు. అయితే చాలా మంది మీకెలాంటి వారు కావాలంటే.. అందరి నుండి టక్కున వచ్చే సమాధానం.. అందం, మంచి ఉద్యోగం, ఉన్నత విద్య, తమ ఫ్యామిలీతో కలిసిపోయి.. పేరేంట్స్ ను ప్రేమగా చూసుకుంటే చాలని చెబుతుంటారు. మనం ఇలా చెప్పుకుంటే పోతే.. లిస్ట్ చాంతడంత పెరుగుతూనే ఉంటుంది. అయితే చాలా మందికి వారు పుట్టి పెరిగిన పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న వాతావరంణం వల్ల అలవాట్లు, అభిరుచులు అనేవి మారిపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ప్రేమ విషయంలో చాలా ప్లాన్ గా ఉంటున్నారు.

కొందరు క్యారెక్టర్ ను చూసి ప్రేమిస్తుంటే.. మరికొందరు కేవలం ఆస్తిపాస్తులు, వారి వద్ద ఉండే ధనం చూసి ప్రేమలో పడుతున్నారు. 'ధనం మూలం ఇదంజగత్' డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి, అది జీవితాన్ని శాసిస్తుందని చాలా నమ్మకం. అందుకే చాలా మంది అలానే ఆలోచిస్తారట. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఇలాంటి లక్షణాలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయట. అయితే అందరూ అలాగే ఉంటారని మాత్రం అస్సలు అనుకోవద్దు. చాలా మంది నిజాయితీగా ప్రేమించే వారు కూడా ఉంటారు. అయితే 'మనీ' అనగానే వారి హార్ట్ బీట్ మరింత వేగంగా కొట్టుకుంటుందట. ఇంతకీ ఆ రాశి చక్రాలేవో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి...

Aries Love Horoscope : 2021లో మేషరాశి వారి ప్రేమ మరియు రిలేషన్ షిప్ లైఫ్ ఎలా ఉంటుందంటే...!

వృషభ రాశి..

వృషభ రాశి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశి వారు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరి జీవితంలో ఎల్లప్పుడూ పాజిటివ్ రిజల్ట్ ఉండాని ఆశిస్తుంటారు. అంతేకాదు వీరు అనునిత్యం ఆనందంగా ఉండేందుకు, మరియు కేర్ ఫుల్ జీవితాన్ని కోరుకుంటారు. వీటన్నింటి కారణాల వల్ల వీరు మనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీరు కేవలం ఎక్కువ మనీ కోసం ప్రేమలో పడతారు. అయితే ఈ రాశిలోని కొందరు తమ రొమాంటిక్ లైఫ్ కు మనీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే.. అలాంటి వాటి నుండి బయటపడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ధైర్యానికి మారు పేరు. వీరు ఎప్పుడూ ఒక కింగ్ లా జీవించాలని ఆశిస్తుంటారు. అందుకే వీరు కూడా రాజభవనం లాంటి ఇంటితో పాటు విలాసవంతమై విల్లాలు, ఖరీదైన కార్లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటారు. మరోవైపు ఈ రాశి వారు ఎలాంటి రిస్క్ లేకుండా నిజాయితీగా ఉండే ప్రేమ కావాలని ఆశిస్తారు. అంతేకాదు అలాంటి ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటారు. అలాగే వీరు జీవితాంతం ప్రేమలో ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో వీరు విలాసవంతమైన భవనాల్లో విందులు, వినోదాలు ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భావిస్తారు. వీటన్నింటి కారణాల వల్ల వీరికి తెలియకుండానే ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు కేవలం మనీ కోసమే లవ్ లో పడతారట. వృశ్చిక రాశి వారు తాము ఎల్లప్పుడూ అందరికంటే ఎత్తులో ఉండాలని.. తమను తాము ఉన్నత స్థానాలలో చూసుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు వీరు పోటీతత్వాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడతారు. మరో విశేషమేమిటంటే.. వీరు ప్రతిసారీ ఫస్ట్ ప్లేసులో ఉండేందుకు ప్రయత్నించడమే కాదు.. అందులో సఫలం కూడా అవుతారు. ఈ రాశి వారు తమ విజయ రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకుంటారు. కొన్ని విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతారు. అయితే వీరు ఎవరినైనా ప్రేమిస్తే.. జీవితాంతం వారితోనే కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. ఎవరి నుండి అయినా గిఫ్టులు తీసుకోవడం.. ఏదైనా ప్రైజ్ మనీ గెలవడం వంటి విషయాలు వీరికి చాలా ఆనందాన్నిస్తాయి.

మీ నక్షత్రాన్ని బట్టి 2021లో మీకు ఎలా ఉండబోతుంది..ఇక్కడ చూడండి ..

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు జీవితంలో ఎక్కువ సాహసం మరియు రిస్క్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే వీరు థ్రిల్, అడ్వెంచర్ వంటి విషయాలను చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా వీరు తమ లక్ష్యాలు సాధించడానికి, లేదా తమ జీవితాన్ని గొప్పగా మలుచుకోవడం కోసం ఎక్కువగా ఇష్టపడతారట. వీరు కొత్త ప్రాంతాలను, సరికొత్త వస్తువులను ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారట. అందుకే వీరి ఇష్టాలు, అలవాట్లు, అభిరుచుల కారణంగా వీరు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరిలో కొందరు ధనం కంటే మనసులో నిజాయితీగా ఉండే ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు తమ లైఫ్ కి సంబంధించిన ఏ విషయమైనా చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. కొందరి మాదిరిగా వీరికి, పగటి కలలు కంటూ కూర్చోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా పని అనుకున్నామంటే.. అది ఎంత కష్టమైనా చేసి తీరాల్సిందే.. లక్ష్యం చేరేందుకు.. తమ కలలను సాకారం చేసుకునేంత వరకు వీరు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. అంతేకాదు వీరికి ముందు చూపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా రాజీ పడకుండా ముందుకు సాగాలని భావిస్తారు. ఈ లక్షణమే వీరి భాగస్వామి ఎంపికలో కనిపిస్తుంది. వీటన్నింటి కారణాల వల్ల వీరు డబ్బు కోసం ప్రేమలో పడతారంట.

గమనిక : ఈ సమాచారం మొత్తం జ్యోతిష్యశాస్త్ర నిపుణుల అంచనాలు మాత్రమే. అందరికీ ఇలాంటి లక్షణాలు ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఎవరికైనా వారు పుట్టి పెరిగిన ప్రాంతం, చుట్టుపక్కల వాతావరణం బట్టి వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, శైలి ఆలోచనలు ఉంటాయని గమనించగలరు.

English summary

These Zodiac Signs Most Likely to Fall in Love for Money in Telugu

Here are these zodiac signs most likely to fall in love for money in Telugu. Take a look.