Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వివాహానికి ముందు ఈ చిట్కాలు పాటించండి... ఒత్తిడికి గుడ్ బై చెప్పండి...
మీ ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి అన్నింటికంటే ముందుగా విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి పెళ్లికి ముందు నెలల్లో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
పెళ్లి గురించి ఆడవారైనా లేదా మగవారైనా ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ఒకే ఒక గొప్ప అవకాశం కాబట్టి. అయితే పెళ్లి గురంచి అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఏవైనా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. వాటి వల్ల కొంత ఒత్తిడికి మరియు టెన్షన్ గురవుతుంటారు.

అవన్నీ మీ ముఖంలో కనిపించడం వంటివి ప్రారంభమయితే అప్పుడు మీ అందమైన రూపం చెడిపోయే అవకాశముంది. పెళ్లి సందర్భంగా మీ ఫొటోలు సరిగ్గా కూడా రాకపోవచ్చు. వాటిని తర్వాత చూసి మీరు జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా పెళ్లి సందర్భంగా ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను, ఒత్తిడిని అధిగమించడానికి ఈ చిట్కాలను పాటించండి..

చింతించడాన్ని వదిలేయండి...
మీరు మీ వివాహం కోసం ప్రతి విషయాన్ని ప్లాన్ చేసే ఏకైక వ్యక్తి మీరే అయితే సునాయసంగా ముందుకు దూసుకెళ్లండి. ఇందుకోసం మీ బెస్ట్ ఫ్రెండ్స్ లేదా ప్రొఫెషనల్ ప్లానర్ ను మీ సమన్వయకర్తలుగా చేర్చండి. అయితే వీటన్నికంటే ముందుగా మీ పెళ్లి చివరి వరకు మీరు చేయాల్సిందల్లా చింతించకుండా ఉండాలి. లేదంటే అదంటే పెద్ద ఒత్తిడిగా మారిపోతుంది. అలాగే మీకు పీస్ ఫుల్ నెస్ ఎక్కడ దొరుకుతుందో ముందే డిసైడ్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న విషయాలను సైతం మీరే చూసుకోకుండా వేరే వారికి అప్పగించండి.

మీ పార్ట్ నర్ తో కమ్యూనికేట్ చేయండి..
పెళ్లి సందర్భంలో మీకు ఒత్తిడిగా భావించే విషయాలలో కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యమైనది. మీ కాబోయే భాగస్వామితో మీకు కమ్యూనికేషన్ లేకపోతే సమస్యలు అక్కడి నుండే స్టార్ట్ అవుతాయి. దీన్ని నివారించడానికి మీరు పారదర్శకంగా ఉండాలి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అన్న అపొహలను వదిలి నేరుగా మీ భాగస్వామితో మాట్లాడటం ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకండి లేదా సిగ్గుపడకండి. దీని వల్ల మీకు ఉన్న సందేహాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు మంచి అనుభూతిని సైతం పొందుతారు.

అర్థం చేసుకోండి..
ఈ సమాజంలో జీవించే ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది సాధారణంగా ఉంటుంది. అయితే దాన్ని అధిగమించడం అంత సులభం కాదు. కాబట్టి మీ భాగస్వామి మీ గురించి ఏమి పట్టించుకోవడం లేదు అనుకోకండి. మీరే అప్పటి పరిస్థితులను బట్టి వారిని అర్థం చేసుకోండి.

వ్యత్యాసాలను వదిలేయండి..
వివాహం చివరి సమయాల్లో కొందరి మధ్య కొన్ని చోట్ల వ్యత్యాసాలు, బేధాభిప్రాయాలు రావడం అనేది అత్యంత సహజం. అయితే అలాంటి సందర్భంలో ఒత్తిడికి గురికాకూడదు. అలాంటి వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీరు మరింత ఒత్తిడికి లోనై నిరుత్సహానికి గురవుతారు.

కనీసం 8 గంటల నిద్ర..
మీ ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి అన్నింటికంటే ముందుగా విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి పెళ్లికి ముందు నెలల్లో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి.

ఆరోగ్యకరమైన ఆహారం..
పెళ్లికి ముందు, వివాహ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. దీని వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే ప్రతిరోజూ కనీసం ఐదు రకాల వేర్వేరు పండ్లు మరియు కూరగాయలను తీసుకోండి. జీడిపప్పు, బెల్లం, బాదం, ఖర్జూర వంటి పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మరియు అదనపు ఉప్పును నివారించండి. దీని వల్ల మంచి నిద్ర పట్టటానికి సహాయ పడుతుంది.

వ్యాయామం
ప్రతి రోజూ చేసే వ్యాయామం వల్ల మన బాడీ, మనసు మంచిగా ఉంటుంది. అయితే మీరు వ్యాయామశాలకు వెళ్లలేకపోతే, నడక మీకు ఉత్తమ ప్రత్యామ్నాయం. వాకింగ్ కోసం బయటికి వెళ్లడానికి రోజుకు కనీసం గంట సమయం కేటాయించుకోండి. ఇది మీ మానసిక స్థితిని, విషయాల గురించి మీ దృష్టిని మారుస్తుంది. మీరు మీ పెళ్లి రోజులో కూడా బాగా కనిపిస్తారు.

రెస్ట్ తీసుకోవడం..
వివాహానికి ముందు వారాంతంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి. ప్రత్యేకమైన ప్రదేశంలో గడిపేందుకు ప్రయత్నించండి. ఇలాంటివి మరచిపోవడానికి కనీసం రెండురోజులు పడుతుంది. మీకు ఇలాంటి అవకాశం లేకపోతే, మీరే కనీసం స్పాను సందర్శించండి. మసాజ్ పాంపర్ అవ్వండి. అది కూడా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

వివాహంలో సంపూర్ణ విజయం మీదే..
మీ పెళ్లికి సంబంధించి ఇతరులు ఏమి కోరుకుంటున్నారనే దాని గురించి మీరు అభిప్రాయాలను వినాలి. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్నది. అయితే ఈ వివాహం మీ అభిరుచుల గురించి అని గుర్తుంచుకోండి. కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రామాణికమైన దాన్ని చేయండి. అప్పుడు మీ వివాహంలో మీకు సంపూర్ణ విజయం లభిస్తుంది.



Click it and Unblock the Notifications











