For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి ప్రేమ బంధాలు చాలా అరుదు... మీది కూడా ఇలాంటి ప్రేమ బంధమేనా?

ఈ బంధంలో ఉన్న జంటను చూసిన ఎవరికైనా వీరు ఒకరి కోసం మరొకరు పుట్టారమో అనిపిస్తుంది. ఎందుకంటే వీరు భాగస్వామికి నచ్చేలా మారేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు.

|

బంధం.. అనుబంధం.. అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ చిన్నప్పుడు లేదా పెద్దయ్యాక అయినా ప్రేమ, స్నేహం వంటి బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే స్నేహ బంధం గొప్పదా.. ప్రేమ బంధం గొప్పదా అంటే చెప్పడం చాలా కష్టమే. అందుకే ప్రేమికులేమో ప్రేమ బంధమే గొప్ప అని అంటారు.

Types of Love Relationships

స్నేహితులు కూడా స్నేహ బంధం గొప్పది అని అంటూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో స్నేహబంధం.. ప్రేమబంధం రెండూ వేటికవే గొప్ప అని చాలా మంది చెబుతారు. అయితే స్నేహ బంధంలో దాదాపు ఒకే రకం ఉంటుంది. అయితే ప్రేమ బంధానికొచ్చేసరికి అనేక రకాలు ఉంటాయి. అలాంటి బంధాలు ఎన్ని ఉన్నాయో? వాటిలో ఏ రకమైన సంబంధాన్ని సులభంగా గుర్తించవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

సోల్ మేట్ బంధం..

సోల్ మేట్ బంధం..

ఈ బంధంలో ఉన్న జంటను చూసిన ఎవరికైనా వీరు ఒకరి కోసం మరొకరు పుట్టారమో అనిపిస్తుంది. ఎందుకంటే వీరు భాగస్వామికి నచ్చేలా మారేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు వారిలో ఉన్న లోపాలు, బలహీనతలను సైతం అంగీకరించి ఎల్లవేళలా వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు. వీరిద్దరూ ఒకరినొకరు అమితంగా ఇష్టపడతూ, ఎక్కువకాలం ప్రేమించుకుంటూ సంతోషంగా జీవించేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారే ‘‘మేడ్ ఫర్ ఈచ్ అదర్‘‘ అని అనిపించుకుంటారు.

వీరిద్దరూ తప్ప ఇంకెవ్వరూ..

వీరిద్దరూ తప్ప ఇంకెవ్వరూ..

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తొలిప్రేమ అనేది చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. వీరు మొదటిసారి ప్రేమలో పడినిప్పుడు వీరిద్దరూ తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరనే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరే కొత్త లోకంగా మారిపోతారు. వీరి ప్రేమ బంధంలో రాత్రి సమయాల్లో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఎవరికి కనిపించకుండా రహస్యంగా కలుసుకోవడం వంటివి చేస్తుంటారు. వీరు ప్రేమలో ఉంటే చాలా ఈ జగత్తునే జయించవచ్చు అన్న భావన వీరిలో ఉంటుంది. అయితే ఈ తరహా బంధాలు ఎంత కాలం కొనసాగుతున్నాయన్నది చెప్పడం కష్టమే! కానీ ఇది ప్రతి ఒక్కరి ప్రేమ జీవితంలో అనుబంధాలకు సంబంధించి ఎన్నో పాఠాలను నేర్పుతుంది.

భిన్నంగా ఉంటారు కానీ...

భిన్నంగా ఉంటారు కానీ...

మీరు కొన్ని ప్రేమ జంటలను పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ ఇద్దరి ఆలోచనలు, కార్యాచరణలు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. కానీ వీరిద్దరూ ప్రతిసారీ విభిన్నమైన స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒక బంధంలో ఎలా కలిసి ఉంటారో నిజంగా కాస్త ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే వీరిద్దరూ మాత్రం ఎవరి ప్రాధాన్యాలు వారు చూసుకుంటూనే కలిసి సంతోషంగా జీవనం ముందుకు సాగిస్తున్నారు.

స్నేహబంధమే కానీ..

స్నేహబంధమే కానీ..

ఈ తరహా ప్రేమ బంధాల్లో ఇద్దరూ స్నేహితులనే చెప్పుకుంటారు. కానీ ఒకరినొకరు మాత్రం ఫుల్లుగా ఇంప్రెస్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. తమ బంధం గురించి ఇద్దరికీ ఎవరి హద్దులు వారికి తెలిసినప్పటికీ అవతలి వ్యక్తి నుండి తమకు నచ్చింది పొందాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఇలాంటి బంధాలు కేవలం తాత్కాలికంగానే మిగిలిపోతాయి.

హానికర బంధాలు...

హానికర బంధాలు...

ఇలాంటి బంధాల నుండి బయటపడటం చాలా కష్టం. ఇలాంటి బంధాలు ఒక్కోసారి ఇవి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బంధంలో ఉండే ఇద్దరు వ్యక్తుల్లో ఇద్దరు కూడా ఒకరు మరొకరిని శారీరకంగా లేదా మానసికంగా లేదా రెండు విధాలుగానూ హింసిస్తూ ఉంటారు. కానీ తమ భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు వీరికి ఎక్కువ సమయం పడుతుంది. ఈలోపు వీరిలో కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, ఆత్మన్యూనతా భావం ఏర్పడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీని ఫలితంగా ఆ బంధం నుండి బయటపడలేక మానసికంగా కుంగిపోయి డిప్రెషన్ బారిన పడొచ్చు. కానీ ఒక్కసారి ఈ బంధం నుండి బయటపడి తమ జీవితాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకునే వ్యక్తి ఎవరైనా, తర్వాత ఏ సమస్యనైనా చాలా ధైర్యంగా ఎదుర్కోగలరు.

స్నేహితులే ప్రేమికులైతే..

స్నేహితులే ప్రేమికులైతే..

ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులే! కానీ వారిద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారన్న విషయం వారికి తప్ప చుట్టుపక్కల ఉన్న వారికి అంతా తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులను మనం కూడా మన జీవితాల్లో చాలా మందిని చూస్తూనే ఉంటాం. చూడటానికి చాలా క్యూట్ గా అనిపించే ఈ తరహా బంధంలో ఒకరి గురించి మరొకరు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

పరిణితి చెందిన మనసులు..

పరిణితి చెందిన మనసులు..

వైవాహిక సంబంధం సంతోషంగా ఉండాలంటే అందుకు పరిణతి చెందిన మనస్తత్వం కలిగి ఉండాలి. ఇలాంటి మనసులు ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ఒక్కటైతే వారి బంధం నిత్య నూతనంగానే కొనసాగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ బంధానికి విలువ ఇస్తూ దానిని సంరక్షించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇలాంటి బంధాలే చివరివరకు కొనసాగుతాయని చాలా మందికి నమ్మకం.

English summary

Types of Love Relationships

Here we talking about the types of love relationships.Read on
Story first published:Friday, March 6, 2020, 18:41 [IST]
Desktop Bottom Promotion