For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాకు కలిగిన కోరికల వల్ల అలా చేశా, ఇద్దరిని మెయింటెన్ చేశా, మంచి ఇల్లాలిగా మారాను #mystory294

చాలా మంది అమ్మాయిలు ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు అబ్బాయిల్ని కూడా మెయింటెన్ చేస్తారు. అయినా నేను అలా ఏ రోజు చేయలేదు. ఏది జరిగినా అది నా మంచికే అనుకుని గతాన్ని మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించాను.

By Arjun Reddy
|

నా పేరు శ్రీవాణి నేను టెన్త్ లో ఉన్నప్పుడు చైతన్య అనే అబ్బాయితో, ఇంటర్ లో ఉన్న కౌశిక్ తో ప్రేమాయాణం నడిపాను. కానీ అవి రెండు ఫెయిల్యూర్ అయ్యాయి. నా పాత స్టోరీలను ఇక్కడ చదవవచ్చు. #mystory292. #mystory293.

మొత్తానికి నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. కాలేజీలో జాయిన్ అయిన మొదట్లో నాకు చాలా భయంగా ఉండేది. నా ఫ్రెండ్స్ ఎవరూ జాయిన్ కానీ కాలేజీలో నేను జాయిన్ అయ్యాను. ఆ కాలేజీలో నాకు తెలిసిన ఒక్క వ్యక్తి ఉన్నా నా పరువు మొత్తం మళ్లీ పోతుందని, నేను అక్కడ కూడా తలెత్తుకుని తిరగలేనని నా బాధ.

నా బాగోతం తెలుసు

నా బాగోతం తెలుసు

ఎందుకంటే నాతో పాటు ఇంటర్ చదివిన అందరికీ నా బాగోతం తెలుసు. టెన్త్ లో ఒక అబ్బాయిని లవ్ చేసి ఇంటర్ లో మరో అబ్బాయితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగానని నా ఇంటర్ ఫ్రెండ్స్ కు తెలుసు.

నాకు కలిగిన కోరికల వల్ల

నాకు కలిగిన కోరికల వల్ల

ఆ విషయాన్ని మళ్లీ నేను చదివే డిగ్రీ కాలేజీలో ఎక్కడ స్ప్రెడ్ చేస్తారేమోనని నా భయం. అందుకే నా ఫ్రెండ్స్ ఎవరు చేరని కాలేజీలో జాయినయ్యాను. అయినా నేను గతంలో చేసినవి తప్పని అస్సలు అనుకోవడం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ సమయంలో నాకు కలిగిన కోరికల వల్ల అలా చెయ్యాల్సి వచ్చింది.

ముగ్గురు అబ్బాయిల్ని మెయింటెన్ చేస్తారు

ముగ్గురు అబ్బాయిల్ని మెయింటెన్ చేస్తారు

చాలా మంది అమ్మాయిలు ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు అబ్బాయిల్ని కూడా మెయింటెన్ చేస్తారు. అయినా నేను అలా ఏ రోజు చేయలేదు. ఏది జరిగినా అది నా మంచికే అనుకుని గతాన్ని మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించాను. డిగ్రీలో ఏ అబ్బాయి జోలికి వెళ్లకూడదనుకున్నాను.

<strong>అతని రూమ్ కు వెళ్లి అందాలన్నీ చూపించేదాన్ని, తను చాలా చిన్నోడు, తనంటే చెప్పలేనంత మోజు #mystory291</strong>అతని రూమ్ కు వెళ్లి అందాలన్నీ చూపించేదాన్ని, తను చాలా చిన్నోడు, తనంటే చెప్పలేనంత మోజు #mystory291

అమృతంకురిసిన రాత్రి

అమృతంకురిసిన రాత్రి

కానీ ఒక అబ్బాయి మాయలో పడాల్సి వచ్చింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొత్తం నేను ఎప్పుడు కాలేజీకి వచ్చెదాన్నో ఎప్పుడు వెళ్లెదాన్నో ఎవ్వరికీ తెలియదు. సెకెండియర్ లో ఒక రోజు నేను లైబ్రరీలో కూర్చొని దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన అమృతంకురిసిన రాత్రి బుక్ చదువుకుంటున్నాను. అప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు.. మీరు చదువుతున్న బుక్ కాసేపు ఇస్తారా అని అడిగాడు.

లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్

లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్

వెంటనే ఇచ్చేశాను. మీకు సాహిత్యం అంటే బాగా ఇష్టమా అన్నారు. లేదండీ.. నేను కొన్ని రోజులుగా బాగా ఆందోళనలో ఉన్నాను. అందుకే బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నాను అన్నాను. అలా మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. అతనికి కూడా నాలాగే చాలా లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి.

లవ్ స్టోరీస్ చెప్పాను

లవ్ స్టోరీస్ చెప్పాను

అతని పేరు విశాల్. అతను కూడా డిగ్రీ సెకెండియర్ స్టూడెంట్. కానీ వేరే గ్రూప్. నేను చేసిన తప్పుల్ని, నా గత లవ్ స్టోరీస్ మొత్తాన్ని విశాల్ కు చెప్పాను. తను నన్ను అర్థం చేసుకున్నాడు. తను నాకు చాలా బుక్స్ రెఫర్ చేశారు. వాటన్నింటినీ చదివాను.

Most Read :మా ఆవిడను ఆ సమయంలో టచ్ చేస్తే తంతుంది, ఏం చెయ్యమంటారు, ఎందుకలా ప్రవర్తిస్తుందిMost Read :మా ఆవిడను ఆ సమయంలో టచ్ చేస్తే తంతుంది, ఏం చెయ్యమంటారు, ఎందుకలా ప్రవర్తిస్తుంది

బుక్స్ చదివాకే వచ్చింది

బుక్స్ చదివాకే వచ్చింది

జీవితంలో ఏదైనా సాధించొచ్చనే ధీమా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని విశ్వాసంతో ముందుకెళ్లాలనే ధైర్యం నాకు బుక్స్ చదివాకే వచ్చింది. జీవితంలో తప్పు చేయని వారు ఎవరూ ఉండరు. పరిస్థితుల ప్రభావంతో, తెలియని తనంతో ప్రతి ఒక్కరూ తప్పు చేస్తుంటారు. చేసిన తప్పు గురించి తెలుసుకుని మళ్లీ అది చేయకపోవడమే నిజమైన పరివర్తన.

పుట్టకతోనే మహర్షులు

పుట్టకతోనే మహర్షులు

నేను టీనేజ్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయాలనే ధ్యాసలోనే ఉండేదాన్ని. అందరూ నాకు అందమైన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కుల్లుకుని చావాలనుకునేదాన్ని. అందుకే అలా ప్రవర్తించాను. జీవితంలో ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నారంటే వారు పుట్టకతోనే మహర్షులు అయి ఉంటారు. మనుషులైతే కచ్చితంగా తప్పు చేసి తర్వాత పశ్చాతాపపడి మంచిగా మారుతారు.

మంచి ఇల్లాలిగా మారాను

మంచి ఇల్లాలిగా మారాను

నేను డిగ్రీ చదువుతుండగానే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం ప్రారంభించాను. తర్వాత జాబ్ కొట్టాను. నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచి నేను చేసిన తప్పుల్ని క్షమించిన విశాల్ ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మంచి ఇల్లాలిగా పేరు తెచ్చుకున్నాను. ఆఫీస్ లో మంచి ఉద్యోగిణిగా నాకు పేరుంది. జీవితంలో ఒక్కోసారి మనం చేసే తప్పులే మనకు గుణపాఠాన్ని నేర్పి మంచి లైఫ్ ను ఇస్తాయి.

English summary

I Have Realised My Mistake

I Have Realised My Mistake
Desktop Bottom Promotion