For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలు పాటిస్తే మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లి సులభమవుతుందని మీకు తెలుసా..

|

పెళ్లి అంటే నూరేళ్ల పంట అన్నాడు ఒక కవి. కళ్యాణం అనగానే మన కళ్ల ముందు ఎన్నో కమనీయ దృశ్యాలు మెదులుతుంటాయి. పచ్చని గడపలు, మామిడి తోరణాలు, భాజా భజంత్రీలు, పట్టుచీరలతో కలర్ ఫుల్ గా కనిపించే మగువలు, ధగ ధగ మెరిసే నగలు, విందులు, వినోదాలు ఇలా ఇంకా ఎన్నో మధురక్షణాలను అనుభవించాలని ఎంతమందికో ఉంటుంది. ఒకప్పుడు పెళ్లి సంబంధాల కోసం పెళ్లిళ్ల పేరయ్యలను సంబంధించేవారు. కానీ కాలక్రమేణా వచ్చిన మార్పుల్లో వారిని సంప్రదించడమే మానేశారు. ఎవరికి వారు తమకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు.

When To Talk About Marriage With Your Boyfriend Or Girlfriend
 

కానీ కొంతమంది చాలా కాలం పాటు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ అదే సరైన సమయంలో మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే పరిస్థితులు చేయి జారి పోయే అవకాశముంది. చాలా మంది తమ భాగస్వామితో వివాహం గురించి గందరగోళ పడుతుంటారు. అలాంటి వారే కోసమే మీ భాగస్వామితో పెళ్లి గురించి మీరు గుర్తుంచుకోగలిగే, మాట్లాడగలిగే కొన్ని అంశాలను మీకు తెలియజేస్తున్నాం.

1) ఎంతగా విశ్వసిస్తున్నారో..

1) ఎంతగా విశ్వసిస్తున్నారో..

ఇంగ్లీష్ లో ‘‘ ఐ లవ్ యు‘‘ కంటే ‘‘ ఐ ట్రస్ట్ యు‘‘ అనే ఒక ప్రసిద్ధమైన సామెత ఉంది. ఎందుకంటే మీరు ప్రేమించే వ్యక్తిని మీరు ఎప్పుడూ మీరు విశ్వసించాల్సిన అవసరం లేదు. కాని మీరు గుడ్డిగా విశ్వసించే వ్యక్తిని మీరు ఎల్లప్పుడూ ప్రేమిస్తారు. ఒక వ్యక్తితో కొన్ని సంవత్సరాల వరకు గడిపిన తర్వాత కూడా, మీరు మీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. విశ్వాసం సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది లేదా కనెక్ట్ చేస్తుంది. కాబ్బటి పెళ్లికి సంబంధించిన అంశంపై చొరవ తీసుకునే ముందు, మీరు మీ భాగస్వామిని ఎంతగా విశ్వసిస్తున్నారో పరిశీలించండి.

2) మానసికంగా కనెక్ట్ అయితేనే..

2) మానసికంగా కనెక్ట్ అయితేనే..

కొత్త ప్రేమతో మీరు మానసికంగా ఎంత కనెక్ట్ అయ్యారో తెలుసుకోవాలి. అదేవిధంగా, పెళ్లి యొక్క ప్రారంభ క్షణాలు చాలా శృంగారభరితంగా ఉంటాయి. ఇది జంటలకు మరపురాని సమయంగా మిగిలిపోతుంది. కానీ దీని తర్వాత పాషన్ తగ్గడం వల్ల మీ జీవితంలో విసుగు కూడా పుడుతుంది. అందుకే భాగస్వాముల మధ్య భావోద్వేగ సంబంధం వారిని దగ్గరగా ఉంచే సమయం ఇది. వివాహం కోసం, మీరు మీ భాగస్వామితో మానసికంగా కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం.

3) ఆర్థికంగా ఆధారపడటం..
 

3) ఆర్థికంగా ఆధారపడటం..

ఆర్థిక స్థిరత్వం సాధించినా, మీరు ఆ డబ్బుతో ఆనందాన్ని కొనలేరు. కానీ మీకు సంతోషాన్నిచ్చే అలా వాటి కోసం షాపింగ్ చేయవచ్చు. వివాహం తీవ్రమైన నిర్ణయం. ఇక్కడ ఆర్థికంగా ఆధారపడటం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి ఖర్చుల నుండి మీకు అవసరమైన వాటి కోసం షాపింగ్ వరకు వివాహం తర్వాత ఇలాంటి ఖర్చులు రెండింతలు లేదా మూడింతలు అవుతాయి. మీరు వివాహం యొక్క నిర్ణయం తీసుకుంటుంటే, మొదట మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

4) విభేధాలను పరిష్కరించుకోండి..

4) విభేధాలను పరిష్కరించుకోండి..

ప్రేమ ఉండే చోట తగాదాలు లేదా చిన్న చిన్న గొడవులు కచ్చితంగా ఉంటాయి. కానీ ఈ వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలో మీరే ఆలోచించాలి. ఈ సంబంధాన్ని మీరు తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి. అపార్థం లేదా వివాహం తర్వాత వివాదం తర్వాత ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే సమయం పడుతుంది.

6) ఆ విషయం గురించి మీ భాగస్వామితో..

6) ఆ విషయం గురించి మీ భాగస్వామితో..

మీరు మీ భవిష్యత్ గురించి ఆలోచించినప్పుడల్లా మీరు మీ భాగస్వామి గురించే ఆలోచిస్తుంటే, మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి అంటే వివాహం అనే ఘట్టానికి సిద్ధమైనట్లు భావించొచ్చు. మనం జీవితంలో చాలా మందిని కలుస్తాం. కానీ కలలో ప్రత్యేకమైన వారిని మాత్రమే చూస్తాం. అలాంటి వారితో మీరు భవిష్యత్తులో గడపడానికి సిద్ధంగా ఉన్నారని మీకు కచ్చితంగా అనిపిస్తే ఆ విషయం గురించి మీ భాగస్వామికి చెప్పండి. ఆ తర్వాత వచ్చే సమాధానం కోసం మీరు కొంచెం ఎక్కువ సేపు ఓపికతో వేచి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భాగస్వామిని తొందర పెట్టకూడదు. తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయాన్నిఇవ్వాలి. మీకు సానుకూల సమాధానం వస్తుందనే పాజిటివ్ మైండ్ తో ఉండాలి.

English summary

When To Talk About Marriage With Your Boyfriend Or Girlfriend?

Here are some important factors to take into consideration before you have this big discussion with your lover.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more