For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన పెళ్లాన్ని పక్కన ఉన్నా.. మా ఆయన పట్టించుకోడు - My Story #43

ఇంత అందమైన పెళ్లాన్ని అతని పక్కన ఉన్నా కూడా పట్టించుకోడు. చాలా సార్లు ఏడుపొస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోడు. ఏడాదైతే అంత సర్దుకుంటుందిలే అని అందరూ అంటున్నారు కొన్ని రోజులు వెయిట్ చేస్తాను.

By Bharath
|

పెళ్లయిన మొదట్లో భార్యాభర్తలిద్దరూ చాలా కలల్లో తేలిపోతుంటారు. ఇదంతా ఒక వారం లేదంటే నెల రోజుల పాటు ఉంటుంది. తర్వాత మళ్లీ పరిస్థితులు మారుతాయి. అమ్మాయిపై అబ్బాయికి ఇంట్రెస్ట్ పోతుంది.. అబ్బాయిపై అమ్మాయికి ఆసక్తి తగ్గుతుంది. ఇందుకు నా కథనే ఉదాహరణ.

ఫైనలియర్ లోనే పెళ్లి

ఫైనలియర్ లోనే పెళ్లి

మా వాళ్లు నాకు పెళ్లి చేయడానికి చాలా సంబంధాలు చూశారు. నేను బీడీఎస్ ఫైనలియర్ లో ఉండగానే నాకు పెళ్లి సంబంధాలు వచ్చాయి. నేను ఎలాగో దంత వైద్యురాలిగా సెటిల్ అవుతాను కాబట్టి నాకు కాబోయే అతను కూడా అదే రంగానికి చెందిన వాడై ఉండాలనకున్నాను.

ఓకే అందామనుకున్నా

ఓకే అందామనుకున్నా

మావాళ్లు నన్ను గవర్నమెంట్ ఎంప్లాయ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. నాకు అస్సలు ఆసక్తి లేదు. కానీ పెద్ద వాళ్లు చెప్పిన మాట వినాలనే ఓకే అన్నాను. అందుకే వాళ్లు ఏ సంబంధం తెచ్చినా ఓకే అందామనకున్నాను.

పల్లెటూరు అబ్బాయికిచ్చారు

పల్లెటూరు అబ్బాయికిచ్చారు

మా ఇంట్లో చివరకు ఒక అబ్బాయిని ఒకే చేశారు. అతనికి ఆస్తి బాగా ఉంది. ఒక్కడే కొడుకు. అక్కాచెల్లెళ్లు కూడా ఎవరూ లేరు. దీంతో అతన్ని మావాళ్లు ఓకే చేశారు. మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాకపోతే అబ్బాయిది పల్లెటూరు.

పంచాయతీ కార్యదర్శి

పంచాయతీ కార్యదర్శి

మా ఆయన పంచాయతీ కార్యదర్శి. ఆయన గ్రూప్ - 2 ఉద్యోగం కోసం ప్రిపేర్ అయితే అది వచ్చిందంట. పొద్దునే లేచి ఆయన అడిగేది బ్రేక్ ఫాస్ట్. స్నానం చేసిన వెంటనే క్యారియర్ పెట్టుకుని పల్లె వెలుగు బస్సు ఎక్కి పల్లెటూరుకి వెళ్తాడు పని చేయడానికి.

హీరోలా ఉంటాడు

హీరోలా ఉంటాడు

చూడడానికి హీరోలా ఉంటాడు. కానీ ఏం చేద్దాం. ఎప్పుడూ చూసినా డ్యూటీ గురించే ఆలోచిస్తాడు. నేను సినిమాలు చూసి చాలా కలలు కన్నాను. పొద్దున్నే లేవగానే నా భర్త నన్ను ముద్దాడుతాడని.. తన కౌగిళ్లలోకి తీసుకుని కాసేపు నన్ను హాయిగా ఉంచుతాడని ఇలా చాలా కలలు కన్నాను. కానీ అందులో ఏవీ కూడా నెరవెరలేదు.

ఎక్కువకాలం కాలేదు

ఎక్కువకాలం కాలేదు

మా పెళ్లి అయి ఏదో పదేళ్లు అయితే సరేలే ఇన్ని రోజులు సరసాలు ఆడుకున్నాం.. సరదగా గడిపాం అని అనుకోవొచ్చు. నెలలు కూడా పూర్తవలేదు. కొన్ని రోజుల క్రితమే మా పెళ్లి అయ్యింది. అప్పుడే జీవితం మొత్తం అర్థం అయ్యేలా చేశాడు మా ఆయన.

చాలా పొదుపు

చాలా పొదుపు

మా ఆయన వచ్చిన జీతంలో అన్ని లెక్కలేసి చాలా పొదుపుగా ఖర్చుపెడతాడు. ఆస్తి బాగానే ఉంది. డబ్బు కూడా బాగానే ఉంది. ఒక్కడే కొడుకు. అయినా ఇంత పిసినారితనం పనికిరాదని నేను అంటే అన్నింటికీ ప్రణాళిక అవసరం అంటాడు.

Image Source :https://timesofindia.indiatimes.com

ఫోన్లతోనే బిజీ

ఫోన్లతోనే బిజీ

ఆదివారం పూట కూడా ఫోన్లలో వీఆర్వోలతో, ఎమ్మార్వోలతో మాట్లాడుకుంటూ ఉంటాడు. సార్.. రేపు ఆ పని ఉంది. ఎల్లుండి జన్మభూమి ఉంది.. తరువాత చెట్లు నాటే కార్యక్రమం ఉందంటూ వాటికి ఎట్ల ప్లాన్ చెయ్యాలి సార్ అంటూ మాట్లాడుతుంటాడు.

Image Source : https://timesofindia.indiatimes.com

ఆ విషయంలో గొడవ

ఆ విషయంలో గొడవ

నాకు ఇంట్లో రోజంతా ఒక్కదాన్నే ఉండడం చాలా బోరుగా ఉంటుంది. మా అత్తమామ వాళ్లు ఊర్లో ఉంటారు. మేము సిటీలో ఉంటున్నా. సిటీ పక్కనే ఉన్న ఒక ఊర్లో మా ఆయన పని చేస్తారు. రోజూ టీవీ చూసుకుంటూ ఇంటి దగ్గర ఉండడమంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. అలా అని నన్ను జాబ్ కు కూడా పంపడట. ఈ విషయంలో నాకు అతనికి రోజూ గొడవ జరుగుతుంది.

Image Source :https://timesofindia.indiatimes.com

ఎక్కడికీ తీసుకెళ్లడు

ఎక్కడికీ తీసుకెళ్లడు

కనీసం సెలవు రోజుల్లో కూడా నన్ను ఎక్కడికీ తీసుకెళ్లడు. నా చదువు అయిపోతేనే నాకు పెళ్లి చేశారు. నాకు ఇప్పటికీ కాలేజీ రోజులే గుర్తొస్తున్నాయి. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎలాంటి ఎంజాయ్ మెంట్ లేదు. అందుకే బాధపడతాను.

ఊరికెళ్లినప్పుడు నరకం

ఊరికెళ్లినప్పుడు నరకం

ఇక పండుగలకు మా ఆయన వాళ్ల సొంతూరికి తీసుకెళ్తాడు. నాకు అక్కడికి వెళ్లాలంటే నరకంలా అనిపిస్తుంటుంది. మా అత్త గయ్యాలి. ఆమె దగ్గర ఒక్కరోజు ఉంటేనే నాకు నరకంలా ఉంటుంది. నా ఏజ్ 23. నాకు అసలు పల్లెటూరి సంప్రదాయాలు తెలియవు. అక్కడి పద్దతులు పాటించి నన్ను కూడా అలా ఉండమని చెబుతుంది.

Image source : https://timesofindia.indiatimes.com

ఫ్యాషన్ బుల్ గా ఉంటా

ఫ్యాషన్ బుల్ గా ఉంటా

నేను ఫుల్ ఫ్యాషన్ బుల్ గా ఊరికెళ్తాను. అక్కడ కూడా జీన్స్, టీ షర్ట్ వేసుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి ఇవే కంఫర్టబుల్. అందుకే వాటినే వేసుకుంటా. పండుగలప్పుడు చీర కట్టకుంటా కానీ అది నాకు సౌకర్యంగా ఉండదు. నేను ఇంకా చిన్నపిల్లనే. మా అత్తమాత్రం నన్ను ఓ యాభై ఏళ్ల మహిళలాగా ట్రీట్ చేస్తుంది. ఆమె టార్చర్ భరించలేను.

Image source : https://timesofindia.indiatimes.com

సంక్రాంతికి తీసుకొచ్చాడు

సంక్రాంతికి తీసుకొచ్చాడు

ఇప్పుడు మా ఆయన సంక్రాతి పండుగకు అని ఊరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఊర్లో నాకు నరకంలా ఉంది. నాకు సంప్రదాయాలంటే ఇష్టమే. వాటిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ మా అత్త మాటలకు మాత్రం నాకు చిరాకు వస్తుంది.

Image source : https://timesofindia.indiatimes.com

ముగ్గులు రావు

ముగ్గులు రావు

నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు వేసే అలవాటు లేదు. నేను పుట్టి పెరిగింది అంతా అపార్ట్ మెంట్ లోనే. అక్కడ ఎక్కడ ముగ్గు లేస్తం చెప్పండి. మా అత్త మాత్రం నీకు అస్సలు ముగ్గులు వేయడానికే రాకుంటే ఎలా అమ్మాయి అంటుంది. ఒళ్లు మండిపోతుంది నాకు.

Image Source : https://timesofindia.indiatimes.com

ఏంటి ఎంజాయ్ చేసేది.. బొంగు

ఏంటి ఎంజాయ్ చేసేది.. బొంగు

మా ఆయన ఊరికి తీసుకొచ్చాడు కదా ఇంట్లో నన్ను వదిలి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లిపోతాడు. నేను ఇంట్లో పడే టార్చర్ ఆయన అస్సలు పట్టించుకోడు. పల్లెటూరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అస్సలు నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తావంటాడు. ఏంటి ఎంజాయ్ చేసేది.. బొంగు. నాకు అంత రివర్స్ ఉంది ఇక్కడ.

సినిమాల్లో మాదిరిగా ఉంటుందనుకున్నా

సినిమాల్లో మాదిరిగా ఉంటుందనుకున్నా

సినిమాల్లో చూపించినట్లు అందరూ కలిసి ఉంటారు. మంచి వాతావరణం ఉంటుంది అనుకున్నా. వామ్మో.. ఇక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. నేను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను నడిచే తీరు దాకా అన్నీ పేర్లు పెడతారు. నా మాటను, నా నడవడికను దేన్నీ మెచ్చుకోరు.

ఏడాది కూడా కాలేదు

ఏడాది కూడా కాలేదు

మాకు పెళ్లి అయి ఇప్పటికీ ఏడాది కూడా కాలేదు. ఇప్పటికీ నన్ను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. మంచి వ్యక్తే కానీ నా ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కదా. అతన్ని నమ్మి వస్తే అతని మానాన అతను ఉంటాడు. ఇంత అందమైన పెళ్లాన్ని అతని పక్కన ఉన్నా కూడా పట్టించుకోడు. చాలా సార్లు ఏడుపొస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోడు. ఏడాదైతే అంత సర్దుకుంటుందిలే అని అందరూ అంటున్నారు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేస్తాను.

English summary

the first year of marriage

the first year of marriage, struggles that married couples face during their first year of marriage
Story first published:Friday, January 12, 2018, 17:42 [IST]
Desktop Bottom Promotion