For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను సెక్స్ మాత్రమే ఆశించట్లేదు.. నాకు ఇంకా చాలా కావాలి

సెక్స్ కు మించి ఇంకా చాలానే ప్రతి భార్యకు భర్త నుంచి కావాలి. తన దాంపత్య జీవితంలో ఎదురైన విషయాలను ఒక మహిళ ఇలా చెప్పుకుంది. వారిద్దరి మధ్య ఉన్న శృంగారం బాంధవ్యంతో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పింది.

By Bharath
|

దాంపత్యం బాగుంటేనే కుటుంబం ఎలాంటి కష్టాలకు గురికాకుండా ఉంటుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమాభిమానాలు ఉంటే చాలు దాంపత్యం చాలా బలంగా తయారవుతుంది. అన్యోన్యత ఉంటేనే సంసారం సుఖంగా ఉంటుంది భార్యకు భర్త నుంచి సెక్స్ మాత్రమే కావాలా అంటే అందుకు కాదనే సమాధానమే వస్తుంది. సెక్స్ కు మించి ఇంకా చాలానే ప్రతి భార్యకు భర్త నుంచి కావాలి. తన దాంపత్య జీవితంలో ఎదురైన విషయాలను ఒక మహిళ ఇలా చెప్పుకుంది. వారిద్దరి మధ్య ఉన్న శృంగారం బాంధవ్యంతో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పింది. ఇది కేవలం ఆ ఒక్క మహిళ స్టోరీనే కాదు. ప్రపంచంలో లక్షలాది మహిళలు ఇలాంటి అనుభవాలే కలిగి ఉంటారు.

పెళ్లి తర్వాత ప్రేమ

పెళ్లి తర్వాత ప్రేమ

మా ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లియ్యాక మొదలైంది. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. భార్యభర్తలు ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉన్నా, కొన్ని సార్లు వ్యక్తపరచటానికి చాలా ఇబ్బంది పడతారు. అలా కాకుండా భార్య లేదా భర్త ఇద్దరిలో దాచుకున్న భావాలను ఒకరితో ఒకరు చెప్పకోవటం చాలా మంచిది. దీని వల్ల దాంపత్య జీవితం మరింత బలపడుతుంది. మా ఆయనకు నాపై చెప్పలేనంత ప్రేమ. తను నన్ను చాలా ప్రేమిస్తాడు. కానీ ఏనాడు కూడా ఆ విషయం డెరెక్ట్ గా చెప్పడు. అదే మగాడి బలం... బలహీనత. నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన గుండె నిండా బాధ ఉంటుంది. కానీ పైకి కనపడనివ్వడు. నిజంగా మా ఆయన గ్రేట్.

గిఫ్ట్స్ కాదు.. కౌగిలింత చాలు

గిఫ్ట్స్ కాదు.. కౌగిలింత చాలు

మా ఆయన నాకు బర్త్ డే, ఇతర అకేషన్స్ అప్పుడు గిఫ్ట్స్ గిఫ్ట్‌లతో ప్రేమను వ్యక్తపరచటం కన్నా ప్రేమగా కౌగిలించుకుంటే చాలు అనుకుంటా. అందులో ఉండే ప్రేమ ఒక్క పెళ్లానికే తెలుస్తుంది. మా ఆయన ఎప్పుడోసారి అలా చేస్తుంటాడు. ఆ క్షణం నాలో ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఇది చాలు జీవితానికి అనిపిస్తుంది. ప్రతి భార్య భర్త నుంచి కోరుకునేది ప్రేమనే కదా.

చిలిపిగా ఉంటే చాలు

చిలిపిగా ఉంటే చాలు

ఇంట్లో ఎవరూ లేనప్పుడు మేమిద్దరమే ఉన్నప్పుడు కలిసి చాలా బాగా మాట్లాడుకోవాలనుకుంటా. కానీ మా ఆయన రొటీన్‌ విషయాలే చెబుతుంటాడు. దీంతో చికాకుగా అనిపిస్తుంది. కాస్త చిలిపిగా మాట్లాడితే ఈయన సొమ్ము ఏమైనా పోతుందా అని అనిపిస్తుంది. కానీ అలా ఆయన ఉండేది చాలా తక్కువ. సర్లే మా ఆయనకు ఏవేవో చికాకులుంటాయిగా అని నాకు నేను సర్దుకుపోతా.

పొగిడితే ఆయన సొమ్ము ఏం పోతది

పొగిడితే ఆయన సొమ్ము ఏం పోతది

ఎప్పుడు నాలో తప్పులు వెతకడమేనా. నేను కూడా అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూనే ఉంటా కదా. అప్పడు నన్ను పొగిడితే నీ సొమ్ము ఏమైనా పోతదా.. అని నా భర్తపై నాకు కోపం వస్తుంటుంది. కానీ నన్ను పొగిడేది చాలా తక్కువ సమయాల్లో. నైట్ నిద్రపోయే ముందు నా అందం గురించి కాస్త పొగుడతాడు.. ఎందుకంటే అప్పుడు నాతో అవసరం ఉంటుంది కదా. అందుకే నా భర్త నన్ను అప్పుడే మాత్రమే కాస్త బాగా పొగుతుంటాడు.

పిల్లలు

పిల్లలు

మా ఆయన నాకిచ్చిన గొప్ప వరం మా పిల్లలు. వారి వల్ల నాలో ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. వారి ఆలన పాలన చూసుకుంటూ ఉంటే చాలు అనిపిస్తుంది. నాకు అసలు టైమ్ తెలియకుండా గడిచిపోతుంది. నేను గర్భిణీగా ఉన్నప్పుడు మా ఆయన నన్ను చూసుకున్న తీరు నాకు ఇప్పటికీ గుర్తే. నా భర్త ప్రేమ అప్పుడు బయటపడింది. చాలా ప్రేమ ఉంది ఆయనకు నాపైన.

గొడవలు

గొడవలు

ప్రతి సంసారంలో గొడవలు తప్పకుండా వస్తాయి. ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. నా సంసారంలో కూడా అవి చాలానే ఉన్నాయి. ఏదో చిన్న విషయానికి మా ఆయనపై నాపై కోప్పడుతాడు. నాకు కోపం వస్తుంది. ఇక అంతే అది ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసా? ఆ కొట్లాటలో మా పెళ్ళి దుర్మూహూర్తం నుంచి మొదలు పెట్టి ఇప్పుడు జరిగిన సంఘటనల వరకు పొల్లు పోకుండా కొట్లాడుకుంటాం. మా కొట్లాటలో నియమం ఏమిటంటే కొట్లాడి కొట్లాడి అలసి ఆగిపోవాలే తప్ప మేమిద్దరం పోరు నుంచి నిష్క్రమించం. మాకు పెళ్లి చేసిన వాళ్లను కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటాం. ఫైనల్ గా మళ్లీ కలిసిపోతాం. అది వేరే విషయం లెండి.

సరదాగా ఎటైనా తీసుకెళ్తే బాగుంటుంది

సరదాగా ఎటైనా తీసుకెళ్తే బాగుంటుంది

మా ఆయన రోజూ ఆఫీసు పనులతో సతమతమవుతుంటారు. అప్పుడప్పుడూ సరదాగా బయట తిరిగి రావాలని నాకుంటుంది. ఏదైనా పార్క్ లేదా సినిమాకో, రెస్టారెంట్‌కో వెళ్లి ఎంజాయ్ చేస్తే బాగుండు అనిపిస్తుంటుంది. వీలైతే లాంగ్ ట్రిప్ వేస్తే ఇంకా ఫుల్ హ్యాపీ. ఫ్లైట్ లో ఏ సింగపూర్ కో లేదంటే బ్యాంకాక్ తీసుకెళ్తే చాలా ఆనందిస్తా. కానీ అలా ఇప్పటి వరకు చేయలేదులెండి. హనీమూన్ కు ఫారిన్ వెల్దాం అన్నాడు.. ఇప్పటి వరకు అతిగతీ లేదు. పిల్లలు కూడా పెళ్లిళ్లకు వచ్చారు. అలా చేస్తేనే మా ఆయనపై ప్రేమ ఉంటుందని కాదు. అలా చేయకున్నా ఆయనంటే నాకెంతో ఇష్టం.

డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది

డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది

ఆదివారం మాత్రమే మా ఆయన ఇంట్లో ఉంటాడు. అప్పుడు కూడా ఎవరంటే వాళ్లు ఫోన్ చేసి ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంటారు. ఫోన్ లిఫ్ట్ చేయకుంటే కొందరు నేరుగా ఇంటికే వస్తారు. నాకు ఆ రోజు ఆయనతో బాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. రూమ్ తలుపులు మూసివేసి ఫుల్ గా తనతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ ఎవడో ఒక గొట్టంగాడు వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు చాలా కోపం వస్తుంది.

నన్ను కాస్త ఓదార్చితే చాలు

నన్ను కాస్త ఓదార్చితే చాలు

అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి. అలాంటి వేళల్లో నన్ను కాస్త ఓదార్చితే చాలని భావిస్తా. నేను ఏడుస్తూ కూర్చొన్నప్పుడు.. కాసేపు నన్ను మా ఆయన ఓదార్చితే చాలు. మళ్లీ ఆయనంటే ఎక్కడలేని గౌరవం పెరగుతుంది. అప్పుడప్పుడు అలా కూడా మా ఆయన చేస్తుంటాడు.

సారీ చెబితే ఏమవుతుంది?

సారీ చెబితే ఏమవుతుంది?

మా ఆయన నన్ను ఏ కారణం లేకుండానే ఒక్కోసారి హర్ట్ చేస్తాడు. అందులో నా తప్పు లేదని తెలిశాక నాకు సారీ చెబితే ఆయన సొమ్ము ఏమైనా పోతుందా? జీవితకాలం కలిసి బతకాల్సింది మేమిద్దరమే కదా. ప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పుకోవడానికి అంత అహం అవసరమా? బయట మరివరికో అయితే సారీ ఈజీగా చెప్పేస్తాడు. భర్తకు భార్య, భార్యకు భర్త మంచి చేసినప్పుడు థాంక్స్‌ అని నోటితో చెప్పకపోయినా ఒక చూపుతోగాని, కంటి సైగతోగానీ చెప్పుకోవొచ్చు.

లేదంటే చిన్న స్పర్శతోగానీ సూచిస్తే కూడా మనస్సుకు ఎంతె హాయిగా ఉంటుంది. అలాగే సారీ కూడా నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.. దగ్గరకి వచ్చి తలనిమిరి, ఒక్క ముద్దు పెడితే చాలు కదా. అలాంటి క్షణాలతో జీవితమే ఒయాసిస్‌ లా మారిపోతుంది. నా భర్త అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాడులెండి. అందుకే ఆయనంటే చచ్చేంత ప్రేమ.

మా భర్త నాతోనే సెక్స్ చేయాలి

మా భర్త నాతోనే సెక్స్ చేయాలి

శృంగారం అనగానే మనలో చాలామంది ఛీ అదా అని అనుకుంటారేమో. నేను అలా అనుకోను. ప్రతి సంసారం దానిపైనే ఆధారపడి ఉంటుంది. నా భర్త నాతో సెక్స్ సరిగ్గా చేయలేకుంటే సంసారమే విచ్ఛిన్నం అవుతుంది. అలాగే నాతో కాకుండా వేరో మహిళలతో శృంగారంలో పాల్గొన్న మా దాంపత్యం మంటగలిసిపోతుంది.

అందుకే ప్రతి దాంపత్యంలో సెక్స్ అనే అంశం చాలా ముడిపడి ఉంటుంది. నాగరికత తెలసిన ఎవరూ కూడా శృంగారాన్నిఅసహ్యించుకోరు. శృంగారమనేది అన్యోన్యమైన ఆనందాన్నిచ్చే అంశం. అదేదో హడావుడిగా చీకట్లో ముగించెయ్యాలన్న తొందరపాటు ధోరణిలో ఉండకూడదు. నిజమైన శృంగారం ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలను ప్రోత్సహిస్తుంది. మొదట నా భర్త నాతో ఒకే ఒక్కసారి మాత్రమే సెక్స్ చేశాడు. తర్వాత చాలా రోజులు చేయలేదు.

పడకగదితో పోయే బంధం కాదుకదా

పడకగదితో పోయే బంధం కాదుకదా

జంతువుల మాదిరిగా మనం సంతానాన్ని కనేసి, సమాజానికి వదిలేసి వెళ్లిపోం కదా. మనుషుల విషయంలో పెంపకానికీ అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఇందులో స్త్రీపురుషులు ఇరువురికీ నిర్దిష్టమైన పాత్రలున్నాయి. కాబట్టి స్త్రీపురుషుల బాధ్యతలు పడక గదితో ముగిసిపోయేవి కాదు. తల్లిదండ్రులుగా ఆ తర్వాత కూడా వాళ్లు అంతకు మించిన బాధ్యతలను పోషించాల్సి ఉంటుంది.

అందుకే మన శృంగారానికి పద్ధతులు, నియమాలు పుట్టుకొచ్చాయి. వీటిని మనం కాదనలేం. అలాగని దురవగాహనల్లో కూరుకుపోలేం. శాస్త్రీయ దృక్పథంతో వీటన్నింటినీ పటాపంచలు చేసుకోకపోతే లైంగిక జీవితాన్ని ఆనందించాల్సినంతగా ఆస్వాదించలేమని చెప్పక తప్పదు.

సెక్స్ ఎలా అంటే చేస్తే ఒప్పుకోను

సెక్స్ ఎలా అంటే చేస్తే ఒప్పుకోను

సెక్స్ ను మా ఆయన ఎలా అంటే అలా చేస్తే నేను ఒప్పుకోను. అది ఆదరాబాదరగా కానిచ్చే పని కాదు. సెక్స్‌ అంటే కేవలం ఎంజాయ్ ఒక్కటే కాదు. ఆ టైమ్ లో నన్ను అర్థం చేసుకోవాలి. నా ఇష్టాలను గౌరవించాలి. అప్పుడే మేము ఇద్దరం సెక్స్‌ను మరింతగా ఆస్వాదిస్తాం. మాకు పెళ్లైన కొత్తలో అంతా కొత్తగా ఉండేది. బయటికి చెప్పకోలేక లోలోపలే మథనపడేదాన్ని.

నా భర్త అంగ ప్రవేశానికి నా సహాయం అవసరం విషయం కూడా అతనికి తెలియదు. నా అనుమతి లేకుండా నా సహకారం లేకుండా అందులో నాతో పాల్గొనలేడు కదా. అర్థవంతమైన సంబంధాల్లోనే అన్యోన్యత, ఆప్యాయతలుంటాయన్న విషయం నా భర్త కూడా తెలుసుకున్నాడు. ఇది నాకు బాగా ఆనందం కలిగించే విషయం.

ఇప్పటికీ సెక్స్ లో పాల్గొంటాం

ఇప్పటికీ సెక్స్ లో పాల్గొంటాం

ఇప్పటికీ మేమిద్దరం సెక్స్ లో పాల్గొంటాం. శృంగారానికి వయసేమీ ఉండదు. ముదుసలి వయసులో కూడా సెక్స్ ను ఆస్వాదించొచ్చు. ఇందులో తప్పేమీ లేదు. సెక్స్ అంటే కేవలం అది మాత్రమేకాదు నన్ను మా ఆయన స్పృశించటం, హత్తుకోవటం, చివరికి చేతి మీద చేయి వేసి ప్రేమగా నిమరటం కూడా సెక్స్ భావనే. అది కూడా చాలా సంతృప్తినీ ఇస్తుంది. నూరేళ్ల వయసులోనూ మా శృంగార జీవితం ఆనందంగా ఉండాలని కోరకుంటున్నాను. అయితే దాంపత్యం బాగా సాగాలంటే కేవలం సెక్స్ ఒక్కటే సరిపోదు. మీకు నేను సెక్స్ తో పాటు మీకు నేను చాలా విషయాలు వివరించాను. అవన్నీ ఉంటేనే జీవితం. ఇప్పటికీ నా జీవితం మా ఆయనతో చాలా హ్యాపీగా ఉంది.

అర్థం చేసుకుంటేనే జీవితం

అర్థం చేసుకుంటేనే జీవితం

పెళ్లి అనే బంధం అనుబంధంగా మారితేనే ఏ దాంపత్యమైనా ఆనందమయం అవుతుంది. ఒకరి ఇష్టాలు ఒకరు, ఒకరి అభిప్రాయాలను ఒకరు పరస్పరం అర్థం చేసుకుంటూ, ఒకరి పొరపాట్లను ఒకరు మన్నించుకుంటూ, ఒకరి నొకరు సరిచేసుకుంటూ, తమను తాము సరిచేసుకుంటూ జీవితాన్ని ముందుకునడిపించాలి. భార్యా భర్తల్లో ఏ ఇద్దరూ ఒకే సంప్రదాయాల నుంచి రారు. అందువల్ల సహజంగానే ఇద్దరి భావాలు వేర్వేరుగా ఉంటాయి. భార్యా భర్తలు దీన్ని అర్థం చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. పంతాలు, పట్టుదలలు, అహం పెంచుకుంటూ పోతే దాంపత్య జీవితం నాశనం అవుతుంది.

English summary

my story this long lasting relationship we just had intercourse only once

My Story: In This Long Lasting Relationship, We Just Had Intercourse Only Once!
Story first published:Friday, December 8, 2017, 13:44 [IST]
Desktop Bottom Promotion