మా ఆయన పెళ్లయిన కొత్తలో రాత్రి అంతా అదే పనే చేసేవాడు - My Story #42

Written By:
Subscribe to Boldsky

మాకు పెళ్లి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక బాబు, పాప ఉన్నారు. మా ఆయన పెళ్లయిన కొత్తలో నాపై చాలా ప్రేమ చూపించేవారు. నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు.

పది నిమిషాలకొకసారి ఫోన్

పది నిమిషాలకొకసారి ఫోన్

ఆఫీసుకు వెళ్లాక కూడా నాతో చాటింగ్ చేస్తూనే ఉండేవారు. ప్రతి పది నిమిషాలకొకసారి ఫోన్ చేసి హాయి అంటూ పలకరించేవాడు. నన్ను ప్రతి క్షణం తలచుకునేవాడు. కానీ రానురాను పూర్తిగా మారిపోయాడు

ముద్దూ ముచ్చట లేదు

ముద్దూ ముచ్చట లేదు

ఇప్పుడు ఆఫీసులో ఏ వగలాడి మాయలో పడ్డాడో కానీ నాపై అస్సలు ప్రేమ చూపడం లేదు. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ముద్దూ ముచ్చట కూడా సరిగ్గా లేదు. ఇంటికొచ్చాక కూడా ఆ హార్మోనియం పెట్టె (ల్యాప్ ట్యాప్) ముందు పెట్టుకుని కూర్చొని ఉంటాడు.

మల్లెపూలు మరిచిపోతున్నాడు

మల్లెపూలు మరిచిపోతున్నాడు

పెళ్లయిన కొత్తలో ఇంటికొచ్చేటప్పుడు కచ్చితంగా మల్లెపూలు తీసుకొచ్చేవాడు. ఇప్పుడు నేను చెప్పిన కూడా తీసుకురావడం లేదు. అడగకున్నా చీరలు కొనుక్కునేందుకు డబ్బులిచ్చేవాడు. వారంవారం సినిమాలు, రెస్టారెంట్లు అన్నీ తిరిగేవాళ్లం

కొంగుకు కట్టుకుని తిరిగేదాన్ని

కొంగుకు కట్టుకుని తిరిగేదాన్ని

సెలవులన్నప్పుడల్లా ఊటీ, కొడైకెనాల్, గోవా ఇలా టూర్ల్ వేసేవాళ్లం. అబ్బో.. మమ్మల్ని చూసి మా చుట్టాలంతా కుళ్లుకునేవారు. పెళ్లయిన వెంటనే మొగుడ్ని కొంగుకు కట్టుకుని తిరుగుతుంది చూడు అంటూ నన్ను ఆడిపోసుకునేవారు. అయినా నేను ఆ విషయాల్ని చాలా ఆనందించేదాన్ని. నా మొగుడు నేను చెప్పినట్లు వింటున్నాడంటే నా అదుపులో ఉన్నట్లు లెక్కే కదా అని సంతోషించేదాన్ని.

ల్యాప్ ట్యాప్ ముందుర పెట్టుకుంటాడు

ల్యాప్ ట్యాప్ ముందుర పెట్టుకుంటాడు

అయితే నా ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఫోన్లో మాట్లాడడం లేదంటే చాట్ చేయడం, లేదంటే ల్యాప్ ట్యాప్ ముందుర పెట్టుకుని ఫటీఫటీ మని టైప్ చేసుకుంటూ కూర్చొవడమే మా ఆయనకు సరిపోయింది.

ఇంట్లో ఉండదా టార్గెట్

ఇంట్లో ఉండదా టార్గెట్

ఇక నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నేను ఏమన్నా అంటే ఆఫీసులో పని ఉంటుంది. టార్గెట్లు ఇస్తారు. సెలవులు ఉండవు. నీకేం తెలుసు అంటూ మండిపడతాడు. ఏం.. ఈ పని ఇంతకు ముందుకు లేదా? ఈ టార్గెట్లు అప్పుడు లేవా? అప్పుడు ఏమో అంత బాగా చూసుకునే వారు.. ఇప్పుడెందుకు ఇలా సడన్ గా మారిపోయారని చాలాసార్లు ప్రశ్నిస్తాను. దానికి మాత్రం సమాధానం చెప్పడు.

ఇంటి పనికే పరిమితం

ఇంటి పనికే పరిమితం

ఇంట్లో వంట వండి.. పిల్లల్ని రెడీ చేసి స్కూళ్లకు పంపించే వరకేనట నా బాధ్యత. ఇంకేమీ మాట్లాడకూడదట. ఇంట్లోకి ఏం కావాలో చెప్పు అన్నీ సరుకులు తీసుకొస్తాను అంటాడు. నెలరోజులకు అవసరమయ్యే సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పడేసి తన బాధ్యత అయిపోయినట్లు ఫీలవుతాడు.

అస్సలు దానిపై ఆసక్తే చూపరు

అస్సలు దానిపై ఆసక్తే చూపరు

పెళ్లయిన కొత్తలో సాయంత్రం నుంచే దానిపై ఇంట్రెస్ట్ చూపేవారు. రాత్రి అస్సలు నిద్రపోనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మారిపోయారు. దాని గురించి అస్సలు ఆలోచించడం లేదు. భార్యాభర్తలు మధ్య ఆ సంబంధం ఎంత బాగుంటే సంసారం కూడా అంత బాగుంటుంది.

రోజూ కోరుకునేది అదొక్కటే

రోజూ కోరుకునేది అదొక్కటే

ఆడవాళ్లం కదా అన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్పలేం. కొన్ని అర్థం చేసుకోవాలి. నేను తన నుంచి రోజూ కోరుకునేది అదొక్కటే. దాన్ని కూడా ఏదో యాంత్రికంగా చేసి పోతూ ఉంటాడు మా ఆయన. ఏదో నాకోసం చేస్తున్నట్లు చేస్తాడు ఆ పని.

సంతృప్తి పరిచేవాడు

సంతృప్తి పరిచేవాడు

గతంలో నాపై ప్రేమ ఎక్కువగా ఉండేది. నన్ను అందులో కూడా బాగా సంతృప్తి పరిచేవాడు. కానీ ఇప్పుడు అప్పటిలాగా షాంపిగ్ లేవు, టూర్లు లేవు.. రాత్రి పూట అది కూడా సరిగ్గా చేయడు. ఏం భార్య అంటే కేవలం ఇంట్లో పని చేసే పని మనిషా? అందుకే మా ఆడవాళ్లు బరితెగిస్తున్నారు.

ఓపిక ఉన్నంత వరకే

ఓపిక ఉన్నంత వరకే

మగవారికి ఇది చాలా చిన్న విషయంలా ఉండొచ్చు. కానీ మాకు కావాల్సిన చిన్నచిన్న ఆనందాలు అవే. వాటిని మీరు పట్టించుకోకుంటే మేము చేయాల్సింది చెయ్యాల్సి వస్తుంది. ఓపిక ఉన్నంత వరకు చూస్తాం.

పైకి చెప్పరు

పైకి చెప్పరు

ఏ భార్య కూడా ఈ మాటల్ని పైకి చెప్పదు. కానీ మీ ప్రేమ తక్కువైనప్పుడు ఈ సమస్యలతోనే సతమతం అవుతూ ఉంటుంది. అందుకే హజ్బెండ్స్.. మీరు ఎంత బిజీగా ఉన్నా దయచేసి వైఫ్స్ ను ఆ విషయాల్లో ఇబ్బందిపెట్టకండి.

English summary

my husband considers me useless because i am a housewife

my husband considers me useless because i am a housewife