For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మాయిల వివాహ వయసు 18 నుండి 21 ఏళ్లకు ఎందుకు పెంచారో తెలుసా...

|

మన దేశంలో మహిళల వివాహ కనీస వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు ఈ బిల్లును కూడా ఈ పార్లమెంటులోనే ప్రవేశపెట్టి ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేంద్ర కేబినేట్ బుధవారం నాడు డిసెంబర్ 16వ తేదీన ఆమోదముద్ర లభించినట్లు ప్రకటించింది.

దీంతో మహిళల కనీస వయసు 18 నుండి 21 సంవత్సరాలకు పెరిగింది. ఇప్పటివరకు మన దేశంలో మహిళలు వివాహం చేసుకోవాలంటే కనీస వివాహ వయసు 18 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయసు పరిమితి పెంపును అమలు చేసేందుకు.. బాల్య వివాహాల నియంత్రణ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్టులలో సవరణలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం జయా జైట్లీ సారథ్యంలో నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ను కమిటీని కూడా నియమించింది. ఇదిలా ఉండగా కేంద్రం అకస్మాత్తుగా అమ్మాయిల పెళ్లి వయసుకు సంబంధించి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది.. దీనికి గల కారణాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సంబంధమా.. వివాహమా? మొదటి డేట్ న మీ కాబోయే జీవిత భాగస్వామిని ఈ ప్రశ్నలను అడగండి...

చిన్న వయసులో..

చిన్న వయసులో..

మన దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు 18 ఏళ్లు నిండి నిండక ముందే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అయితే అమ్మాయిలు చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వారికి పుట్టే పిల్లలు అనారోగ్యంగా ఉంటున్నారని, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాస్క్ ఫోర్స్ టీమ్ లోని ప్రభుత్వ నిపుణులు వీకే పాల్, వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖాధికారులు అభిప్రాయపడ్డారు.

కుటుంబ పరిస్థితులు..

కుటుంబ పరిస్థితులు..

అమ్మాయిలు 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటే కుటుంబ పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని.. అదే 21 సంవత్సరాల తర్వాత చేసుకుంటే.. కుటుంబం, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయని ఆ టాస్క్ ఫోర్స్ టీమ్ అభిప్రాయపడింది.

అమ్మాయిలూ ఓకే అన్నారట..!

అమ్మాయిలూ ఓకే అన్నారట..!

అమ్మాయిల వివాహ వయసు పెంపు గురించి కొన్ని కళాశాలల్లో, ఇతర చోట్ల సర్వేలు నిర్వహించగా.. మెజార్టీ శాతం అమ్మాయిలు వివాహ వయసు కనీసం 21 సంవత్సరాలు ఉండాలని సమాధానం ఇచ్చారట. వీటన్నింటిని ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ కనీస వయసు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిద్ర గ్యారంటీ!

వయసు తేడా..

వయసు తేడా..

ఇటీవలి కాలంలో పెళ్లికొడుకు, పెళ్లి కుమారుల మధ్య వయసు తేడా పెద్దగా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఏంటంటే.. వివాహం చేసుకోబోయే వ్యక్తి వయసు గురించి ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు పూర్తి క్లారిటీ ఉండటమే. కొందరికి ఏజ్ గ్యాప్ పెద్దగా ఇబ్బందిగా అనిపించదట.

ఆలోచనల్లో తేడాలు..

ఆలోచనల్లో తేడాలు..

కొందరు అమ్మాయిలు వివాహ వయసు గురించి తమ అభిప్రాయాన్ని ఇలా చెప్పారు. ‘నేను నా ప్రియుడితో డేటింగ్ చేసే సమయానికి నా ఏజ్ 23 సంవత్సరాలు, తన వయసు 28 సంవత్సరాలు. ఇప్పటికీ మా ఇద్దరి ఆలోచనలు, ఆశయాలు వేర్వేరుగానే ఉంటాయి. అయితే నేనేమో వయసులో చిన్నదాన్ని. తనేమో ఏ విషయమైనా సీరియస్ గా తీసుకునే దశలో ఉన్నాడు. చిన్న చిన్న గొడవలు వచ్చినా పరిష్కరించుకునేవాళ్లం. కాబట్టి మాకు వయసు గురించి ఎలాంటి ఇబ్బందీ లేదు' అని ఓ మహిళ స్పష్టం చేసింది.

కొందరు వ్యతిరేకించారు..

కొందరు వ్యతిరేకించారు..

అమ్మాయిల వివాహ వయసు పెంపుదలను కొందరు మహిళలు వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలపై ఎక్కువ ప్రభావం పడుతోందట. అక్కడ మగవారితో పోలిస్తే.. ఆడవారి చదువుకు, వారితో ఉద్యోగాలు చేయించడానికి తక్కువ ప్రియారిటీ ఇస్తారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వారికి పోషకాహారం కూడా తక్కువగానే అందుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాల్లో సర్వీసు కష్టమే. అందుకే అమ్మాయిలకు త్వరగానే పెళ్లిళ్లు చేసేస్తుంటారు. అందుకే రూరల్ ఏరియాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతుంటాయని చెబుతున్నారు.

మన దేశంలో ఇప్పటినుండి మహిళల వివాహ కనీస వయసు ఎంత?

మన దేశంలో మహిళల వివాహ కనీస వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ బిల్లును కూడా ఈ పార్లమెంటులోనే ప్రవేశపెట్టి ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేంద్ర కేబినేట్ బుధవారం నాడు డిసెంబర్ 16వ తేదీన ఆమోదముద్ర లభించినట్లు ప్రకటించింది. దీంతో మహిళల వివాహ కనీస వయసు 18 నుండి 21 సంవత్సరాలకు పెరిగింది.

ఇంతకుముందు మన దేశంలో అమ్మాయిల వివాహ వయసు ఎంత?

మన దేశంలో 2021 సంవత్సరానికి ముందు వరకు మహిళలు వివాహం చేసుకోవాలంటే కనీస వివాహ వయసు 18 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయసు పరిమితి పెంపును అమలు చేసేందుకు.. బాల్య వివాహాల నియంత్రణ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్టులలో సవరణలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం జయా జైట్లీ సారథ్యంలో నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ను కమిటీని కూడా నియమించింది.

English summary

Marriageable Age Limit For Women May Be Raised To 21 Years In India

The government has decided to raise the legal age of marriage for women from 18 to 21 years, bringing it at par with that of men.
Story first published: Friday, December 17, 2021, 15:29 [IST]