అతను నాన్నకాదు.. నన్ను రోజూ లైంగికంగా వేధించేవాడు - My Story #37

Written By:
Subscribe to Boldsky

నాకు అప్పుడు పెద్దగా తెలియదు. నాది చిన్న వయస్సు. అసలు అతను నాకు ఏమి అవుతాడో అనే విషయం కూడా సరిగ్గా తెలియదు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి అతని ఇంట్లో మేము ఉండేవాళ్లం.

నాన్న అనేవాళ్లం

నాన్న అనేవాళ్లం

మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ, మేము అతని ఇంటికి వచ్చాం. అతన్ని మేము నాన్న అని పిలిచేవాళ్లం. మేము ముగ్గురం అక్కాచెల్లెల్లం. నేనే చిన్నదాన్ని.

నన్ను రోజూ టార్చర్ చేసేవాడు

నన్ను రోజూ టార్చర్ చేసేవాడు

నేను ఎక్కువగా ఇంట్లో ఉండేదాన్ని. నాతో అతను చాలా పనులు చేయించుకునే వాడు. మా అమ్మ, అక్క వాళ్లు ఉదయమే పనికి వెళ్లేవారు. అతను నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసేవాడు. నానా రకంగా టార్చర్ చేసేవాడు.

అతను నాన్న కాదు

అతను నాన్న కాదు

అతను మాత్రం ఒకరోజు డ్యూటీకి వెళ్తే రెండు రోజులు ఇంటి దగ్గరే ఉండేవాడు.ఆయనను చిన్నప్పుడు మా సొంత నాన్న అని అనుకునేదాన్ని. నేను కాస్త పెద్దగా అయ్యాక అసలు విషయం నాకు తెలిసింది.

లైంగికంగా వేధించేవాడు

లైంగికంగా వేధించేవాడు

అయితే ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు అతను నన్ను లైంగికంగా వేధించేవాడు. ఆ విషయం ఎవ్వరికీ చెప్పవద్దంటూ భయపించేవాడు. నన్ను అలా చాలా సార్లు వాడుకున్నాడు. నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి నన్ను అలా వేధించడం మొదలుపెట్టాడు.

పన్నెండు ఏళ్ల అప్పుడు

పన్నెండు ఏళ్ల అప్పుడు

నేను హైస్కూల్ చేరేంత వరకు అతను నన్ను ఏం చేస్తున్నాడనే విషయం కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ నన్ను చేయాల్సిందల్లా చేశాడు. నాకు పన్నెండు ఏళ్ల అప్పుడు అతను నన్ను ఏం చేస్తున్నాడనే విషయం తెలిసింది.

ఇంటికి వచ్చేదాన్ని కాదు

ఇంటికి వచ్చేదాన్ని కాదు

కొన్ని రోజుల తర్వాత నేను హాస్టల్ లో ఉండి చదువుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు అస్సలు ఇంటికి వచ్చేదాన్ని కాదు. పండుగలప్పుడు సెలవులు వచ్చినా కూడా అతనికి భయపడి ఇంటికి వెళ్లేదాన్ని.

ఒళ్లు జలదరిస్తుంది

ఒళ్లు జలదరిస్తుంది

మా కుటుంబానికి అతను కాస్త ఆసరాగా ఉన్నాడని మా కుటుంబం మొత్తం అతన్ని భరించాల్సి వచ్చింది. కానీ అతడు చేసిన పనులను తలుచుకుంటే నాకు మాత్రం ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది.

స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్

స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్

నేను కాలేజీలో జాయినయ్యాక అన్నింట్లో ఫస్ట్ వచ్చేదాన్ని. స్పోర్ట్స్ లోనూ నేను ఫస్టే. నేను స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్ పొందాను. ఇక అతని నుంచి మా కుటుంబాన్ని పూర్తిగా దూరంగా పెట్టాను. మా కుటుంబం ప్రస్తుతం హ్యాపీగా ఉంది. మా అక్కవాళ్లకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి.

మా కాపురం బాగుంది

మా కాపురం బాగుంది

నాకు కూడా మంచి అబ్బాయితో పెళ్లయింది. మా కాపురం చాలా బాగుంది. మాకు ఇద్దరు అబ్బాయిలు. నిజంగా మా నాన్న బతికి ఉంటే మమ్మల్ని చూసి చాలా ఆనందించేవారు. కానీ ఆయన మాకు దూరం కావడం వల్ల మేము ఏవేవో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది.

మా అమ్మ చేసిన తప్పుకు

మా అమ్మ చేసిన తప్పుకు

జీవితంతో ఎవరికీ కూడా ఇలాంటి కష్టాలు రాకూడదని నేను కోరుకుంటున్నాను. మా అమ్మ చేసిన తప్పుకు ఆ దుర్మార్గుడి చేతిలో మేము కూడా బలి కావాల్సి వచ్చింది. అప్పటి విషయాలు తలుచుకుంటే మాత్రం నాకు అతన్ని చంపుదామన్నా కోపం వస్తూ ఉంటుంది.

ఎంతో మంది

ఎంతో మంది

నాలాగా చాలామంది అమ్మాయిలు ఎవరో ఒకరి చేతిలో

ఇలాంటి లైంగిక దాడులకు కచ్చితంగా గురై ఉంటారు. ఎక్కువగా పేదవారు ఇప్పటికీ ఇలాంటి వాటికి గురవుతూనే ఉన్నారు. సమాజంలో మార్పు రావాలంటే మనం కూడా కొన్ని కట్టుబాట్లు కచ్చితంగా పాటించాలి. అయినా ఆవేదన తెలుపుకోగలంగానీ సమాజాన్ని మార్చేంత గొప్ప వాళ్లం మాత్రం కాదు కదా మనం.

English summary

i was only twelve when i found i was being raped my father

I Was Only Twelve When I Found Out I Was Being Raped By My Father