For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామిని మళ్లీ ప్రేమలో పడేయాలంటే... ఇలా ట్రై చెయ్యండి...!

మీ భాగస్వామిని మరోసారి ప్రేమ అనే మత్తులో ముంచేందుకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమలో ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడరు. అయితే కొంతమంది మాత్రం తాము తమ భాగస్వామిని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నామని, వారికి మాత్రం తమపై ప్రేమ తగ్గిపోయిందని బాధపడుతూ ఉంటారు.

Things You Can Do To Make Your Partner Fall In Love With You Once Again

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సమయం మారుతుంది.. పరిస్థితులు మారుతాయి కాబట్టి. మీ భాగస్వామిలో కూడా మార్పు అనే సహజమే. అయితే మీ భాగస్వామి మీపై ఎప్పటికీ మీ ప్రేమను చూపించాలంటే.. మీరు కొన్ని పనులు చేయాలి. ఈ ప్రపంచంలో రిలేషన్ షిప్ లో ఉండటం అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్.

Things You Can Do To Make Your Partner Fall In Love With You Once Again

అయితే రిలేషన్ షిప్ లో తొలి రోజుల్లో ఉండే ఆప్యాయత, అనురాగం ఎంతో మధురమైన ఘట్టాలుగా మిగిలిపోతాయి. ఒకప్పుడు ఒకరిని వదిలి ఒకరు విడిచి ఉండాలంటే ప్రాణం పోయినంతలా ఫీలయ్యేవారు. మీరు ఎప్పుడూ మీ భాగస్వామి గురించే ఆలోచించేవారా? మీ పార్ట్ నర్ కోసం ఎదురు చూసేవారా? అయితే ఇదంతా ముణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయిందా?

Things You Can Do To Make Your Partner Fall In Love With You Once Again

కొన్ని రోజులు లేదా నెలల తర్వాత మీ ఇద్దరికీ రిలేషన్ షిప్ విషయంలో బోర్ కొడుతోందా? అయితే దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి... వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుని.. మీ భాగస్వామిని మరోసారి ప్రేమలో పడేయండి. అందుకోసం కొన్ని మార్గాలను మీ కోసం తీసుకొచ్చాం. అవేంటో చూసేయండి.

ప్రేమ కనిపించకపోతే..

ప్రేమ కనిపించకపోతే..

మీ భాగస్వామి మీతో మరోసారి ప్రేమలో పడటానికి మరియు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే, మీరు ప్రేమను ఎక్కడ మిస్సవుతున్నారో గ్రహించాలి. ఇది మీ అజ్ణానమా లేదా మీ బిజీ షెడ్యూలా? ఇవి ఎప్పటికీ అంతం కాలేవా? మీరు మరియు మీ భాగస్వామి దూరం అయ్యేందుకు గల కారణాలేంటో కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే మీ సమస్యను పరిష్కరించలేరు.

పార్ట్ నర్ తో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి..

పార్ట్ నర్ తో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి..

మీ ఇద్దరి రిలేషన్ షిప్ లో దూరమయ్యేందుకు గల కారణాన్ని మీరు కనుగొనాలి. ఆ తర్వాత మీ భాగస్వామితో ఏమి మాట్లాడాలో గుర్తుంచుకోండి. ఓపెన్ మైండ్ తో హెల్దీ కమ్యూనికేషన్ చేయండి. ఇది మీ సంబంధానికి మీ కీలకమని తెలుసుకోవాలి. మీరు గతంలో ఒకరితో ఒకరు కలిగి ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకోండి. మీరిద్దరూ ఏవేవి ఇష్టపడతారో.. మీకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయో వాటి గురించి మాట్లాడొచ్చు. ఇలా మీరిద్దరూ మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవచ్చు.

ఒకరితో ఒకరు ఎక్కువగా..

ఒకరితో ఒకరు ఎక్కువగా..

మీ సంబంధం యొక్క ప్రారంభం మరియు సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకోండి. ముందుగా మీరు నాణ్యమైన సమయాన్ని వెచ్చించేవారు మరియు ఒకరికొకరు కలిసి ఎక్కువగా జీవించేందుకు ప్రణాళికలు రచించాలి. మీ సంబంధంలో కోల్పోయిన ప్రేమను తిరిగి తీసుకురావడానికి ఇలాంటి పనులు చేయొచ్చు. లేదా అతను/ఆమెను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లొచ్చు. దీని వల్ల పాస్ట్ లైఫ్ యొక్క స్వీట్ మెమోరీస్ గుర్తొస్తాయి.

సర్ ప్రైజ్ చేయండి..

సర్ ప్రైజ్ చేయండి..

మీ భాగస్వామి మీతో మరోసారి ప్రేమలో పడటానికి ఇది మీకు కచ్చితంగా సహాయపడుతుంది. కొన్ని ఆశ్చరపరిచే బహుమతులు ఇచ్చి అతనిని/ఆమెను సర్ ప్రైజ్ చేయండి. మీరు మళ్లీ ప్రేమ లేఖలు, అందమైన పువ్వులు, డ్రెస్ వంటివి ఇవ్వొచ్చు. అవి ఇచ్చేటప్పుడు మీ ఫేసులో చిరునవ్వును మాత్రం మరువకండి.

ఏది ఇష్టమో గౌరవించండి..

ఏది ఇష్టమో గౌరవించండి..

మీ భాగస్వామిని మీరు మరోసారి ప్రేమించేలా చేయడానికి మీరు అతను/ఆమె యొక్క ఇష్టయిష్టాలను గౌరవించడం చాలా అవసరం. మీరు మీ భాగస్వామికి ఇంట్రస్ట్ ఉండే వాటిని పట్టించుకోకపోతే మీరు ఎప్పటికీ వారిని ప్రేమించలేరు. ప్రేమించబడలేరు. మీ భాగస్వామిని ప్రేమించడం అంటే మీ ఎంపికలు, ప్రాధాన్యతలు మరియు అభిప్రాయాలను మీ భాగస్వామిపై కాదని గుర్తించాలి.

ఇష్టమైన ఫుడ్..

ఇష్టమైన ఫుడ్..

మీ భాగస్వామి మీతో మరోసారి ప్రేమలో పడాలంటే మరో మార్గం వారికిష్టమైన ఫుడ్ తయారు చేయడం. దీని వల్ల మీరు చేసిన ప్రయత్నంలో కచ్చితంగా విజయం సాధిస్తారు. దీని వల్ల మీరు మీ భాగస్వామి ఇష్టాలు మరియు అయిష్టాలను పట్టించుకుంటారని తెలుస్తుంది.

సడన్ పార్టీ..

సడన్ పార్టీ..

మీ భాగస్వామితో మీరు బయటకు వెళ్లేందుకు ముందుగా ప్లాన్ చేయండి. అయితే మీ భాగస్వామికి మాత్రం సడన్ గా పార్టీ అని చెప్పండి. మీరు వెళ్లే చోట కొవ్వొత్తి లేక తేలికపాటి విందు కూడా ప్లాన్ చేయండి. ఇలాంటి సీక్రెట్లను మీరు బాగా ఆస్వాదించొచ్చు.

సెకండ్ షో సినిమా..

సెకండ్ షో సినిమా..

మీ భాగస్వామితో కలిసి సెకండ్ షో సినిమా చూడటం వల్ల కూడా మీరు మరోసారి ప్రేమలో పడటానికి సహాయపడుతుంది. మీరిద్దరూ కలిసి సినిమాలు చూసి నాణ్యమైన సమయం గడిపి చాలా అయ్యి ఉంటే, మీరు తప్పక దాని కోసం వెళ్లాలి. మీరు సినిమా కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన సినిమాలను మీ ఇంట్లోనే మీ స్మార్ట్ టీవిలో నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ సీరిస్ లో చూడొచ్చు. దీని వల్ల మీ ఇంట్లో సరికొత్త వాతావరణం ఏర్పడుతుంది. అదే సమయంలో మీ గదిని అందంగా అలంకరించొచ్చు. కొన్ని సువాసన గల కొవ్వొత్తులను, పాప్ కార్న్ బకెట్, సమోసా వంటివి సిద్ధం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరిద్దరూ ఒకరికొకరు బాగా చొచ్చుకుపోవచ్చు.

కొంత ప్రైవసీ..

కొంత ప్రైవసీ..

మీ భాగస్వామి మీతో మరోసారి ప్రేమలో పడాలని మరియు అతని/ఆమె పట్ల ప్రేమను చూపించాలనుకుంటున్నందున, మీరు ఎల్లప్పుడూ మీ భాగస్వామి చుట్టూ తిరుగుతారని కాదు.. మీరు వారికి కొంత ప్రైవసీ ఇవ్వాలి. మీరు 24 గంటలు వారిని అతుక్కొని ఉండకండి. ఇది చాలా చెడ్డ ఆలోచన. ఇది మీ భాగస్వామిని చికాకు పెట్టొచ్చు కూడా.

మీ భాగస్వామిని అభినందించండి..

మీ భాగస్వామిని అభినందించండి..

మీ భాగస్వామి మీతో ప్రేమలో పడాలంటే.. మీలోని రొమాంటిక్ యాంగిల్ ను బయటపెట్టాలి. ఇది ఒక ఉత్తమ మార్గం అని చెప్పొచ్చు. ముఖ్యంగా అతన్ని/ఆమెను మెచ్చుకోవడం.. అభినందనలు తెలపడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామిపై మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీ భాగస్వామి మీతో మరోసారి ప్రేమలో పడేలా చేస్తుంది.

అభిరుచులపై ఆసక్తి..

అభిరుచులపై ఆసక్తి..

మీ భాగస్వామి యొక్క అభిరుచులపై మీరు ఆసక్తి చూపాలి. మీ ఇద్దరు రిలేషన్ షిప్ లో చాలా చురుకుగా ఉండాలి. మీ సంబంధంలో ప్రేమను తిరిగి పొందేందుకు ఇది సహాయపడుతుంది. మీ భాగస్వామి పుస్తకాలను చదవడానికి ఇష్టపడితే మరియు మీరు వాటిలో కొన్నింటిని చదవాలని కోరుకుంటే, దాని కోసం వెళ్లండి. అంతేకాదు, మీ అభిరుచులపై ఆసక్తి చూపమని మీ భాగస్వామిని ప్రోత్సహించండి. అయితే మీరు ఈ విషయాలపై బలవంతం చేయరాదు.

ఇంకా ప్రేమిస్తున్నారని..

ఇంకా ప్రేమిస్తున్నారని..

మీరు మీ భాగస్వామిని నిజంగా ప్రేమిస్తుంటే, అప్పుడు మీ ఫీలింగ్స్ ను వ్యక్తపరచడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మీ భాగస్వామి పట్ల మీకెంత ప్రేమ ఉందో తెలియజేయండి. మీరు అతన్ని/ఆమెను ఎల్లప్పుడూ ప్రేమిస్తారని తెలియజేయండి. ఇందుకోసం మీరు పని నుండి వచ్చిన తర్వాత మీ భాగస్వామిని హగ్ చేసుకోవచ్చు లేదా నిద్రించే ముందు తియ్యని ముద్దు పెట్టొచ్చు. కూర్చున్నప్పుడు లేదా కలిసి నడుస్తున్నప్పుడు చేతులు పట్టుకోవచ్చు. ఇదొక్కటే మీ పార్ట్ నర్ తో మంచి కబుర్లు చెప్పొచ్చు. ఇలాంటివి మీ సంబంధంలో కచ్చితంగా అద్భుతాలు చేస్తాయి.

చిన్న ప్రయాణాలు..

చిన్న ప్రయాణాలు..

మీరు మీ పిల్లలను, కుటుంబాన్ని చూసుకోవడంలో మరియు మీ పనికి ఎక్కువ సమయం ఇవ్వడంలో ఎల్లప్పుడూ బిజీగా ఉంటే, అప్పుడు విశ్రాంతి తీసుకోండి. కొన్ని చిన్న ప్రయాణాలు చేయండి. మీ భాగస్వామితో కొంత సమయం గడపడం, మీ పని మరియు కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల మీరు కోల్పోయిన ప్రేమను తిరిగి తీసుకురావడంలో మరియు మీ భాగస్వామి మీతో మరోసారి ప్రేమలో పడటానికి కచ్చితంగా మీకు సహాయపడతాయి.

చివరగా మీరు ఏమి చేసినా.. ప్రతి సంబంధంలో పారదర్శకత తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి. మీరు ఒకరినొకరు విశ్వసిస్తున్నారని ఆమెకు/అతనికి తెలియజేయండి. మీ భాగస్వామికి నిజమైన ప్రేమ, గౌరవం మరియు శ్రద్ధ చూపండి.

English summary

Things You Can Do To Make Your Partner Fall In Love With You Once Again

Do you feel your partner doesn’t love you like before? Are you willing to find ways to make your partner fall in love with you once again? Well, don’t worry about it as help has arrived. Do these things to make your partner fall in love with you.
Story first published:Thursday, October 8, 2020, 17:50 [IST]
Desktop Bottom Promotion