ఓపెన్ రిలేషన్షిప్ గురించి మీరు తెలుసుకోవాల్సిన నియమాలు

By Telugu Samhitha
Subscribe to Boldsky

దీని అర్ధం దాంపత్య పరమైన లైంగిక సంభందం కాకుండా ఇతరులతో అంగీకరింపబడిన పరిస్థితులలో లైంగిక సంబంధాలు లేదా శృంగార సంబంధాలను కలిగి ఉండటం ఓపెన్ రిలేషన్షిప్‌లో అన్ని విషయాలలో ఒక వ్యక్తితో కలసి ఉండటం కానీ మరొక వ్యక్తితో సంభోగ సంబందాన్ని కలిగి ఉండటం.

నేను ఇక్కడ సరళీకృత వివరణని తెల్పుతాను. ఒక ఓపెన్ రిలేషన్షిప్ లో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు క్రమ నిబద్ధతతో ఒక స్వతంత్ర దాంపత్యేతర జీవనశైలికి ఒప్పందం కలిగి ఉంటారు.

ఇక్కడ మీరు ఓపెన్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవలసిన కొన్ని ప్రాథమిక నియమాలు.

పేర్కొనబడిన ప్రధమ నియమాలు :-

పేర్కొనబడిన ప్రధమ నియమాలు :-

ప్రతి సంబంధంలోనూ జంటలు తీసుకువచ్చే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అలాగే ఓపెన్ రిలేషన్షిప్ కు కూడా కొన్ని గ్రౌండ్ నియమాలు ఉండాలి. ఇది సంబంధం యొక్క భాహ్యముఖత్వానికి సంబంధంచిన ప్రాధమిక పెరుగుదలకు కారణమవుతుంది.ఈ వివరణలో భాగంగా ఇతరులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే వాటిని అంగీకరించి తమ సంబంధం విచ్ఛిన్నం కాకుండా ఉండే ఒక విశ్వాసాన్ని ఈ ఓపెన్ రేలషన్షిప్ తీసుకువస్తుంది.

మీ ఓపెన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలనే దాని గురించి చర్చిద్దాం: -

మీ ఓపెన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలనే దాని గురించి చర్చిద్దాం: -

మొదటి సారి మీలో ఈ విషయం గురించిన చర్చ చాలా గందరగోళంగా ఉంటుంది. అందువలన దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. మీ ఇరువురి మనసుల్లోని సమస్యలను అధిగమించడానికి చర్చించండి. ఇది మీ అంతరాలలో ఉన్న గందరగోళ మేఘాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.

ఓపెన్ రిలేషన్షిప్ ప్రారంభించటానికి ముందు మీ విశ్వాసాలు,అంచనాలు, భయాలు మరియు అలాంటి విషయాలన్నీ మాట్లాడి నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వివరాలు అవసరం లేదు: -

వివరాలు అవసరం లేదు: -

మీరు మరియు మీ భాగస్వామి ఒక ఓపెన్ రిలేషన్షిప్ లో ఉండటం ప్రారంభించినట్లయితే మీ సెక్స్ వివరాలు లేదా మరొక వ్యక్తితో గడిపిన సమయాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇది మీ ప్రాధమిక సంబంధంలో కఠినమైన బేదాభిప్రాయాలను కలిగించవచ్చు.ఒక చల్లని కప్ లోకి వేడి విషయాలు ఎప్పుడూ పోయకూడదు అని గుర్తుంచుకోండి. ఒకవేళ అది విచ్ఛిన్నం కావచ్చు లేదా కాకపోవచ్చు.

ఇక్కడ ప్రాధమిక సంబంధానికి మాత్రమే ప్రాధాన్యత: -

ఇక్కడ ప్రాధమిక సంబంధానికి మాత్రమే ప్రాధాన్యత: -

మీరు ఓపెన్ రిలేషన్షిప్ ప్రారంభమైనప్పటికీ ప్రధాన సంబంధం పట్ల మీ ప్రాధాన్యతను ఉంచాలని గుర్తుంచుకోండి. అందరూ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు, కానీ ప్రధాన సంబంధం విషయాన్ని అలా పరిగణించరాదు. ఇది చాలా జంటలు నిర్లక్ష్యం చేసే ఒక ముఖ్యమైన విషయం.

లక్ష్యాలను నిర్దేశించుకోండి ;-

లక్ష్యాలను నిర్దేశించుకోండి ;-

మీరు లేదా మీ భాగస్వామి కొంతకాలం తర్వాత ఈ సంబంధం వద్దు అని కోరుకునే వరకు మీ ఓపెన్ రిలేషన్షిప్ కొనసాగించవచ్చు. కాబట్టి పరస్పర చర్చతో ముగింపు తేదీని నిర్ణయించుకోండి, మరియు లక్ష్యాన్ని నిర్దేశించి ప్రాధాన్యతగా ఉంచడంలో ఖచ్చితంగా ఉండండి. మీరు ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, మీ బహిరంగ సంబంధం ముగించి సాధారణ సంబంధం తిరిగి పొందండి. మీరు ఇరువురు మళ్ళీ ఓపెన్ రిలేషన్షిప్ కోరుకున్నట్లయితే పరష్పర అంగీకారంతో మళ్ళీ తిరిగి పొందొచ్చు. దానికి ఎటువంటి ముగింపు ఉండదు.

అసూయ మిమ్మల్ని అనుసరిస్తుంది: -

అసూయ మిమ్మల్ని అనుసరిస్తుంది: -

మీరు అసూయను నివారించలేరు. మీరు ఓపెన్ రిలేషన్షిప్ లో ముందుకు సాగుతున్నప్పుడు కొంతకాలం అసూయ మిమ్మల్ని వేధిస్తుంది. దాని గురించి మీ భాగస్వామికి తెలియజేయండి. ఆ విధంగా మీరు ప్రతికూలత కంటే సానుకూలత వైపుకు మీ అసూయను ప్రసరించేలా మార్చుకోండి.

మీ ఇతర సంబంధాన్ని కలపకుండా దూరంగా ఉంచండి: -

మీ ఇతర సంబంధాన్ని కలపకుండా దూరంగా ఉంచండి: -

మీ భాగస్వామిని మీ కొత్త ఓపెన్ భాగస్వామితో కలపడానికి ఎప్పుడూ ప్రయత్నించ వద్దు . ఇది జరిగేది కాదు. ఇది మీకు ఇబ్బందులను సృష్టిస్తుంది. ఓపెన్ రిలేషన్షిప్స్ భాహ్యంగా ఉంటాయి. అయినప్పటికీ వాటిని వేరుగా ఉంచడం మంచిది. మీరు మీ ప్రధాన భాగస్వామితో ఏ విధమైన బహిరంగ సంబంధాలను కలపకుండా ఉంచితేనే మీ జీవితంలో ఓపెన్ రిలేషన్షిప్ యొక్క ఆనంద సారాంశం ఉంటుంది.

మీరు కలిసి ఉన్నప్పుడు ఇతరులతో లైంగిక సంబంధం కలిగి ఉండండి: -

మీరు కలిసి ఉన్నప్పుడు ఇతరులతో లైంగిక సంబంధం కలిగి ఉండండి: -

బాహ్యం అవుతున్నట్లు భావిస్తున్న కొత్త సంబంధాల విషయంలో మొదట ఈ నియమాన్ని ప్రయత్నించండి. తమ తమ భాగస్వామి నుండి ఏదైనా రహస్యాలు ఉంచాలని ఎవరూకోరుకోరు. కాబట్టి వారు ఈ నియమాన్ని తీసుకుంటారు.దీని అర్ధం మీ భాగస్వామి మీతో ఉన్నప్పుడు మాత్రమే మీరు మరొకరితో లైంగిక సంబంధం కలిగి ఉంటారు.ఇక్కడ ప్రాధమిక సంబంధంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు.

ముందుకు సాగండి మరియు వినోదభరితంగా ఉండండి: -

ముందుకు సాగండి మరియు వినోదభరితంగా ఉండండి: -

మీకు మీ ఓపెన్ రిలేషన్షిప్ లో సమస్య ఉంటే మరల మీరు సాధారణ సంబంధం కొరకు తిరిగి వెళ్ళవచ్చు.లేదా అది మీకు తగనది అని భావించిన రోజు మరల మీరు మీ సాధారణ జీవితంనకు తిరిగి వెళ్ళవచ్చు. ఒకవేళ మీకు ఇది ఉత్తమమైనదని భావిస్తే దాని కోసం మళ్ళీ సంసిద్దత కావచ్చు. మీ ఆనందానికి ఎన్నటికీ హద్దుల్లేవు.ఇవన్నీ మీరు ఓపెన్ రిలేషన్షిప్ గురించి గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక నియమాలుగా ఉన్నాయి.

మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలను కామెంట్ విభాగంలో పూరించండి. మేము ఈ అంశాన్ని గురించి మరింత సమాచారంతో తిరిగి వస్తాం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Rules That You Need To Know About Open Relationships

    Open relationship is all about staying together but having the openness of sleeping with another.I will put it into a simplified version here. An open relationshipwould mean that two people are in a serious commitment with each other but have a pact of a non-monogamous lifestyle.Here are the basic rules you need to know about open relationships.
    Story first published: Sunday, March 25, 2018, 17:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more