మీ భార్య బాగా ఒత్తిడికి గుర‌వుతోందా? కార‌ణ‌మిదే అయ్యిండొచ్చు!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

మీ భార్య ఎప్పుడూ ఒత్తిడికి గురవుతూనే ఉంటుంద‌ని ఆశ్చ‌ర్యపోతున్నారా? అందుకు కార‌ణాల‌ను తెలుసుకోలేక‌పోతున్నారా? మీరు ఇంట్లో ప్ర‌శాంతంగా ఉండాలంటే మీకున్నది ఒకే ఒక్క ఆప్ష‌న్‌. మీ భార్య సంతోషంగా ఉండేలా చూడండి. మీరొక్క‌రే సంతోషంగా ఉంటే స‌రిపోదు.

మీ భార్య ఒత్తిడికి గురైతే ఆమెలోని ఫ్ర‌స్టేష‌న్ ను బ‌య‌ట‌కు తీసి ఉన్న కోపాన్నంతా ఒకేసారి కక్కేయ‌గ‌ల‌దు. అలా కాకుండా ఉండాలంటే ఆమెను సంతోష‌పెట్టేది ఏదో బాధ క‌లిగించేది ఏదో తెలిసి ఉండాలి. కాబ‌ట్టి మీ పెళ్లాం సంతోషంగా ఉండ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకోండి.

మీరు స్ట్రెస్ తో ఉన్నప్పుడు మీ అర్ధాంగితో ఎలా మాట్లాడాలి..?

reasons why your wife is stressed

Image Courtesy:Naomi August on Unsplash

అది ఆమె ఉద్యోగం కావొచ్చు, ఆమె కొలీగ్స్ వ‌ల్ల కావొచ్చు. ఆఫీసు రాజకీయాలు కావొచ్చు, మీ గెడ్డం కావొచ్చు, ఇంట్లో నీళ్ల ప‌రిస్థితి, వంటగ‌ది అశుభ్రంగా ఉండ‌డం, ప్లంబింగ్ ప‌ని స‌గంలో ఉండ‌డం.. ఇలా వివిధ కార‌ణాలు ఆమెను సంతోషంగా లేకుండా చేస్తాయి. మీ భార్య అల‌సిపోయి క‌నిపిస్తే ఆమె అలా ఎందుకు ఉందో క‌నుక్కోక‌పోతే ఇంకా ఎక్కువ‌గా కోపం వ‌స్తుంది. ఊరికే చూసే బ‌దులు ఆమెతో మాట్లాడి బాధ ఏంటో క‌నుక్కోండి. క‌నీసం ఈ క‌థ‌నం చ‌దివాకైనా అలా చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

మీ భార్య ఒత్తిడి గుర‌వ్వ‌డానికి గ‌ల కొన్ని కార‌ణాల‌ను ఇక్క‌డ ఇస్తున్నాం.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్

మీ అమ్మ‌గారు1

మీ అమ్మ‌గారు1

ఒక స‌ర్వే ప్ర‌కారం 70శాతం మ‌హిళ‌లు త‌మ అత్త‌గారి వ‌ల్ల ఒత్తిడి, ఫ్ర‌స్టేష‌న్‌కు గుర‌వుతున్న‌ట్టు తెలిపారు. మీ భార్య ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్న‌ట్టు గ‌మ‌నిస్తే ముందుగా మీ భార్య‌కు మీ అమ్మ‌కు మ‌ధ్య అంతా స‌వ్యంగా ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకోండి. అవును ఇది చాలా ముఖ్యం.

ఎక్కువ మంది ఆడ స్నేహితులంటే..

ఎక్కువ మంది ఆడ స్నేహితులంటే..

ఇటీవ‌ల మీరు మీ ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఆడ‌వాళ్ల‌ను ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేర్చుకున్నారా? ఇది మీ భార్య‌ని కోపానికి గురి చేయ‌వ‌చ్చు. ఇత‌రుల‌ను ఫ్ల‌ర్ట్ చేసే బ‌దులు ఆమెకు మీ ప‌ట్ల విశ్వాసం క‌లిగేలా చేసుకోండి.

ఆమె స‌ల‌హా విన‌లేదా?

ఆమె స‌ల‌హా విన‌లేదా?

మీ భార్య మిమ్మ‌ల్ని ఓ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డ‌ర్ చేయ‌మ‌ని చెపుతుంది. అయితే మీరు కొన్ని డిస్కౌంట్ కూప‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డి వేరే రెస్టారెంట్లో ఆర్డ‌ర్ ఇస్తారు. అది ఆమెకు న‌చ్చ‌దు ఎందుకంటే మీరు ఆర్డ‌ర్ చేసిన రెస్టారెంట్లో తింటే వాంతి వ‌చ్చే ప‌న‌వుతుంది. అందుకే ఆమె స‌ల‌హా పాటించ‌క‌పోతే ఆమె కోపానికి గురి కావాల్సి ఉంటుంది.

ఇంట్లో ప్రైవ‌సీ ఉండ‌ట్లేదా?

ఇంట్లో ప్రైవ‌సీ ఉండ‌ట్లేదా?

ఎప్పుడూ మీ స్నేహితులు, బంధువుల‌తో ఇల్లు నిండిపోతుందా? వీకెండ్ వ‌స్తే చాలు మీ లివింగ్ రూమ్‌లో క‌నీసం 30 మంది క్రికెట్ చూస్తూ కూర్చొని మీ భార్య చేసి పెడుతుంటే తింటూ ఉంటారా? అయితే ఇది భార్య‌ను క‌చ్చితంగా స్ట్రెస్‌కు గురిచేయ‌దా? ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్ గా మీ ఇంటిని మ‌లిస్తే ఆమెకు కోపం వ‌స్తుంది.

మీ బ‌ద్ద‌కం!

మీ బ‌ద్ద‌కం!

బ‌య‌ట‌కు వెళ్లి కూర‌గాయ‌లు తీసుకుర‌మ్మ‌ని గంట సేపైనా మీరింకా టీవీ ముందుండి చిప్స్ తింటూ కూర్చున్నారా? ఏ భార్య అయినా భ‌ర్త బ‌ద్ద‌కంగా ఉంటే చాలా ఒత్తిడికి గుర‌వుతుంది. క‌నీసం చిన్న చిన్న ప‌నులు కూడా చేయ‌క‌పోతే ఆమె చాలా అప్‌సెట్ అవుతుంది.

ఆమె సెల్ఫీ మోజును నిరుత్సాహ‌ప‌రిస్తే!

ఆమె సెల్ఫీ మోజును నిరుత్సాహ‌ప‌రిస్తే!

ఆమెను సెల్ఫీలు తీసుకోకుండా నిరుత్సాహ‌ప‌రుస్తున్నారా? ఆమెకు ఇది నేరుగా ఒత్తిడిని తీసుకురాదు. అయితే సెల్ఫీ తీసుకోవ‌డం వ‌ల్ల ఆమె కాసేపు త‌న అందం వ‌ల్ల కోపం త‌గ్గించుకోగ‌లుగుతుంది. మీరు సెల్ఫీలు దిగ‌డం ఆపేయ‌మంటే ఆమె కోపాన్ని త‌గ్గించుకునే మార్గాల‌ను మూసివేస్తున్న‌ట్టే లెక్క‌.

డ‌బ్బు త‌గ‌లేస్తున్నారా!

డ‌బ్బు త‌గ‌లేస్తున్నారా!

మీ స్నేహితుడి బ‌ర్త్‌డే పార్టీకి డ‌బ్బులు త‌గ‌లేస్తున్నారా? ఆర్థిక అంశాల్లో దంప‌తుల మ‌ధ్య వాగ్వాదాలు స‌హ‌జం. అయితే అది త‌గ్గించుకునేలా చూసుకోవాలి. ఏదైనా పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేసేట‌ప్పుడు ఆమె స‌ల‌హా తీసుకోవ‌డం మ‌ర‌వ‌కండి.

త్వ‌ర‌గా త‌యార‌వ్వ‌మ‌ని చెప్తున్నారా?

త్వ‌ర‌గా త‌యార‌వ్వ‌మ‌ని చెప్తున్నారా?

ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ఆమెను తొంద‌ర‌గా త‌యార‌వ్వ‌మ‌ని ఒక‌టే పోరుతున్నారా? మేక‌ప్‌, ఫ్యాష‌న్ విష‌యం క‌ళ‌లు. ఆమెను అద్దం ముందు ఎక్కువ సేపు గ‌డ‌ప‌కుండా చేస్తే ఆమెకు కోపం రాగ‌ల‌దు.

కుటుంబ పార్టీల‌కు దూరంగా ఉంటున్నారా?

కుటుంబ పార్టీల‌కు దూరంగా ఉంటున్నారా?

మీ బంధువులు లంచ్ కు పిలిచిన‌ప్పుడే స‌రిగ్గా మీ బాస్ మిమ్మ‌ల్ని భోజ‌నానికి పిలిచాడ‌ని కార‌ణం చెప్పి వెళుతున్నారా? అయితే మీ భార్య మిమ్మ‌ల్ని అపార్థం చేసుకునే ప్ర‌మాదముంది. మీరు కావాల‌నే అలా చేస్తున్నారు అని అనుకుంటుంది. మీ వ‌ల్ల బంధువుల‌కు ఆమె ముఖం చూపించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఆమె ఒత్తిడికి గురికావ‌డానికి ఇదీ ఓ కార‌ణ‌మే.

ఇంటి ప‌నుల్లో స‌హాయం చేయ‌డం లేదా?

ఇంటి ప‌నుల్లో స‌హాయం చేయ‌డం లేదా?

ఇంటి ప‌నుల్లో ఆమెకు ఏ మాత్రం స‌హాయ ప‌డ‌టం లేదా? మీ భార్య‌కు ట‌న్నుల కొద్దీ ప‌ని ఉన్నా మీ నుంచి ఎలాంటి స‌హాయం అంద‌డం లేదా? అయితే ఇది ఆమెను ఒత్తిడికి గురిచేయ‌గ‌ల‌దు. ఆమె కోపానికి తొంద‌ర‌గానే బ‌లి కావాల్సి వ‌స్తుంది.

కాబ‌ట్టి భ‌ర్త‌లు మీ భార్య‌ల‌ను స‌దా సంతోషంగా ఉండేలా చూసుకోండి . అప్పుడే మీరూ ఆనందంగా ఉండ‌గ‌లుగుతారు.

English summary

Reasons Why Your Wife Is Stressed

Are you wondering about the reasons why your wife is stressed all the time? Well, if you wish to stay peaceful at home, you have only one option.