For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఇష్టపడే వారి నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇవి ట్రై చెయ్యండి...

|

మీరు ఎవరినైనా నిజాయితీగా ప్రేమించినప్పుడు, మీకు ఆ వ్యక్తితో అకస్మాత్తుగా సంబంధం తెంచుకోవాల్సి వస్తే మీరు చాలా భావోద్వేగానికి గురవుతారు. మీరు ఇలాంటి విషయాన్ని కలలో కూడా ఊహించి ఉండరు. అయితే కొంతమందికి ఏదైనా విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు, అనారోగ్యం, విడాకులు లేదా విడిపోయిన సమయంలో వారి మనసు ఎంతగా గాయపడుతుందో వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు.

Let Go Of Someone You Love

ఎందుకంటే ఆ విడిపోయేందుకు గల కారణం యొక్క నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇలాంటి బాధలను లేదా నొప్పిని అధిగమించేందుకు జీవితకాలం కూడా సరిపోదని చెబుతుంటారు. అయితే మీరు ఇలాంటి పెయిన్ ను కూడా సులభంగా అధిగమించేందుకు ఉన్న చిట్కాలు మరియు మీరు ఎంతగానో ప్రేమించిన వారిని వదిలేయడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎందుకు ముగిసిందో..

ఎందుకు ముగిసిందో..

మీరు రిలేషన్ షిప్ లో విడిపోయినప్పుడు మొట్టమొదట మీరు ఈ విషయాన్ని గుర్తించాలి. మీ సంబంధం ఎందుకు ముగిసిందో.. ఏ తప్పు జరిగిందో ముందుగా మీరు గ్రహించాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. నిరంతరం గొడవలు మరియు అపార్థాలు లేదా ఏదైనా విషాదకరమైన సంఘటనా? మీ విభజన వెనుక కారణం ఏమైనప్పటికీ, మీరు దానిని అంగీకరించాలి. మీరు విడిపోవడానికి గల కారణాలను గుర్తించకపోతే, మీరు మీ భాగస్వామిని విడిచిపెట్టలేరు. మీరు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

కన్నీళ్లు తగ్గించాలి..

కన్నీళ్లు తగ్గించాలి..

మీరు విడిపోయిన సమయంలో మీ బాధ అంతా మీ ముఖంలో కనిపిస్తుంది. అప్పుడే మీ కళ్లలో నుండి నీరు వరదలా ఉబికి ఉబికి వస్తూనే ఉంటుంది. అయితే మీరు నిరాశ చెందుతున్నారని అర్థం చేసుకోవాలి. మంచి మరియు చెడు క్షణాల గురించి మీరు భావోద్వేగాలతో మునిగిపోవచ్చు. అలాంటి సమయంలో మీరు కన్నీళ్లను ఆపుకుంటే పరిస్థితి చాలా కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీకు ఏడుపు వస్తే ఏడ్చేయండి. అయితే అలాంటి చెడు విషయాలను మరచిపోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు జీవితంలో ముందుకు సాగగలరు.

కీలకమైన దశ..

కీలకమైన దశ..

మీరు ఎంతగానో ఇష్టపడే లేదా ప్రేమించే వ్యక్తితో విడిపోవటానికి ఇది కీలకమైన దశ అని చెప్పొచ్చు. ముందుగా అతనితో ఉన్న పరిచయాలన్నీ తగ్గించాలి. ముఖ్యంగా అతని/ఆమె ఫోన్ నెంబర్ ను డిలీట్ చేయాలి. అలాగే వారికి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్లను కూడా తొలగించాలి. ఇలాంటివి మీ మనసుకు అయిన గాయం నుండి కోలుకునేందుకు కొంత సహాయపడవచ్చు.

మునుపటిలాగా కలిసి ఉండటం..

మునుపటిలాగా కలిసి ఉండటం..

మీరిద్దరూ మునుపటిలాగా కలిసి ఉండటం లేదని, మీరిప్పుడు విడిపోయినట్లు మీరు అంగీకరించాలి. మీరిద్దరూ సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ, అలాంటి సంబంధం శాశ్వతం కాదని కూడా గుర్తించాలి. అప్పుడు మీరు ముందుకు సాగడం సులభంగా అవ్వొచ్చు.

గతాన్ని వదిలేయండి...

గతాన్ని వదిలేయండి...

మీరు ఇష్టపడే వ్యక్తి లేదా ప్రేమించే వ్యక్తిని మీరు వదులుకోవడం అంటే.. మీరు వారిని వదిలేసి మీ జీవితంలో ముందుకు వెళ్లడమే. నిజానికి ఇలాంటిది గతాన్ని వదిలేయడమే. మీరిద్దరూ తరచూ కలిసి గడిపిన ప్రదేశాలను సందర్శిస్తే, మీకు బాధ మరియు నొప్పి కలుగుతుంది. అందుకే గతాన్ని వదిలేయడం మంచిది.

సానుకూలంగా ఆలోచించాలి..

సానుకూలంగా ఆలోచించాలి..

మీ సంబంధం శాశ్వతంగా లేనందున, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని కాదు. ఏమి జరిగిందనే దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలాంటివి జరగకుండా మీరు సానుకూలంగా ఆలోచించాలి.

మీ స్నేహితుల పాత్ర..

మీ స్నేహితుల పాత్ర..

మీరు మీ పాత విషయాలను మరచిపోవాలంటే.. మీరు మీ స్నేహితులను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రేమించిన వారిని లేదా ఇష్టపడే వారిని విడిచిపెట్టడంలో వారు మీకు కచ్చితంగా సహాయపడగలరు. దీని వల్ల మీకు కఠినమైన సమయాలు కూడా సులభతరం అయ్యే అవకాశం ఉంటుంది.

ఆనందం కోసం చూడండి...

ఆనందం కోసం చూడండి...

మీరు మీ సంబంధాన్ని విడిచిపెట్టినప్పటి నుండి దాదాపుగా నిరాశగా లేదా విచారంగా ఉంటారు. ఎందుకంటే మీరు మీ భాగస్వామి గురించి ఎన్నో కలలు కనే ఉంటారు. అయితే అవన్నీ మీ ఊహించని మలుపు తీసుకోవడంతో మీరు బాధపడొచ్చు. అంతమాత్రాన మీరు సంతోషంగా లేరని కాదు. మీరు ఆనందాన్ని అన్వేషించండి. మీకు ఏవైతే సంతోషం కలిగిస్తాయో అలాంటి పనులు చేయండి. మీ బాధను మరచిపోండి.

English summary

Tips That Can Help You To Let Go Of Someone You Love

Are you at a point in your life where you have to let go of the love of your life and make a fresh start? But leaving behind someone you have loved with all your heart, can be a difficult thing to do. So, here are some tips for you.
Story first published: Tuesday, March 24, 2020, 21:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more