For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ మాత్రం డేటింగును, ప్రేమను ఆపలేకపోతున్న కరోనా వైరస్...!

కరోనా వైరస్ ప్రేమికుల జీవితాలపైనా ఎక్కువగా ప్రభావం చూపుతోంది. అయితే కరోనా నుండి తమ ప్రేమను కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు కొత్త మార్గాన్ని కనుగొన్నారు.

|

ప్రస్తుతం ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తిని ట్రెండింగ్ లేదా వైరల్ టాపిక్ ఏదని అడిగితే టక్కున చెప్పే పేరు కరోనా వైరస్. ఎందుకంటే ఈ మహమ్మారి చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపించింది. ముఖ్యంగా ఇటలీ దేశస్థులకు దీని ప్రభావం ఎక్కువగా పడింది.

Yale Students Created Love

ఇప్పటికీ కొన్ని వేల మంది ఈ కరోనా భూతం బారిన పడి మరణించారు. ఆ దేశంలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దీంతో ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.
Yale Students Created Love

దాదాపు ప్రతి దేశం లాక్ డౌన్ దిశగా వెళ్తున్నాయి. ప్రజలందరినీ ఇళ్లలో ఉండాలని సూచిస్తున్నాయి. అంతేకాదు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కార్యాలయాలను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చాయి.
Yale Students Created Love

అమెరికాలో కూడా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేలకొద్దీ పెరిగిపోయాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఎవ్వరికైనా ప్రతిరోజూ ఇంట్లో ఉండాలంటే విసుగు వస్తుంది.
Yale Students Created Love

చాలా చిరాకుగా అనిపిస్తుంది. అయితే వీటి నుండి డైవర్ట్ అయ్యేందుకు కొంతమంది పాటలు పోటీలు లేదా వ్యాయామం లేదా డ్యాన్స్ వంటివి చేస్తుంటారు. ఇంకా కొంత మంది బాల్కనీలోకి ఒంటరిగా వెళ్లి పాటలు పాడుతూ ఉంటారు. అయితే ఇంకా కొంత మంది ఇండోర్ గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ప్రేమికులకు ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందిగా మారుతోంది. ఇది వారి ప్రేమ జీవితంపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతోంది. అయితే ఈ ప్రేమికుల బాధను పోగొట్టేందుకు అమెరికాలోని కొందరు విద్యార్థులు ఓ కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమపై ప్రభావం చూపకూడదని..

ప్రేమపై ప్రభావం చూపకూడదని..

సాధారణ జీవితానికి విఘాతం కలిగించే కరోనా వైరస్ యువత ప్రేమ జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. అయితే అమెరికాలోని యేల్ కు సంబంధించిన ఇద్దరు విద్యార్థులు కూడా దీనిని నివారించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఎలైట్ డైలీ వార్తల ప్రకారం, జూమ్ డేటింగ్ వెబ్‌సైట్‌ను తయారు చేయాలని పత్రిజా గోసార్కా తన స్నేహితురాలు ఇలియానా వాల్డెజ్‌తో అన్నారు.

కొత్త యాప్ క్రియేట్..

కొత్త యాప్ క్రియేట్..

అంతే వారంతా కలిసి కొన్ని గంటల ప్రయత్నం తరువాత 'లవ్ ఓవర్ జూమ్' అనే కొత్త యాప్ ను సృష్టించారు. ఈ అప్లికేషన్లో కళాశాల విద్యార్థులు వీడియో చాట్‌లో డేటింగ్ చేయవచ్చు. ఈ ఆలోచన మార్చి 12 అర్ధరాత్రి ప్రారంభమైంది మరియు మార్చి 13 నాటికి 2,200 మందికి పైగా విద్యార్థులు ఇందులో సైన్ అప్ చేశారు.

గూగుల్ సాయంతో..

గూగుల్ సాయంతో..

లవ్ ఓవర్ జూమ్ అనే కొత్త అనువర్తనం గూగుల్ మాదిరిగానే పని చేస్తుంది. ఇందులో ఇమెయిల్ ద్వారా కాలేజీ స్టూడెంట్స్ లాగిన్ అయ్యేవారు. మీకు ఎవరైతే నచ్చుతారో వారితో మీరు ఫ్రెండ్ షిప్ చేయొచ్చు. ఆ తర్వాత డేటింగ్ మరియు లవ్ కూడా చేసుకోవచ్చు. ‘‘మీరు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారా? భయపడకండి, జూమ్ మమ్మల్ని కలిసి ఉంచుతుంది‘‘.

మీమ్స్ కూడా..

మీమ్స్ కూడా..

అయితే దీనిపై అనేక మీమ్స్ కూడా వచ్చేశాయి. ‘‘జూమ్ నెమ్మదిగా మన జీవితాలను ఎలా స్వాధీనం చేసుకుంటుందనే దాని గురించి చాలా మంది విద్యార్థులు మీమ్స్ క్రియేట్ చేశారు‘‘ అని గోర్క్సా ఎలైట్ డైలీతో చెప్పారు.

English summary

Yale Students Created Love Over Zoom For Dating During Coronavirus Outbreak

How youngsters are dating in America during coronavirus outbreak. Here is the answer.
Story first published:Saturday, March 28, 2020, 19:05 [IST]
Desktop Bottom Promotion