For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా కలిశాడు.. పెళ్లై.. పిల్లలూ ఉన్నారన్నాడు.. కానీ నన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు...!

|

ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో శక్తి ఉంటుంది.. ఇది ఎవరిలో అయినా పుట్టిందంటే చాలు.. వారి జీవితమంతా ఆనందమయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ నచ్చిన వారితో కలిసి ఉండాలనిపిస్తుంది కాబట్టి.

నచ్చిన వ్యక్తులతో కలకాలం హాయిగా.. ఆనందంగా ఉండిపోతే ఎలా ఉంటుదన్న ఆలోచన రావడం అత్యంత సహజం. కానీ పెళ్లి చేసుకున్న వ్యక్తిని.. అదీ పిల్లలున్న వ్యక్తిపై మనసు పారేసుకుంటే..

అంతటితో ఆగకుండా తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం గురించి తెలుసుకుని.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే.. ప్రస్తుతం ఉన్న భార్య పరిస్థితి ఏమిటి? ఈ సమస్య నుండి తనకు పరిష్కారం చూపగలరని ఓ మహిళ నిపుణులను సంప్రదించింది...

మీ భాగస్వామిని మళ్లీ ప్రేమలో పడేయాలంటే... ఇలా ట్రై చెయ్యండి...!

రెండేళ్ల క్రితం..

రెండేళ్ల క్రితం..

సమస్య : ‘రెండు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని బస్సులో కలిశాను. ముందుగా కళ్లు కళ్లు కలిశాయి... ఆ తర్వాత పరిచయం చేసుకున్నాం. అంతే ఆ వెంటనే మా ఇద్దరి ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం.

నన్ను కలవాలని..

నన్ను కలవాలని..

ఆ తర్వాత తను నన్ను కలవాలని ఉందని చెబుతుండేవాడు. నాకు అతని గురించి తెలుసుకోవాలనిపించి.. అందుకు అంగీకరించాను. అయితే అప్పటివరకు కలవలేకపోయాను. మేం ఎప్పుడూ హద్దు దాటి మాట్లాడుకోలేదు. నార్మల్ ఫ్రెండ్స్ మాదిరిగానే ఉండేవాళ్లం. అప్పుడప్పుడు చాటింగ్ చేసుకునేవాళ్లం.

వేరే వ్యక్తితో పెళ్లి..

వేరే వ్యక్తితో పెళ్లి..

అంతలోపే మా ఇంట్లో వాళ్లు నాకో సంబంధం చూసి పెళ్లి చేసేశారు. అయితే ఆ పెళ్లి కాస్త మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మా కాపురం సజావుగా సాగలేదు. మా సంసారంలో కలహాలు పెరిగి మేమిద్దరం కొన్నాళ్లకే విడిపోయాం. దీంతో అతనితో విడాకులు తీసుకున్నా. తన నుండి విడిపోయి ప్రశాంతంగా జీవించేదాన్ని.

మీ వైవాహిక జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే సందర్భాలు ఉన్నాయి

అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది..

అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది..

అయితే నేను బస్సులో కలుసుకున్న వ్యక్తి నాకు ఓరోజు అకస్మాత్తుగా ఫోన్ చేశాడు. కాసేపు తన గురించి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నా గురించి అడిగాడు... అలా మాట్లాడుతూ ఉండగానే.. ఓ రోజూ నన్ను సర్ ప్రైజ్ చేశాడు.

తొలిచూపులోనే ప్రేమ..

తొలిచూపులోనే ప్రేమ..

తొలి చూపులోనే నన్ను ప్రేమించానని.. తనకు పెళ్లి అయ్యిందని.. పిల్లలు కూడా ఉన్నారని.. అందుకే ఆ విషయం బయటకు చెప్పలేకపోయానని చెప్పాడు.. తన మాటల్ని బట్టి అతనికి భార్య అంటే ఇష్టం లేదేమో అనిపించింది.

బలవంతంగా పెళ్లి..

బలవంతంగా పెళ్లి..

అతనికి వాళ్ల ఇంట్లో వాళ్లు చాలా బలవంతం చేసి పెళ్లి చేశారట. పెళ్లయిన కొద్ది నెలల్లోనే అతను ఆమె నుండి విడిపోవడానికి ప్రయత్నించాడట. ఆమెను పుట్టింట్లో సైతం వదిలేశాండంట. కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిందట.

పెళ్లైనా ఆ ముచ్చట తీరలేదా... అయితే ఈ చిట్కాలను ట్రై చెయ్యండి.. రొమాన్స్ లో రెచ్చిపోండి...!

బిడ్డ పుట్టిన తర్వాత..

బిడ్డ పుట్టిన తర్వాత..

బిడ్డ పుట్టే వరకు తన ఫేసు కూడా సరిగ్గా చూడలేదంట. అయితే తనకు పిల్లలంటే చాలా ఇష్టమని.. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడట. అయితే వారి మధ్య ఎలాంటి శారీరక సంబంధం కూడా లేదట. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే లైంగికంగా కలిసేవారట'

ఇప్పుడు డైవర్స్ అంటున్నాడు..

ఇప్పుడు డైవర్స్ అంటున్నాడు..

‘ఇప్పుడు తను ఆమె నుండి డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాడట.. కానీ, ఆమెకు భరణంగా చెల్లించేందుకు డబ్బులు లేవని అంటున్నాడు. పైగా అతడి కుటుంబ సభ్యులు కూడా తన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారంట. తన తల్లి మంచాన పడిందని.. తన భార్య ఆమెను సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పాడు.

వంట చేయకుండా..

వంట చేయకుండా..

కనీసం ఇంట్లో వంట కూడా చేయకుండా బయటి నుండి ఫుడ్ తెప్పిస్తుందని.. ఈ సమయంలో అతను నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. అతన్ని నేను నమ్మాలా? వద్దా? అనే విషయం నాకేమీ అర్థం కావడం లేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ, అతను ఇంకా ఆమెకు విడాకులు ఇవ్వలేదు ఏం చేయమంటారు' అని ఓ మహిళ చెప్పుకొచ్చింది.

ఈ ప్రశ్నలకు జవాబులు..

ఈ ప్రశ్నలకు జవాబులు..

తనతో పెళ్లంటే ఇష్టమేనా? లేదా తను మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? మీరు అతన్ని పెళ్లి చేసుకొనే పరిస్థితిలో ఉన్నారా? అనే ప్రశ్నలకు మీకు మీరే జవాబులు వెతుక్కోండి. ఎందుకంటే మీరు చట్టం ప్రకారం విడాకులు తీసుకున్నారు.

తను వివాహ బంధంలోనే..

తను వివాహ బంధంలోనే..

ఎందుకంటే తను ఇప్పటికీ వివాహ బంధంలోనే ఉన్నాడు. పైగా ఒక బిడ్డకు తండ్రి కూడా. ఇంకా అతను తన భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు. అతడు తన వివాహ బంధాన్ని విడిచి బయటకు రావడానికి అనేక ఇబ్బందులున్నాయి.

భవిష్యత్తులో సమస్యలు..

భవిష్యత్తులో సమస్యలు..

పైగా అతను తన భార్యకు భరణం చెల్లించేందుకు ఆదాయం లేదంటున్నాడు. తనకు కుటుంబం సపోర్టు కూడా లేదంటున్నాడు. ఇలాంటివన్నీ అధిగమించకుండా మీరు ముందుకెళ్తే.. చాలా సమస్యలు.. సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి మీకు చాలా చిరాకు తెప్పిస్తాయి.

ప్రశాంతంగా ఆలోచించండి..

ప్రశాంతంగా ఆలోచించండి..

ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఆలోచించండి. దీనిపై సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు మాత్రమే ఉంది. మీరు కచ్చితంగా ఏమి చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. ముందుగా మీరిద్దరూ కలిస్తే కలిగే ప్రయోజనాలు.. అదే సమయంలో ప్రతికూలతలను ఓ పేపర్ పై రాసుకోండి.

స్పష్టతతో ఉండండి..

స్పష్టతతో ఉండండి..

మీ వ్యక్తిగత లక్ష్యాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. ఆ వివరాలన్నీ అతనికి స్పష్టంగా చెప్పండి. మీకు ఏం కావాలి? అందుకు అతను ఏం చేయాలనేది కూడా స్పష్టంగా చెప్పండి. అతను తన భార్యకు విడాకులు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో అడగండి. లేదంటే అతని సమస్య.. మీకు కూడా అతి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందది. అతను ఏ మాత్రం తొందరపడ్డా నింద మీ పైనే పడుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

English summary

I love a married guy and he also loves me. I want to marry him. What do I do next?

Here we talking about i love a married guy and he also loves me. i want to marry him. what do i next? Read on