Just In
- 1 hr ago
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- 1 hr ago
ఇంట్లో తులసి మొక్క ఎండిపోయిందా? జీవితంపై విపరీత ప్రభావం పడుతుంది
- 9 hrs ago
Today Rasi Palalu 06 February 2023: ఈరోజు మేషరాశికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి,తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసు
- 11 hrs ago
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
మంచి శ్రవణ నైపుణ్యాలు సంబంధానికి చాలా కీలకం. అంటే వినడం కూడా ఒక కళ. సంబంధంలో ఉన్నారంటే వినడం అనే కళ తెలిసి ఉండాలి. యాక్టివ్ లిజనింగ్ అనేది స్పీకర్‌కి వారు చెప్పేదానిపై మీరు దృష్టి కేంద్రీకరిస్తున్నారని అభిప్రాయాన్ని అందించడం, కానీ వివాహం లేదా సంబంధాలలో మంచి శ్రోతగా ఉండటం అంతకంటే ఎక్కువ. చాలా మంది దంపతులు ఒకరు చెప్పేది ఒకరు శ్రద్ధగా వినలేరు. ఎదుటివారు చెప్పే విషయాలు, భావోద్వేగ సంభాషణ సరిగ్గా వినకపోతే సరిగ్గా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోకపోతే అపార్థాల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రిలేషన్‌షిప్‌లో మంచి శ్రోతగా ఉండటానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ
భర్త
మీతో
కంటే
ఫ్రెండ్స్‌తోనే
ఎక్కువ
టైం
గడుపుతున్నారా?

పూర్తి శ్రద్ధ పెట్టాలి:
భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు పరధ్యానంగా ఉండకూడదు. ఫోన్ వాడటం, కంప్యూటర్ చూడటం, దిక్కులు చూడటం లాంటివి చేయకూడదు. మాట్లాడే వారి కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడాలి. దీని వల్ల మీరు నిజంగా వింటున్నారని ఎదుటివారు అనుకుంటారు. వారు చెప్పేదానిని మీరు ఆసక్తిగా వింటున్నారని వారు నమ్ముతారు.
ఈ
గుణాలున్న
పురుషులు
మంచి
భాగస్వామి
కాలేరు,
అవేంటంటే..

చురుకుగా వినాలి:
ఎదుటివారు చెప్పడే వినడం మాత్రమే కాదు. వాటి వెనక ఉన్న భావోద్వేగాలను కూడా గమనించాలి. మీరు అర్థం చేసుకున్నారని చూపించడానికి మీరు విన్నదాన్ని మళ్లీ పునరావృతం చేయాలి. మీకు స్పష్టత అవసరమైతే ప్రశ్నలు అడగాలి. ఇది అవతలి వ్యక్తి చెప్పేదానిపై మీకు స్పష్టమైన అవగాహన ఉందని నిర్ధారించుకోవడానికి సహాయం చేస్తుంది. మీరు సంభాషణలో నిమగ్నమై ఉన్నారని చూపించడంలో కూడా సహాయపడుతుంది.
'కోరిక'
ఉంటేనే
సంబంధం
సజావుగా
సాగుతుంది,
దానిని
సజీవంగా
ఉంచడం
ఎలాగంటే..

అంతరాయం కలిగించొద్దు:
సొంత ఆలోచనలు లేదా అభిప్రాయాలతో అవతలి వారు మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించకూడదు. వారు చెప్పేదానిపై మీరు స్పందించాలనుకుంటే వారు మాట్లాడటం ఆపారో లేదో నిర్ధారించుకోవాలి. అంతరాయం కలిగించడం వల్ల అవతలి వ్యక్తి మీరు నిజంగా వారి మాట వినడం లేదని భావించవచ్చు. వారు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోవడం మీకు మరింత కష్టంగా ఉంటుంది.
లైఫ్
పార్ట్నర్తో
ఆరోగ్యకరమైన
సంబంధాన్ని
ఇలా
ఏర్పరచుకోండి

జడ్జిమెంట్ ఇవ్వొద్దు:
ప్రతి ఒక్కరికీ వారి సొంత ఆలోచనలు, భావాలు ఉంటాయి. వారు మీ ఆలోచనలకు భిన్నంగా ఉన్నప్పటికీ అవతని వ్యక్తిని విమర్శించడం లేదా తీర్పు చెప్పడం మానుకోవాలి.
అమ్మాయిల
మనసు
గెలుచుకోవడం
అంతా
ఈజీ
ఏం
కాదు..
కానీ
ఈ
టిప్స్‌తో
ఈజీగా
గెలవొచ్చు

వారి కోణంలో ఆలోచించండి:
అవతలి వ్యక్తి ఏదైనా విషయం చెబుతున్నప్పుడు వారి కోణంలో ఉండి ఆలోచించాలి. అప్పుడు వారు చెప్పేది పూర్తిగా అర్థం అవుతుంది. వారు ఎలా భావిస్తున్నారో మీకు తెలుస్తుంది. వారి భావాల పట్ల శ్రద్ధ వహిస్తున్నారని, వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చూపించండి.
మంచి శ్రోతగా ఉండటం ఏదైనా సంబంధంలో చాలా ముఖ్యం. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ సంబంధాల్లో మెరుగైన శ్రోతలుగా మారవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో బలమైన, మరింత అర్థవంతమైన కనెక్షన్‌లను ఏర్పరచుకోవచ్చు. చురుగ్గా వినడం, శ్రద్ధ చూపడం, అంతరాయాలను నివారించడం, జడ్జ్ చేయకపోవడం వంటివి సంబంధంలో మెరుగైన శ్రోతగా ఉండటానికి కీలకమైనవి.
ఉద్యోగం
కోల్పోయారా,
ప్రమోషన్
రావట్లేదా,
నచ్చిన
జాబ్
దొరకట్లేదా..
మీకోసమే
ఈ
వాస్తు
చిట్కాలు