అతన్ని నమ్మితే నా జీవితాన్నే నాశనం చేశాడు - My Story #36

Written By:
Subscribe to Boldsky

మా ఇంట్లో అందరూ ఎక్కువగా వ్యాయామానికి ప్రాముఖ్యం ఇస్తారు. మా నాన్న స్పోర్ట్స్ పర్సన్. మా అమ్మనాన్నలకు మేము ఇద్దరమూ కూతుర్లమే. మమ్మల్ని మా నాన్న ఎంతో బాగా చూసుకుంటారు. మమ్మల్ని మంచి స్పోర్ట్స్ పర్సన్ గా చూడాలన్నది మా నాన్నకల.

నాకు చెల్లెలికి..

నాకు చెల్లెలికి..

అందుకోసం నాకు, చెల్లెలికి చిన్నప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. నేను మంచి క్రీడాకారిణిగా ఎదగాలన్నది మా నాన్న కల. అందువల్ల ప్రతి క్షణం నాపై ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు.

జిల్లా స్థాయిలో టాప్

జిల్లా స్థాయిలో టాప్

ఉదయం లేస్తేనే మా ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్ కు రన్నింగ్ కు వెళ్లేదాన్ని. నేను రన్నింగ్ లో టాప్. జిల్లాస్థాయి, రాష్ర్టస్థాయి పోటీల్లో నేను సాధించిన మెడల్స్, అవార్డ్స్ చాలా ఉన్నాయి. నేను నేషనల్ లెవల్ లో కూడా చాలా పోటీల్లో పాల్గొన్నాను.

అబ్బాయి పక్కనే కూర్చొన్నా

అబ్బాయి పక్కనే కూర్చొన్నా

అయితే రోజూ మాదిరిగానే ఒక రోజు ఉదయమే గ్రౌండ్ కు వెళ్లాను. నాతో పాటు పక్క ట్రాక్ లో ఒక అబ్బాయి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తర్వాత ఇద్దరమూ అలిసిపోవడంతో ఒక చోట కూర్చున్నాం.

అతనూ స్పోర్ట్స్ పర్సనే

అతనూ స్పోర్ట్స్ పర్సనే

అతను నాతో మాటలు కలిపాడు. అతను కూడా స్పోర్ట్స్ పర్సనే. తర్వాత ఇద్దరి మాటలు కలిశాయి. అతను చాలా పోటీల్లో సత్తా చాటాడు. అతను తన గురించి మొత్తం వివరాలు చెప్పాడు. తర్వాత నేను కూడా నా వివరాలు అతనికి చెప్పాను.

ప్రాక్టీస్ ను పక్కన పెట్టి

ప్రాక్టీస్ ను పక్కన పెట్టి

తర్వాత రోజూ నుంచి ఉదయానే లేచి గ్రౌండ్ కు వెళ్లేదాన్ని. అతను కూడా ఉదయాన్నే గ్రౌండ్ కు వచ్చేవాడు. ఇద్దరం గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ప్రాక్టీస్ ను పక్కన పెట్టి పకపక నవ్వుతూ పబ్బంగడిపేవాళ్లం.

ఏదైనా చేయడానికి రెడీ

ఏదైనా చేయడానికి రెడీ

ఇద్దరం ఇంటికెళ్లాక కూడా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. నేను కాలేజీకి వెళ్లాక కూడా అతనితో చాటింగ్ చేస్తూ ఉండేదాన్ని. మొత్తానికి మా ప్రేమ పతాక స్థాయికి చేరింది. ప్రతి క్షణం అతనిపైనే ధ్యాసనే ఉండేది. అతనికోసం ఏది అయినా చేద్దామని పరితపించేదాన్ని.

పెళ్లికి నాన్న ఒప్పుకోడు

పెళ్లికి నాన్న ఒప్పుకోడు

అతను కూడా నాపై చాలా ప్రేమ చూపేవాడు. పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ అతనిది వేరే క్యాస్ట్. మా నాన్న మా పెళ్లికి అస్సలు ఒప్పుకోడు. అసలు మా నాన్నకు మా విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు. అందుకే నేను ఇంట్లో కూడా చెప్పలేదు.

ఇంట్లో నుంచి వెళ్లిపోయి

ఇంట్లో నుంచి వెళ్లిపోయి

మా ఇంట్లో నా కోసం చాలా సంబంధాలు చూశారు. కానీ నేను ప్రతి దాన్ని ఏదో ఒక కారణంతో బాగా లేదని చెప్పేదాన్ని. ఒప్పుకునేదాన్ని కాదు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి అతన్నే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. మేమిద్దరం సాయంత్రం పూట గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేయకుండా పార్క్ కు వెళ్లి సరసాలు ఆడుకునేవాళ్లం.

ప్రతి పోటీలో ఓడిపోయాను

ప్రతి పోటీలో ఓడిపోయాను

అతని మోజులో పడి నేను ప్రాక్టీస్ పూర్తిగా పక్కను పెట్టాను. అంతకుముందు నేను ఏ పోటీలో పాల్గొన్న కూడా నాకు కచ్చితంగా పతకం వచ్చేది. కానీ అతనితో ప్రేమ కొనసాగించడం వల్ల నేను క్రీడల్ని పూర్తిగా పక్కన పెట్టాను. ప్రతి పోటీలో ఓడిపోతూ వచ్చాను.

జాతీయ స్థాయి పోటీల్లో విజయం

జాతీయ స్థాయి పోటీల్లో విజయం

అతను పోటీల్లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లాడు. అక్కడ జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అందులో విజయం సాధించాడు. ఆ విషయం పేపర్లలో కూడా మారుమోగిపోయింది. అప్పుడు అందరికన్నా ఎక్కువగా ఆనందపడ్డది నేనే.

బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు

బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు

అతనికి ఫోన్ చేసి విషెస్ తెలుపుదామనుకున్నాను. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ట్రై చేస్తే బిజీబీజీ అని వచ్చింది. ఎన్ని సార్లు ట్రై చేసినా అదే ఆన్సర్ వస్తుంది. తర్వాత నాకు అర్థమైంది. నా ఫోన్ నంబర్ ను అతను బ్లాక్ లిస్ట్ లో పెట్టాడని తెలిసింది.

బ్లాక్ చేశాడు

బ్లాక్ చేశాడు

మెసేజ్ చేస్తే రిప్లై లేదు. వాట్సాప్ లో కూడా నన్ను బ్లాక్ చేశాడు. ఫేస్ బుక్, మెసేంజర్ ప్రతి దాంట్లో నన్ను బ్లాక్ చేశాడు. అసలు కారణం ఏమిటో నాకు తెలియదు.

కెరీర్ మొత్తం నాశనం

కెరీర్ మొత్తం నాశనం

అతను నన్ను మోసం చేశాడు. నన్ను ప్రేమలో దింపి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని అర్థం అయ్యింది. అతని వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయ్యింది. లేకుంటే నేను జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించేదాన్ని.

జీవితం చేతులారా నాశనం

జీవితం చేతులారా నాశనం

మా నాన్న నాపై పెట్టుకున్న ఆశలన్నింటినీ ఆవిరి చేశాను. నా జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకున్నాను. అబ్బాయిలందరూ ఇలా ఉంటారని నేను అనడం లేదు. కొందరైనా ఇలాంటి వాళ్లు ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

English summary

I Met Him One Day On My Morning Run And My Life Was Never The Same Again

I Met Him One Day On My Morning Run And My Life Was Never The Same Again
Story first published: Monday, January 8, 2018, 16:00 [IST]