For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామిలో శృంగార కోరికలను రేకెత్తించాలనుకుంటున్నారా?

|

మీరు మీ భాగస్వామితో శృంగార సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు ఎలాంటి ప్లాన్ లు వేస్తారంటే చాలా మంది ఇలా సమాధానాలు చెప్పారని ఓ సర్వేలో వెల్లడైంది. హనీమూన్ కు వెళ్లడం, మంచి దుస్తులతో ఆకర్షించడం, సరైన మేకప్ వేసుకోవడం మరియు శారీరక రూపాన్ని మెరుగుపరచుకోవడం వంటి విషయాలను చెప్పారట. ఈ విషయాలన్నీ శృంగార ఆకర్షణకు కొంతవరకు సహాయపడతాయి. కానీ వీటితో పాటు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయని అనేక మంది జంటలకు తెలీదట.

వీటి వల్ల కూడా మీకు మరియు మీ భాగస్వామికి మధ్య శృంగార సంబంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. కొన్నిసార్లు మీరు మాట్లాడే విధానం, మీ వ్యక్తిత్వం, మీ పని విధానం వంటివి కొన్నిసార్లు మీ భాగస్వామి మధ్య దూరం పెంచుతుంది అని కూడా రుజువైంది. దీని వల్ల శృంగారం పట్ల ఆకర్షణ తగ్గుతుందట. అలా కాకుండా ఉండాలంటే కింద ఉన్న చిట్కాలను పాటించండి.. మీ శృంగార ఆకర్షణ లక్షణాలను మరింత పెంచుకోండి.

శృంగార ఆకర్షణ..

శృంగార ఆకర్షణ..

విశ్వాసం, నిజం అనేవి వ్యక్తి యొక్క రెండు మంచి లక్షణాలు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ లక్షణాలను మరచిపోకూడదు. మీ భాగస్వామిపై నమ్మకం మీ సంబంధాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలో మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే విశ్వాసం చూపండి. ఇలాంటివి మీ శృంగార బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అలాగే మీ శృంగార ఆకర్షణను కూడా పెంచుతుంది.

డబుల్ మీనింగ్స్ వద్దు..

డబుల్ మీనింగ్స్ వద్దు..

మీరు చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన ఒకరి దృష్టిని ఆకర్షించలేరు.హాస్యం లేదా జోక్స్ అనే ఉపాయం ఎల్లప్పుడూ పని చేయదు. ఎందుకంటే ఒక జోక్ లో సరైన పదాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు స్మార్ట్ మరియు తెలివైన వ్యక్తి అయితే మీరు వేసే జోక్స్ లో డబుల్ మీనింగ్స్ మరియు లింగ ఆధారితం వంటివి లేకుండా చూసుకోవాలి. అందుకు ప్రత్యామ్నాయంగా సరైన పదాలను వాడాలి. అదే సమయంలో మీరు పూర్తి సరైన జ్ఞానం కలిగి ఉన్న వాటిపై మాట్లాడతారు. ఎందుకంటే మీ శృంగార ఆకర్షణకు నీరసం ప్రతికూలంగా ఉంటుంది.

శృంగార విషయంలో సున్నితంగా..

శృంగార విషయంలో సున్నితంగా..

మీరు మీ భాగస్వామితో తెలివిగా ప్రవర్తించడం వంటివి చేస్తే మీ శృంగార ఆకర్షణ పాడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మీ స్వభావం అయితే మీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వొచ్చు. అందుకే శృంగారం విషయంలో సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది మాత్రమే కాదు. వినయపూర్వక స్వభావం ఉన్నవారు ఎక్కువగా ఆకర్షితులవుతారని శాస్త్రీయంగా నిరూపించబడింది. అదే సమయంలో, రూడ్ కామెంట్ మరియు మోసపూరితమైనవి లవ్ హార్మోన్స్ యొక్క విరోధులు అని మీరు గుర్తుంచుకోవాలి.

ఆకర్షణీయమైన స్వరం..

ఆకర్షణీయమైన స్వరం..

ఈ రోజుల్లో చాలా సంబంధాలు ఫోన్లలో వాయిస్ వల్ల విచ్ఛిన్నమవుతున్నాయి. అందుకే వాయిస్ మంచిది కాకపోతే మీ రిలేషన్ పట్ల ఎంతటి ప్రతికూల ప్రభావం ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఇదే అంశంపై జర్నల్ సర్వేలో సెక్సీ, హస్కీ, లోతైన మరియు ఉత్సాహంతో ఎవరినైనా ఆకర్షించవచ్చని వెల్లడించారు. ఆకర్షణీయమైన స్వరం కూడా ఫేస్ టు ఫేస్ సమావేశంలో మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటుంది. మీ వాయిస్ నిస్తేజంగా తక్కువ బేస్ తో ఉంటే, మీపై ప్రతికూల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు శృంగార ఆకర్షణను పెంచాలి అనుకుంటే, ఉదయాన్నే మీరు గార్గ్లింగ్ చేయండి. ఇది మీ స్వరాన్ని సెక్సీగా మార్చడానికి చాలా సహాయపడుతుంది.

మేకప్ తో మెరుగులు..

మేకప్ తో మెరుగులు..

మీరు మీ భాగస్వామితో శృంగార క్షణాలను ఎక్కువగా పొందాలను మీ ముఖానికి సంబంధించి మేకప్ ను పెంచాలి. దీని వల్ల మీ భాగస్వామి ఆకర్షితులు అవుతారు. అయినా కూడా సాధారణ రూపాన్ని కలిగి ఉంటే అలాంటి వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ముఖ అందానికి సంబంధించి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. వాటితో మీరు మీ రూపాన్ని మెరుగుపరుచుకోవచ్చు. పురుషులు గడ్డం స్టైలిష్ గా చేయగలిగినట్లయితే, మహిళలే మంచి మేకప్ వేయడం ద్వారా వారు తమను తాము మెరుగ్గా ప్రదర్శించుకోగలరు. ఇదొక్కటే కాదు రోజుకు రెండుసార్లు చూయింగ్ గమ్ యొక్క సెక్స్ అప్పీల్ తదుపరి స్థాయికి పెరుగుతుందని పరిశోధనలో రుజువు చేయబడింది.

సృజనాత్మకత మంచిది

సృజనాత్మకత మంచిది

మీ సృజనాత్మకతతో మీరు మీ భాగస్వామి దృష్టిని పెంచుకోవచ్చు. ఈ సృజనాత్మకత లేకపోవడం మీ సంబంధాన్ని విసుగు తెప్పిస్తుంది. భాగస్వామిని ఆశ్చర్యపర్చడం మీ శృంగార ఆకర్షణను పెంచుతుందని సైన్స్ కూడా చెబుతుంది. సంగీత సృజనాత్మకత వంటి మీ సృజనాత్మకతను చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇది మహిళలను చాలా ఆకర్షిస్తుంది. మీ భాగస్వామి మీ పట్ల విసుగు చెందకుండా ఉండటానికి కొత్త దాన్ని ప్రయోగించడం చాలా ముఖ్యం.

సన్నిహితంగా మారడం..

సన్నిహితంగా మారడం..

రహస్యమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ద్వారా, అతను మంచంలో తన భాగస్వామికి చాలా ఆకర్షించగలడు. కానీ నిజ జీవితంలో మరింత మర్మంగా మారడం పని చేయదు. తక్కువ ఓపెన్ ఉన్నవారి కంటే తమ భాగస్వామితో బహిరంగంగా ఎంపిక చేసుకునే వ్యక్తులు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటారనే సిద్ధాంతానికి సైకాలజీ మద్దతు ఇస్తుంది. మీ ఆలోచనలు, భయాలు, అనుభవాలు మరియు అవరోధాల గురించి మాట్లాడటం మిమ్మల్ని శృంగార పరంగా మరింత దగ్గర చేస్తుంది.

వ్యవస్థీకృతంగా ఉండటం..

వ్యవస్థీకృతంగా ఉండటం..

దీన్ని చదవడం ద్వారా మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ మీ క్రమబద్ధమైన జీవనశైలి మీ ఇమేజ్‌ను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే మీ లుక్స్ బాగున్నప్పటికీ మీరు అస్తవ్యస్తంగా జీవిస్తున్నప్పటికీ, మీ ఇమేజ్ ప్రతికూలంగా ఉంటుంది. ఇది శృంగార ఆకర్షణకు ఇబ్బంది కలిగించొచ్చు.

English summary

Traits that increase your sex appeal

A little quirk here and a few raunchy moves there and you may think that your sex appeal can tantalise your partner. But do you know what can bring it crashing down?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more