భావప్రాప్తి విషయంలో స్త్రీ పురుషులు అబద్దం చెప్పడం వెనుక కారణాలు

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరించడం అనేది ఒక సంస్కృతిగా మారిపోయింది. కొన్ని గణాంకాల ప్రకారం చాలా మంది భావప్రాప్తి విషయంలో ఎదుటివారు నకిలీగా వ్యవహరించడం చూసి ఉండవచ్చు లేదా వారే అలా వ్యవహరించి ఉండవచ్చు. ఇలా ఎంత మంది భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే కెన్సాస్ విశ్వవిద్యాలయం ఈ మధ్యే ఒక అధ్యయనం చేసారు. ఇలా చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం, అసలు ఎందుకు ప్రజలు నకిలీ గా వ్యవహరిస్తున్నారు అనే విషయానికి కారణాలు కనుక్కోవాలి అనుకున్నారు.

స్త్రీ పురుషులు ఇద్దరు నకిలీగా సంతృప్తి చెందినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న 6 ముఖ్యమైన కారణాలను ఈ అధ్యయనంలో గుర్తించడం జరిగింది. అవి మీ కోసం...

అలా చేస్తే చాలా బాగుంటుందని

అలా చేస్తే చాలా బాగుంటుందని

భాగస్వామి కోసం

శృంగారంలో లీనమైపోకుండా ఉండటానికి

తారుమారుచేయడానికి లేదా శక్తి ఉందని చూపించడానికి

అభద్రతా భావాన్ని దాచుకోవడానికి

భావోద్వేగ పరంగా మాట్లాడుకోవడానికి

అంతేకాకుండా భావప్రాప్తి విషయంలో ఎంతమంది ఇలా నకిలీగా నటించారు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంది ఈ అధ్యయనం.

కాలేజీ విద్యార్థుల పై

కాలేజీ విద్యార్థుల పై

అందులో భాగంగా కాలేజీ విద్యార్థుల పై సర్వే నిర్వహించింది. 76% మంది స్త్రీలు, 41% మంది పురుషులు ఒక్కసారైనా తాము భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరించామని ఒప్పుకోవడం జరిగింది.

ఎప్పుడైనా నకిలీగా వ్యవహరించారా ?

ఎప్పుడైనా నకిలీగా వ్యవహరించారా ?

వారి అధ్యయనం కోసం ఆ బృందం కొలుచుకోవడానికి వీలుగా ఉండే ఒక చార్ట్ ని తయారుచేసింది. దానిపేరు ప్రీటెండింగ్ ఆర్గాస్మ్స్ రీజన్స్ మెజర్. దీనిని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తిని భావప్రాప్తి విషయంలో అంచనా వేయాలని నిశ్చయించుకున్నారు. దీనిని ఉపయోగించి 1400 కళాశాల విద్యార్థుల పై మూడు సర్వే లను నిర్వహించారు. అసలు ఇప్పటి వరకు ఎప్పుడైనా నకిలీగా వ్యవహరించారా ? అలా గనుక వ్యవహరించినట్లైతే, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది. ఇలా ఎన్నో విషయాలను వాళ్ళను అడగడం జరిగింది.

చాలా మంది స్త్రీలు ఎదుటివారిని మెప్పించడానికి

చాలా మంది స్త్రీలు ఎదుటివారిని మెప్పించడానికి

అసలు ప్రజలు ఎందుకు భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరిస్తున్నారు అనే విషయానికి సంబంధించి ఇదే మొదటి అధ్యయనం కాదు. కొంతమంది పరిశోధకులు గుర్తించిన అంశం ఏమిటంటే, చాలా మంది స్త్రీలు ఎదుటివారిని మెప్పించడానికి ఎలా అయితే అందంగా ముస్తాబవుతారో, అలానే , తమ భాగస్వామిని ఆనందంగా ఉంచడానికి భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరిస్తారట. ఇలా చేయడం ద్వారా పురుషుల యొక్క అహం కూడా బాగా పెరుగుతుందట అని ఒక అధ్యయనం ఒక కథనాన్ని ప్రచురించింది. ఒక స్త్రీ భావప్రాప్తికి కి చేరుకుంది అనే విషయం పురుషులకు తెలిసినప్పుడు వారి మగతనం, సామర్ధం పై విశ్వాసం పెరుగుతుందట.

 కొంతమంది స్త్రీలు పురుషుల యొక్క భావాలను సంరక్షించడం కోసమై నకిలీ భావప్రాప్తిని వ్యక్తపరుస్తారు

కొంతమంది స్త్రీలు పురుషుల యొక్క భావాలను సంరక్షించడం కోసమై నకిలీ భావప్రాప్తిని వ్యక్తపరుస్తారు

" పురుషులు ఎవరైతే, స్త్రీల యొక్క భావప్రాప్తి వారి మగతనానికి సంజ్ఞ గా భావిస్తారో, అందులో నిజం కూడా ఉంది. స్త్రీలు ఎప్పుడైతే భావప్రాప్తికి లోనవుతారో అటువంటి సమయంలో సాధారణంగా పురుషులు తమ శృంగార సామర్థ్యం బాగుంది అని భావిస్తూ ఉంటారు " అని కొంతమంది ఈ అధ్యయనం చేసిన రచయతలు చెప్పడం జరిగింది. " ఇందులో మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, కొంతమంది పురుషులు స్త్రీలకు భావప్రాప్తి కలిగించే విషయంలో ఒత్తిడికి లోనవుతుంటారు. వీటిని దృష్టిలో ఉంచుకునే, కొంతమంది స్త్రీలు పురుషుల యొక్క భావాలను సంరక్షించడం కోసమై నకిలీ భావప్రాప్తిని వ్యక్తపరుస్తారు "

నకిలీ భావప్రాప్తి విన్యాసాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి

నకిలీ భావప్రాప్తి విన్యాసాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి

ఈ స్త్రీల భాస్వాములైన పురుషులు, వారి మగతనం చాలా దీన స్థితిలో ఉందని భావిస్తూ ఉండవచ్చు. ఇటువంటి సందర్భంలో, ఈ నకిలీ భావప్రాప్తి విన్యాసాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కానీ, ఒక స్త్రీ వివిధకారణాల వల్ల భావప్రాప్తికి చేరుకోలేకపోవచ్చు, ఇందుకు పూర్తిగా భాగస్వామిని తప్పుపట్టలేము.

 చాలామంది స్త్రీలు శృంగార అనుభవం నచ్చక భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరిస్తారట

చాలామంది స్త్రీలు శృంగార అనుభవం నచ్చక భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరిస్తారట

2016 లో జరిగిన అధ్యయనం ప్రకారం తమ భాగస్వామి భావప్రాప్తి త్వరగా చేరుకోవడానికి స్త్రీలు భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరిస్తుంటారని తేలిందట. అంతేకాకుండా ఇలా చేయడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే, వారికి ఆ శృంగారంలో పాల్గొనటం ఇష్టం లేకపోవచ్చు లేదా వారిని అది అంతగా ఆనందపెట్టకపోయి ఉండవచ్చు. ఈ పరిశోధనలో ఆ బృందం కనుక్కున్న విస్తుపోయే విషయాలు ఏమిటంటే, చాలామంది స్త్రీలు శృంగార అనుభవం నచ్చక భావప్రాప్తి విషయంలో నకిలీగా వ్యవహరించామని, అలా చేస్తే ఆ తంతు త్వరగా ముగుంచుకోవచ్చని చెప్పారట.

English summary

Reasons Why Men And Women May Fake An Orgasm

Reasons Why Men And Women May Fake An Orgasm,Faking the orgasm is a common fixture of pop culture, and based on the statistics, you’ve likely either witnessed or committed the behavior yourself. Rather than count how many people fake an orgasm, a recent study from the University of Kansas delved into the reasons why
Story first published: Tuesday, March 13, 2018, 20:00 [IST]