For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొన్నాళ్లు సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నాం, వేరే అబ్బాయితో రూమ్ లో ఉంటే మా ఆయన చూశాడు #mystory212

కానీ ఇంత దరిద్రుడిని చేసుకున్నానా అని ఇప్పుడు అనుకుంటున్నా. మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకునేవాళ్లనూ చేసుకోవాలిగానీ.. సాహిత్యం తొక్కా తోటకూర అంటూ వెళితే నాలాగే తయారవుతుంది పరిస్థితి.

|

నా పేరు స్వప్న. మాది వరంగల్. ఎప్పటి మాదిరిగానే ఫేస్ బుక్ లో నా పోస్ట్ కు వచ్చిన కామెంట్స్ చూసుకుంటూ ఉన్నాను. కొందరు పొగుడుతూ కొందరు తిడుతూ చేసిన కామెంట్స్ కు రిప్లై ఇస్తూ ఉన్నాను. అందులో ఒక అనోన్ పర్సన్ కామెంట్ చేశాడు. నా ఫొటోకు సూట్ అయ్యేలా.. తెలుగు పదాలతో క్రియేటివిటినీ అంతా రంగరించి తాను చేసిన కామెంట్ నాకు బాగా నచ్చింది.

వరా అని ఆలోచించాను

వరా అని ఆలోచించాను

ఆ అబ్బాయి ఎవరా అని ఆలోచించాను. తనకు నాకు మ్యూచ్ వల్ ఫ్రెండ్స్ కూడా లేరు. మెసేంజర్ లో మెసేజ్ పంపాను. తన పేరు సాకేత్. తను నా పోస్ట్ లు ఒక ఫేస్ బుక్ గ్రూప్ లో చూసాడంట. అవి నచ్చి నన్ను ఫాలో కావడం మొదలుపెట్టాడట. తర్వాత అతని డిటేల్స్ అన్నీ కనుక్కున్నాను.

చదవని పుస్తకమంటూ ఏదీ లేదు

చదవని పుస్తకమంటూ ఏదీ లేదు

అతను ఎంటెక్ పూర్తి చేశాడు. సాహిత్యం అంటే బాగా ఇష్టం. అతను చదవని పుస్తకమంటూ ఏదీ లేదు. అతనితో మాట్లాడుతుంటే లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్నట్లుగా ఉంటుంది. నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం కానీ బుక్స్ చదివే ఓపిక అస్సలుండదు. యూట్యూబ్ లో తెలుగు సాహిత్యానికి సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాను.

ప్రతి మాట కవిత్వంలాగే ఉండేది

ప్రతి మాట కవిత్వంలాగే ఉండేది

కానీ అతను ప్రతి రచయిత బుక్ చదివాడు. తను మాట్లాడే ప్రతి మాట కవిత్వంలాగే ఉండేది. ప్రతి విషయాన్ని కూడా క్రియేటివీగానే చెప్పేవాడు. మా మధ్య పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇద్దరమూ తిరగని లైబ్రరీ లేదు.. చదవని పుస్తకం లేదు. సాహిత్యం మమ్మల్ని కలిపింది. ఇద్దరి అభిరుచులూ ఒక్కటే కావడంతో జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నాం.

సహజీవనం చేశాం

సహజీవనం చేశాం

కొన్నాళ్లు సహజీవనం చేశాం. తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఇద్దరం మంచి మెచ్యూర్డ్ పర్సన్స్ కాబట్టి బాగా అర్థం చేసుకోగలిగాం. కొన్నాళ్లకు ఇద్దరం ఒకే కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాం. మొదట కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత నాపై నా భర్త అనుమానపడడం మొదలుపెట్టాడు.

ఏ మేల్ కోలిగ్ తోనైనా క్లోజ్ గా ఉంటే ఇద్దరికీ ఏదో ఉందని అనుకునేవాడు.

అతనికి నాకు ఏదో సంబంధం ఉందని

అతనికి నాకు ఏదో సంబంధం ఉందని

మంత్ ఎండింగ్ లో ఒక రోజు బాగా లేట్ అయ్యింది. నా కోలిగ్ నన్ను బైక్ పై ఎక్కించుకుని వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. అప్పుడు వర్షం స్టార్ట్ అయ్యింది. సరే ఇంట్లోకి రండి.. టీ తాగి వెళ్లండి అని పిలిచాను. వచ్చి అతను టీ తాగుతూ కూర్చొన్నాడు. మా ఆయన బాత్రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. సోఫాలో టీ తాగుతున్న మా కోలీగ్ ను చూసి సందేహపడ్డాడు. అతనికి నాకు ఏదో సంబంధం ఉందని అనుకున్నాడు మా ఆయన.

ఏంట్రా బాబు.. నాకు బ్యాడ్ టైమ్

ఏంట్రా బాబు.. నాకు బ్యాడ్ టైమ్

అతను వెళ్లిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి నాతో గొడవపెట్టుకున్నాడు. మరుసటి రోజు ఒకతను ఆఫీస్ లో నా పక్క సీట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. అతను జోక్ చేశాడు. నేను నవ్వాను. కరెక్ట్ అప్పుడే మా ఆయన వచ్చాడు. మళ్లీ తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఏంట్రా బాబు.. నాకు బ్యాడ్ టైమ్ అనుకున్నాను.

ప్రేమతో కాదు నాపై అనుమానంతో

ప్రేమతో కాదు నాపై అనుమానంతో

తర్వాత నేను జాబ్ మానేశాను. ఇంటి దగ్గర నేను ఒక్కదాన్ని ఉంటే మా ఆయనకు అనుమానం. ఎప్పుడూ ఫోన్ చేసేవాడు. అది ప్రేమతో కాదు నాపై అనుమానంతో అని నాకు క్లియర్ గా తెలిసేది. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. ఇలాంటి అనుమానపు భర్తతో కాపురం చెయ్యలేను అనుకున్నాను. ఒక రోజు నాకు తెలిసిన ఒక అబ్బాయి మార్కెట్లో కనిపించాడు. చాలా రోజులైంది కదా అని ఇంటికి పిలిచాను.

చెంప చెల్లుమన్పించాడు

చెంప చెల్లుమన్పించాడు

ఆ అబ్బాయి నేను ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అంతలో మా ఆయన వచ్చాడు. గాలికి తలుపు అదేపనిగా కొట్టుకుంటూ ఉంటే తలుపు గడియపెట్టాను. మా ఆయన వచ్చి గట్టిగా తలుపు కొట్టాడు. నేను కాస్త లేట్ గా తీశాను. అంతే.. తలుపు తియ్యగానే నా చెంప చెల్లుమన్పించాడు.

మంచి మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నా

మంచి మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నా

అసలు ఏమీ తెలుసుకోకుండగానే నన్ను అనుమానించాడు. అతన్ని నమ్మి.. అతన్ని ప్రేమించి పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంటే నాకు తగిన బుద్ది చెప్పాడు. సాహిత్యం చదివాడు.. తెలివి బాగా ఎక్కువ ఉంది.. మంచి మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నా. కానీ ఇంత దరిద్రుడిని చేసుకున్నానా అని ఇప్పుడు అనుకుంటున్నా.

ఎంత నాలెడ్జ్ ఉంటే ఏం లాభం

ఎంత నాలెడ్జ్ ఉంటే ఏం లాభం

మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకునేవాళ్లనూ చేసుకోవాలిగానీ.. సాహిత్యం తొక్కా తోటకూర అంటూ వెళితే నాలాగే తయారవుతుంది పరిస్థితి. ఎంత నాలెడ్జ్ ఉంటే ఏం లాభం మనుషుల్ని అర్థం చేసుకోలేనప్పుడు.

English summary

my husband is always suspicious of me

my husband is always suspicious of me
Story first published:Tuesday, August 21, 2018, 11:31 [IST]
Desktop Bottom Promotion