For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్ధరాత్రి ఆమె రూమ్ కు వెళ్లాను, నీకు ఎంత ధైర్యం రా.. నీ బతుకేందిరా అంటూ కొట్టారు #mystory371

నన్ను అంతలా ప్రేమించిన తను అలా చెప్పేసరికి నేను కూడా తనని ఒక్కమాట అనలేదు. కొన్నాళ్ల తర్వాత తనకు నా కళ్ల ఎదుటే పెళ్లి జరిగింది. ఇప్పుడు తను హ్యాపీగా ఫారిన్ లో ఉంటుంది. అప్పుడనిపించింది.. ఆశకూ ఒక హద్ద

|

ఆమె బార్న్ విత్ గోల్డ్ స్పూన్, నేను ట్రాక్టర్ కు పనులకు వెళ్లి బతికేటోన్ని, ప్రపోజ్ చేశా #mystory370 (ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరికి ఇది కంటిన్యూ కథ.

ఆమె మా ఇంట్లో వాళ్లను ఒప్పించు నిన్ను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చింది. సరే అని నేను వాలింటికి వెళ్లాను. వాళ్ల నాన్న ఒక చేతిలో కాలుతున్న చుట్టపట్టుకుని మరో చేతిలో కాఫీ గ్లాస్ పట్టుకుని బయట అరుగుపై కూర్చొన్నాడు. ఆయన్ని చూడగానే నాకు గుండె జల్లుమంది.

ఆయనతో మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. కానీ సాహసించాను. ఆయన మొదట నన్ను గుర్తుపట్టలేదు.. నన్ను చూడగానే ఏం కావాలి అన్నాడు. నేను ఫలానా ఆయన కొడుకుని అని చెప్పాను. సరే గుర్తు పట్టానులే ఏం కావాలి అన్నాడు.

గుండె వేగం పెరిగిపోయింది

గుండె వేగం పెరిగిపోయింది

ఏం చెప్పాలో అర్థం కాలేదు. గుండె వేగం పెరిగిపోయింది. ఏం లేదండీ నేను మీ కూతురు క్లాస్ మేట్ నే. ఆమె నోట్ బుక్ తీసుకోవడానికి వచ్చానండీ అన్నాను. లోపల ఉంది చూడు అన్నాడు. వెళ్లాను. తనను ఏదో ఒక నోట్ బుక్ ఇవ్వమంటే ఇచ్చింది. తీసుకొని వచ్చాను.

నేను అడగలేను అన్నాను

నేను అడగలేను అన్నాను

నాకు చాలా భయంగా ఉందండీ.. నేను అడగలేను అన్నాను. ఒక్కసారి అడిగి చూడు.. ఆయన ఏమంటాడో చూసి మనం ఎలా అయినాసరే పెళ్లి చేసుకుందాం అంది. సరే అన్నాను. మరుసటి రోజు నేరుగా వెళ్లాను.

ఏంటి అన్నట్లుగా నావైపు చూశాడు

ఏంటి అన్నట్లుగా నావైపు చూశాడు

ఆ అమ్మాయి నాన్నతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏదో విషయంపై వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు. ఏంటి అన్నట్లుగా నావైపు చూశాడు. మీతో మాట్లాడాలి అన్నాను. పక్కకు వచ్చాడు. మళ్లీ భయం వేసింది. కానీ వెనక్కి వెళ్తే బాగుండుదని నా మనస్సులో మాటను చెప్పేశాను.

Most Read :ఆమె బార్న్ విత్ గోల్డ్ స్పూన్, నేను ట్రాక్టర్ కు పనులకు వెళ్లి బతికేటోన్ని, ప్రపోజ్ చేశా #mystory370Most Read :ఆమె బార్న్ విత్ గోల్డ్ స్పూన్, నేను ట్రాక్టర్ కు పనులకు వెళ్లి బతికేటోన్ని, ప్రపోజ్ చేశా #mystory370

నీకు ఎంత ధైర్యం రా.. నీ బతుకేందిరా

నీకు ఎంత ధైర్యం రా.. నీ బతుకేందిరా

ఆయన ఆవేశంతో ఊగిపోయాడు. కోపానంతా కళ్లలో చూశాను.

నీకు ఎంత ధైర్యం రా.. నీ బతుకేందిరా అంటూ నానా మాటలు మాట్లాడారు. అక్కడే పక్కన ఉన్న వాళ్లకు కూడా మ్యాటర్ అర్థమైంది. అందరూ తిట్టారు. నువ్వు ఊర్లో కనపడితే చంపేస్తామన్నారు.

అక్కడి నుంచి పారిపోయి

అక్కడి నుంచి పారిపోయి

ఒకరిద్దరూ నాపై చేయి చేసుకున్నారు. కానీ అక్కడే ఉన్న కొందరు వారి నుంచి నన్ను విడిపించారు. చివరకు నేను అక్కడి నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమెను వాళ్ల నాన్న కొట్టారంట. చంపేస్తారన్నారట.

ఒకసారి అర్ధరాత్రి ఇంటికెళ్లాను

ఒకసారి అర్ధరాత్రి ఇంటికెళ్లాను

తర్వాత తనను కాలేజీ మాన్పించారు. ఫైనల్ పరీక్షలు కూడా రాయనివ్వలేదు. నేను తనతో మాట్లేడేందుకు చాలా ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. ఒకసారి అర్ధరాత్రి ఇంటికెళ్లాను.

Most Read :పెళ్లికి ముందు నేనంటే పడి చచ్చేవాడు, ఎంత వెంటపడ్డాడో, పెళ్లయ్యాక #mystory368Most Read :పెళ్లికి ముందు నేనంటే పడి చచ్చేవాడు, ఎంత వెంటపడ్డాడో, పెళ్లయ్యాక #mystory368

నన్ను చంపేస్తారు

నన్ను చంపేస్తారు

తను ఇలా రావొద్దు నిన్ను, నన్ను చంపేస్తారు. మరోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నించినా, నన్ను చూడాలనుకున్నా, కలవాలనుకున్నా నేను పురుగుల మందు తాగి చనిపోతాను అంది.

నా కళ్ల ఎదుటే పెళ్లి జరిగింది

నా కళ్ల ఎదుటే పెళ్లి జరిగింది

నన్ను అంతలా ప్రేమించిన తను అలా చెప్పేసరికి నేను కూడా తనని ఒక్కమాట అనలేదు. కొన్నాళ్ల తర్వాత తనకు నా కళ్ల ఎదుటే పెళ్లి జరిగింది. ఇప్పుడు తను హ్యాపీగా ఫారిన్ లో ఉంటుంది.

సినిమాల్లో మాదిరిగా

సినిమాల్లో మాదిరిగా

అప్పుడనిపించింది.. ఆశకూ ఒక హద్దు ఉండాలని. నా స్థాయి మరిచి నేను తనపై ఆశలు పెట్టుకున్నాననిపించింది. తన రేంజ్ వేరు.. నా స్థాయి వేరు. ఎప్పటికైనా మన స్థాయిని మరిచి ఆశపడకూడదనుకున్నాను. నేను చెప్పే మాట ఒక్కటే సినిమాల్లో మాదిరిగా ప్రతి ఒక్కరూ వారి ప్రేమను గెలిపించుకోలేరు. నిజ జీవితంలో పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి.

Most Read :అతను అమ్మాయితో నాతో మాట్లాడించి అలా వాడేసుకున్నాడు, అంత తెలివి తక్కువగా ఆలోచించానా? #mystory367Most Read :అతను అమ్మాయితో నాతో మాట్లాడించి అలా వాడేసుకున్నాడు, అంత తెలివి తక్కువగా ఆలోచించానా? #mystory367

ప్రాణాలకు తెగించినా సరే

ప్రాణాలకు తెగించినా సరే

ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలకు తెగించినా సరే చేసుకోలేం. కొన్ని వందల సమస్యలు అడ్డొస్తాయి. వాటన్నింటినీ దాటుకుని వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేరు. అందుకే నా జీవితమే ఊదాహరణ. నేను ప్రేమించిన అమ్మాయిని వేరే వాడికిచ్చి పెళ్లి చేసినా కూడా ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి నాది.

English summary

I Couldn't Marry her

I Couldn't Marry her
Desktop Bottom Promotion